27కిమీ మైలేజ్.. రెండు కుటుంబాలకు పర్ఫెక్ట్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్నాయ్ కాబట్టే తెగ కొనేస్తున్నారు

రెండు కుటుంబాలు కలిసి వెళ్లడానికి వీలైనంత పెద్ద కారు, అది కూడా మంచి మైలేజ్‌తో వస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఒక కారు ఏకంగా మారుతి కార్లనే వెనక్కి నెట్టేస్తోంది. అదే టయోటా రూమియన్. ఈ కారు అమ్మకాలు ఒక్కసారిగా పెరగడానికి కారణం ఏంటో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

2025 ఏప్రిల్ నెల టయోటా రూమియన్ కారుకు భారతీయ మార్కెట్‌లో చాలా ప్రత్యేకమైనదిగా నిలిచింది. ఈ కారు అమ్మకాలు ఊహించని విధంగా పెరగడమే దీనికి కారణం. తాజాగా విడుదలైన టయోటా రూమియన్ 2025 ఏప్రిల్ అమ్మకాల నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నివేదిక ప్రకారం టయోటా ఏకంగా 2,462 రూమియన్ కార్లను అమ్మి సంచలనం సృష్టించింది.

Toyota Rumion

అయితే, గత ఏడాది అంటే 2024 ఏప్రిల్‌లో కేవలం 1,192 టయోటా రూమియన్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీని ప్రకారం చూస్తే టయోటా రూమియన్ అమ్మకాల్లో 107 శాతం వృద్ధి నమోదైంది. అంటే, టయోటా రూమియన్ అమ్మకాలు రెట్టింపు అయ్యాయి.

గతేడాది ఏప్రిల్‌తో పోల్చడమే కాకుండా, 2025మార్చి నెలతో పోల్చినా టయోటా రూమియన్ అమ్మకాల్లో మంచి వృద్ధి కనిపించింది. 2025 మార్చిలో కేవలం 1,793 టయోటా రూమియన్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ, ఏప్రిల్‌లో ఈ సంఖ్య ఏకంగా 2,462కు పెరిగింది. ఈ విధంగా చూసినా టయోటా రూమియన్ 27.17 శాతం వృద్ధిని నమోదు చేసింది. అందుకే 2025 ఏప్రిల్ నెల టయోటా రూమియన్ కారుకు చాలా ప్రత్యేకమైనదిగా నిలిచిందని చెప్పవచ్చు.

Toyota Rumion

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. టయోటా రూమియన్ అనేది మారుతి సుజుకి ఎర్టిగా రీ-బ్యాడ్జ్ వెర్షన్. అంటే, మారుతి సుజుకి ఎర్టిగా కారులో కొన్ని మార్పులు చేసి టయోటా కంపెనీ దానిని తన బ్రాండ్‌తో రూమియన్ పేరుతో విక్రయిస్తోంది.

కాబట్టి, మారుతి సుజుకి ఎర్టిగాలో ఉన్నట్లే టయోటా రూమియన్‌లో కూడా ప్రయాణికులకు విశాలమైన స్థలం ఉంటుంది. టయోటా రూమియన్‌లో ఏడుగురు వ్యక్తులు సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ఈ కారు పొడవు/వెడల్పు/ఎత్తు వరుసగా 4,420 మిమీ / 1,735 మిమీ / 1,690 మిమీగా ఉన్నాయి. అదే సమయంలో ఈ కారు వీల్‌బేస్ పొడవు 2,740 మిమీ.

టయోటా రూమియన్ కారులో 1.5 లీటర్ పెట్రోల్/5-స్పీడ్ మాన్యువల్, 1.5 లీటర్ పెట్రోల్/6-స్పీడ్ ఆటోమేటిక్, 1.5 లీటర్ సీఎన్‌జీ/5-స్పీడ్ మాన్యువల్ అనే మూడు రకాల ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మంచి మైలేజ్‌ను అందిస్తాయి.

వీటి మైలేజ్ వరుసగా లీటరుకు 20.51 కిమీ, 20.11 కిమీ, 26.11 కిమీగా ఉన్నాయి. కాబట్టి, ఎక్కువ మైలేజ్‌తో పాటు ఎక్కువ మంది ప్రయాణించగల కారు కోసం చూస్తున్న వారికి టయోటా రూమియన్ సరైన ఎంపిక. అంతేకాకుండా ఈ కారులో అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి.

వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫాలో మీ హోమ్ ఫీచర్‌తో కూడిన ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్లు వంటి ముఖ్యమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

అంతేకాకుండా పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, కీ‌లెస్ ఎంట్రీ, హిల్ హోల్డ్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, EBDతో కూడిన ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా, సీట్ బెల్ట్ రిమైండర్, ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా టయోటా రూమియన్‏లో ఉన్నాయి.

టయోటా రూమియన్ స్పంకీ బ్లూ, రస్టిక్ బ్రౌన్, ఐకానిక్ గ్రే, కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్ అనే ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ కారు పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 45 లీటర్లు మరియు సీఎన్‌జీ ట్యాంక్ సామర్థ్యం 60 లీటర్లు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన టయోటా రూమియన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 10.54 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ. 13.83 లక్షలు (ఎక్స్-షోరూమ్).

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి ఎక్స్‌ఎల్6, కియా కేరెన్స్ వంటి కార్లకు టయోటా రూమియన్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది. డీజిల్ ఇంజన్ లేకపోవడం వంటి కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, టయోటా రూమియన్‌కు భారతీయ మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. మారుతి సుజుకి కార్లకు ఉండే మంచి మైలేజ్, ఫీచర్లు, అందుబాటు ధరతో టయోటా బ్రాండ్‌ను కోరుకునే వారికి రూమియన్ ఒక మంచి ఎంపిక.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 16, 2025, 17:50 [IST]
English summary
Why toyota rumion is becoming a popular alternative to maruti suvs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+