పాతకాలపు 'సూసైడ్ డోర్స్' మళ్లీ వచ్చేశాయి.. అవి ఇప్పుడు లగ్జరీ కార్లలో ఎందుకు వస్తున్నాయో తెలుసా?

కార్ల డిజైన్ కాలానికనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పాత కాలం నాటి ఒక అదిరిపోయే ఫీచర్ మళ్లీ కొత్తగా, బోల్డ్ స్టేట్‌మెంట్‌లా తిరిగి ఎంట్రీ ఇస్తోంది. అవే సూసైడ్ డోర్స్. ఈ డోర్స్ మామూలు కార్ డోర్స్ మాదిరి ముందు నుంచి కాకుండా వెనుక నుంచి తెరుచుకుంటాయి. ఈ డిజైన్ కొత్తదేమీ కాకపోయినా ఇప్పుడు కార్ల కంపెనీలు పాత స్టైల్‌కు కొత్త మెరుగులు దిద్దుతుండడంతో దీనిపై మళ్లీ దృష్టి పడుతోంది.

1930లు, 1940ల నాటి కార్లలో సూసైడ్ డోర్స్ చాలా కామన్‌గా ఉండేవి. లగ్జరీ సెడాన్‌లకు, లిమోసిన్‌లకు ఇవి ఓ అద్భుతమైన లుక్ ఇచ్చేవి. లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి చాలా ఈజీగా ఉండేది. 1960ల నాటి లింకన్ కాంటినెంటల్ కారులో ఈ డోర్స్ చాలా ఫేమస్ అయ్యాయి. ఎక్కడికి వెళ్లినా అందరి చూపు వాటి మీదే ఉండేది.

Suicide doors

అవి అంత బాగున్నప్పటికీ సేఫ్టీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ డోర్స్ మెయిన్‌స్ట్రీమ్ మోడల్స్ నుంచి మెల్లగా కనుమరుగయ్యాయి. పాత డిజైన్‌లలో సీట్‌బెల్టులు లేకపోవడం, సెంట్రల్ లాకింగ్ మెకానిజమ్స్ లేకపోవడం వల్ల కారు నడుస్తున్నప్పుడు డోర్స్ అనుకోకుండా తెరుచుకునే అవకాశం ఉండేది. అది చాలా ప్రమాదకరంగా ఉండేది. ఈ ప్రమాదం నుంచే సూసైడ్ డోర్స్ అనే పేరు వచ్చింది.

ఒకవేళ వెనుక వైపు నుంచి తెరుచుకునే డోర్ కారు కదులుతున్నప్పుడు ముఖ్యంగా హై స్పీడ్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా తెరుచుకుంటే, వేగంగా వస్తున్న గాలి వల్ల ఆ డోర్ పూర్తిగా తెరుచుకుని, ప్రయాణికుడిని బయటకు లాగే ప్రమాదం ఉండేది. సీట్‌బెల్టులు స్టాండర్డ్ అయ్యే ముందు రోజుల్లో ఇది నిజంగానే పెద్ద రిస్క్.

Suicide doors

అంతేకాదు, కారులో నుంచి దిగుతున్న ప్రయాణికులు ఎదురుగా వస్తున్న ట్రాఫిక్‌లోకి డోర్ తెరుచుకోవడం వల్ల ఎక్కువ ప్రమాదంలో పడేవారు. ఒకవేళ ఏ వాహనం అయినా ఢీకొంటే, డోర్ ఒక్కసారిగా మూసుకుపోవడం లేదా దిగుతున్న వ్యక్తికి గాయాలు కావడం జరిగేది.

దీనికి సమాధానం నాస్టాల్జియా, లగ్జరీ, ఇన్నోవేషన్ కలయికలోనే ఉంది. మోడ్రన్ ఇంజనీరింగ్ పాత కాలపు సేఫ్టీ ప్రాబ్లమ్స్‌ను అడ్వాన్స్ డ్ లాకింగ్ సిస్టమ్స్, బలమైన హింజెస్‌తో సరిచేసింది. ఈ రోజుల్లోని సూసైడ్ డోర్స్ అస్సలు డేంజరస్ కావు. అవి ఎక్స్‌క్లూజివిటీ, హై-ఎండ్ డిజైన్‌కు సింబల్‎గా మారాయి.

Suicide doors

రోల్స్ రాయిస్ వంటి బ్రాండ్లు, పొడవైన వీల్‌బేస్ ఉన్న లగ్జరీ వెహికల్స్ ఈ ఫీచర్‌ను అక్కున చేర్చుకున్నాయి. ఇది చూడ్డానికి ఎంత స్టైలిష్‌గా ఉంటుందో, లోపలికి వెళ్లడానికి కూడా అంతే రాయల్ ఫీలింగ్‌ను ఇస్తుంది. ఆ వెనుక డోర్స్ బయటికి తెరుచుకున్నప్పుడు ప్రయాణికులను ఎక్కి కూర్చోండి అని కాకుండా లోపలికి అడుగు పెట్టండని ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయి.

సాధారణ డోర్స్ ఇవ్వలేని ఓ సెరిమోనియల్ ఫీలింగ్‌ను ఇవి అందిస్తాయి. ఈ డోర్స్ కేవలం లుక్స్ కోసమే కాదు. వాటికి ఫంక్షనల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. సూసైడ్ డోర్స్ వల్ల కారులోకి ఎక్కడం, దిగడం చాలా సులువు అవుతుంది. ముఖ్యంగా తక్కువ పార్కింగ్ స్థలాల్లో లేదా వెనుక సీటులో ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ డిజైన్ వల్ల డోర్ పెద్దగా తెరుచుకుంటుంది.

Suicide doors

ఇది వృద్ధ ప్రయాణికులకు లేదా పిల్లలను ఎక్కించే, దింపే తల్లిదండ్రులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే కార్ల తయారీదారులు మళ్లీ ఈ పాతకాలపు ట్రేడ్‌మార్క్‌ను కాన్సెప్ట్ కార్లకు, లిమిటెడ్-ఎడిషన్ మోడల్స్‌కు తీసుకురావడానికి ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు.

వెనుక వైపు నుంచి తెరుచుకునే ఈ డోర్స్ ఇప్పుడు లగ్జరీకి సింబల్‌గా మారడంతో, హై-ఎండ్ కార్లు వీటికి కొత్త గుర్తింపును ఇస్తున్నాయి. 'సూసైడ్' అనే ట్యాగ్‌ను తొలగిస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఒకప్పుడు సేఫ్టీ ప్రాబ్లమ్స్‌తో పక్కకు పెట్టిన ఒక డిజైన్, ఇప్పుడు టెక్నాలజీ సాయంతో లగ్జరీకి, సౌకర్యానికి ప్రతీకగా మారడం నిజంగా ఆసక్తికరమే. 'సూసైడ్ డోర్స్' అనే పేరు భయంకరంగా ఉన్నా, అవి ఇప్పుడు అందిస్తున్న స్టైల్, సౌకర్యం, సేఫ్టీతో కచ్చితంగా లగ్జరీ కార్ల ప్రపంచంలో ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 25, 2025, 11:50 [IST]
English summary
Why are rolls royce and other luxury brands bringing back suicide doors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+