ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ఆసక్తి చూపని జనం.. ఫిబ్రవరిలో భారీగా పడిపోయిన అమ్మకాలు..కారణం ఏంటంటే ?
భారత్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రోజు రోజుకు పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అంతే కాకుండా ఇవి పర్యవరణ హితం కావడంతో వాటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం రాయితీలను కూడా అందజేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలను పెట్టేవాళ్లకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది. అందుకే భారత్లో ఇటీవల ఎలక్ట్రిక్ కార్లుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీలు నిరంతం పోటీ పడుతున్నాయి.
మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కార్లను మార్కెట్లోకి పరిచయం చేస్తున్నాయి. గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ.. ఫిబ్రవరి నెలలో మాత్రం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో క్షీణత కనిపించింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉన్నాయి. అందువల్ల చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య కొంత నెమ్మదిగా పెరుగుతోంది.

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మనం పురోగతి సాధిస్తున్నామని అనుకున్న సమయంలోనే ఫిబ్రవరి నెలలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా గణనీయంగా పడిపోయాయి. సాధారణంగా ఒక నెలలో దాదాపు 10,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతాయని అంచనా. అయితే, గత నెలలో 8,968 ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే అమ్ముడు పోయాయి. అంటే సాధారణంగా అమ్ముడవుతున్న కార్ల కంటే వెయ్యి నుండి 2 వేల మధ్య తక్కువ ఎలక్ట్రిక్ కార్లు గత నెలలో అమ్ముడయ్యాయి.
ఎప్పటి మాదిరిగానే గత నెలలో అత్యధిక ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిన కంపెనీల జాబితాలో టాటా మోటార్స్ అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలో టాటా కంపెనీ 3,825 ఎలక్ట్రిక్ కార్లు విక్రయించింది. గతేడాది ఫిబ్రవరి నెలలో టాటా మోటార్స్ 5,143 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. జనవరి 2025లో 5,245 కంటే ఎక్కువ టాటా ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి.

3,271 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడై టాటా తర్వాత ఎంజి మోటార్ రెండో స్థానంలో ఉంది.గతేడాది ఫిబ్రవరిలో కేవలం 1,096 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించినట్లు ఎంజి మోటార్ చెబుతుంది. ఈ ఏడాది జనవరిలో ఎంజి మోటార్ 4,470 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. దీని తరువాత హ్యుందాయ్ కంపెనీ మూడో స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ ఫిబ్రవరిలో 738 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఈ ఏడాది జనవరిలో 350 ఎలక్ట్రిక్ కార్లను కూడా అమ్మలేకపోయింది.
ఎప్పుడూ మూడవ స్థానంలో ఉండే మహీంద్రా ఈ సారి నాలుగో స్థానానికి దిగజారింది. మహీంద్రా గత నెలలో 424 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. BYD, BMW 5వ, 6వ స్థానాల్లో ఉన్నాయి. ఈ కంపెనీలు గత నెలలో వరుసగా 254, 219 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్ 67 ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాలతో 7వ స్థానంలో ఉంది. సిట్రోయెన్ 59 ఎలక్ట్రిక్ కార్లు విక్రయాలతో 8వ స్థానంలో ఉంది.

వీటితో పాటు గత నెలలో 21 వోల్వో ఎలక్ట్రిక్ కార్లు, 19 కియా ఎలక్ట్రిక్ కార్లు,7 ఆడి ఎలక్ట్రిక్ కార్లు, 2 పోర్స్ఛే ఎలక్ట్రిక్ కార్లు, ఒక్క రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు అమ్ముడయ్యాయి. అన్ని ఇతర ఎలక్ట్రిక్ కార్ కంపెనీల అమ్మకాలు తగ్గుతుండగా, ఇటీవల విడుదల చేసిన క్రెటా ఎలక్ట్రిక్ కారు కారణంగా హ్యుందాయ్ అమ్మకాలు అమాంతం పెరుగుతున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








