వ్యాగన్ఆర్ రూ.4.99 లక్షలు.. ధర, మైలేజ్, సేఫ్టీ..ఈ హ్యాచ్‌బ్యాక్ గురించి తెలుసుకోవాల్సిన 5 పాయింట్స్

మారుతి సుజుకి (Maruti Suzuki) కంపెనీలో ఏళ్ల తరబడి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్‌లో వ్యాగన్ఆర్ (WagonR) అగ్రస్థానంలో ఉంది. దీని టాల్‌బాయ్ (Tall-boy) డిజైన్ సిటీ డ్రైవింగ్‌కు, ఫ్యామిలీ అవసరాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే భారతీయ మార్కెట్‌లో ఈ మోడల్ అంటే ప్రజలకు అంత ప్రేమ. మరి ఈ హ్యాచ్‌బ్యాక్‌ను ఎక్కువ మంది కొనడానికి గల 5 ముఖ్య కారణాలు ఏమిటి? మీరు కొత్త వ్యాగన్ఆర్ కొనాలనుకుంటే, బుక్ చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన ఆ 5 పాయింట్స్ ఇక్కడ చూద్దాం. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

విశాలమైన ఇంటీరియర్
వాగన్ఆర్ అతిపెద్ద ప్లస్ పాయింట్.. దాని విశాలమైన ఇంటీరియర్ స్పేస్. ఈ టాల్‌బాయ్ డిజైన్ కారణంగా కారులోకి ఎక్కడం, దిగడం చాలా సులభం. అందుకే వయసు మళ్లిన వారికి కూడా ఈ కారు బాగా నచ్చుతుంది. ఎంత ఎత్తు ఉన్నవారికైనా సరిపోయే హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ ఇందులో లభిస్తుంది. అంతేకాదు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లోని కార్లలోకెల్లా వాగన్ఆర్ బూట్ స్పేస్ చాలా పెద్దదిగా ఉంటుంది.

Why is Maruti WagonR a Top Seller 5 Main Reasons to Buy This 34 kmpl Mileage Hatchback

తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు
మారుతి సుజుకి కార్లను జనాలు ఇష్టపడటానికి మరొక ముఖ్య కారణం.. తక్కువ నిర్వహణ ఖర్చు (Low Maintenance Cost). మారుతి కార్ల విడిభాగాలు (స్పేర్ పార్ట్స్) సులభంగా, చౌకగా లభిస్తాయి. దేశవ్యాప్తంగా సర్వీస్, రిపేర్ చేయడానికి అనేక వర్క్‌షాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది కస్టమర్‌లకు పెద్ద ఉపశమనం.

డ్యూయల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు (CNG+పెట్రోల్)
వాగన్ఆర్.. పెట్రోల్, CNG (కంపెస్డ్ నేచురల్ గ్యాస్) అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రెండు ఆప్షన్లు అందుబాటులో ఉండటం కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా దేశంలో CNG కార్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా కంపెనీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్‌ను అందిస్తుంది. ఇది కస్టమర్లకు మరింత భద్రతను, మైలేజ్‌ను ఇస్తుంది. CNG మోడల్ సుమారు 34 కి.మీ. మైలేజ్ ఇస్తుందని చెబుతారు.

Why is Maruti WagonR a Top Seller 5 Main Reasons to Buy This 34 kmpl Mileage Hatchback

అధిక రీసేల్ విలువ (Resale Value)
మారుతి సుజుకి కార్ల మరొక ప్రత్యేకత, ముఖ్యంగా వాగన్ఆర్ విషయంలో.. అద్భుతమైన రీసేల్ విలువ ఉండటం. ఎవరైనా ఈ కారును కొనుగోలు చేసి, కొంత కాలం ఉపయోగించిన తర్వాత అమ్మినా, వారికి పెద్దగా నష్టం రాదు. తక్కువ ధరకు కొని, కొద్దిగా మాత్రమే విలువ కోల్పోయి విక్రయించే అవకాశం ఉండటంతో, వాగన్ఆర్ కొనుగోలును ఎవరూ నష్టంగా భావించరు.

మెరుగైన భద్రతా ఫీచర్లు
ప్రస్తుతం వాగన్ఆర్ ధర రూ. 4.99 లక్షల నుంచి రూ. 6.95 లక్షల వరకు ఉంది. ఈ కారులో ఐదుగురు సుఖంగా ప్రయాణించవచ్చు. కంపెనీ ఇటీవల ఈ కారు భద్రతను పెంచింది. బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లు (Airbags) స్టాండర్డ్‌గా అందిస్తోంది. అదనంగా హిల్ హోల్డ్ అసిస్ట్ (Hill Hold Assist), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), EBDతో కూడిన ABS వంటి కీలక భద్రతా ఫీచర్లను కూడా వాగన్ఆర్ కలిగి ఉంది. కొన్నాళ్లుగా ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా నిలిచింది.

More from DriveSpark

Article Published On: Monday, November 17, 2025, 7:15 [IST]
English summary
Why is maruti wagonr a top seller 5 main reasons to buy this 34 kmpl mileage hatchback
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+