అన్ని ఫీచర్లు ఉన్నా అమ్ముడు పోవడం లేదు.. ఈగలు తోలుకుంటున్న షోరూం డీలర్లు

ఫోక్స్‌వ్యాగన్ కార్లు మంచి క్వాలిటీ, డిజైన్‌ కలిగి ఉంటాయని మార్కెట్లో పేరుంది. అయితే, ఈ కంపెనీ నుంచి వచ్చిన ఒక కారు అమ్మకాలలో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. కేవలం ఒక నెలలో కేవలం ఐదు కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. షోరూంలలో వీటిని కొనేందుకు కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి గల కారణాలు, ఆ కారు గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

గత జూన్ నెలలో ఫోక్స్‌వ్యాగన్ అమ్మకాలు సాధారణంగానే ఉన్నాయి. వర్టస్ కారును గత నెలలో 2,000 మంది కొత్త కస్టమర్‌లు కొనుగోలు చేశారు. కానీ, ఇదే సమయంలో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ కారు అమ్మకాలు భారీగా పడిపోయాయి. గత ఏడాది జూన్‌లో 85 టిగువాన్ కార్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది జూన్‌లో కేవలం 5 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, అమ్మకాలు ఏకంగా 94 శాతం పడిపోయాయి.

Volkswagen Tiguan

అమ్మకాలు తక్కువగా ఉన్నాయంటే కారు బాలేదని అనుకోవడానికి లేదు. ఈ టిగువాన్ కార్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 30 రకాల యాంబియెన్స్ లైట్స్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 190 పీఎస్‌ల పవర్, 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. టిగువాన్, స్కోడా కొడియాక్, టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్, కియా స్పోర్టేజ్ వంటి కార్లకు పోటీగా ఉంది. ఈ కారు ధర రూ.35-రూ.38 లక్షల మధ్య ఉంది.

Volkswagen Tiguan

టిగువాన్ అమ్మకాలు తగ్గడానికి ముఖ్య కారణం దాని ధర అని నిపుణులు చెబుతున్నారు. ఈ ధరలో మార్కెట్‌లో చాలా కార్లు ఉన్నాయి. ముఖ్యంగా, టయోటా ఫార్చ్యూనర్ కు ఉన్న మార్కెట్, నమ్మకం చాలా ఎక్కువ. ఫార్చ్యూనర్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో, టిగువాన్ అమ్మకాలు తగ్గుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: అమ్మకాలు తక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్‌లో కస్టమర్లు చాలా తక్కువగా ఉంటారు. ఆ తక్కువ మంది కూడా పేరున్న బ్రాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతుంటారు. అందుకే, టిగువాన్ అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ కారు ధర తగ్గినా, లేదా కొత్త అప్డేట్ వచ్చినా అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.

Volkswagen Tiguan

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 15, 2025, 8:29 [IST]
English summary
Why isnt it selling despite all the features just 5 cars in a month a shock for volkswagen
Read more on: #volkswagen #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+