కొత్త కారు కొనే వాళ్లు మే 23వరకు వెయిట్ చేయండి.. ఎర్టిగాకు పోటీగా అదిరిపోయే ఫీచర్లతో కియా కొత్త ఎంపీవీ
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా, భారతీయ మార్కెట్‌లోకి మరో సంచలన కారును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అదే కియా కారెన్స్ క్లావిస్. ఇది నిజానికి కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అయినప్పటికీ కొత్త పేరుతో మార్కెట్లోకి వస్తోంది. ఈ కారుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇటీవల ఇదే దీని ధరంటూ ఒక ఫోటో వైరల్ అయింది. కాని ఇది నిజం కాదు.
ఇప్పుడు కంపెనీ స్వయంగా ఈ కారు విడుదల తేదీని ప్రకటించింది. కియా కారెన్స్ క్లావిస్ విశాలమైన, విలాసవంతమైన, లేటెస్ట్ ఫీచర్లతో నిండిన ఒక ఫ్యామిలీ కారు. SUV ఫెసిలిటీస్, లగ్జరీతో కూడిన ఫ్యామిలీ కారును కోరుకునే వినియోగదారుల కోసం కియా దీన్ని ప్రత్యేకంగా రూపొందించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ.25,000 టోకెన్ మొత్తంతో ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ కారును రిజర్వ్ చేసుకోవచ్చు.

ఈ కొత్త కారు మే 23న భారతీయ మార్కెట్‌లో అధికారికంగా విడుదల కానుంది. అంటే, ఈ కారు ధర తెలుసుకోవడానికి భారతీయులు మరో 10 రోజులు వేచి ఉండాలి. మీరు కియా కారెన్స్ క్లావిస్ కొనాలని ఆసక్తిగా ఉంటే ఈ మోడల్‌ను వివరంగా తెలుసుకుందాం. కియా కారెన్స్ క్లావిస్ మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది.
ఇది HTE, HTE (O), HTK, HTK+, HTK+ (O), HTX, HTX (O) అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారు 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది. చిన్న కుటుంబం అయినా పెద్ద కుటుంబం అయినా అందరికీ ఇది సరిపోతుంది. ఈ ఎంపీవీ ఆకర్షణీయమైన అనేక రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ఐవరీ సిల్వర్ గ్లోస్, ప్యూటర్ ఒలీవ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్పార్క్లింగ్ సిల్వర్, అరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్ వంటి రంగుల్లో ఈ కారు లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న కారెన్స్‌లో ఉన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్లే క్లావిస్‌లో కూడా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, 1.5లీటర్ టర్బో పెట్రోల్, 1.5లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 6స్పీడ్ మాన్యువల్, 6స్పీడ్ ఐఎమ్‌టి, 7స్పీడ్ డిసిటి, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఇంజన్‌లు మంచి పనితీరును, ఈజీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. ఫీచర్ల విషయంలో కూడా కియా కారెన్స్ క్లావిస్ తన ముందున్న మోడల్ కంటే ఒక అడుగు ముందే ఉంది.

డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన కొత్త 26.62అంగుళాల పనోరమిక్ స్క్రీన్, ఆఫ్-సెట్ కియా లోగోతో కూడిన కొత్త టు-స్పోక్ స్టీరింగ్ వీల్, 8స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, 64రంగుల యాంబియంట్ లైటింగ్, 360డిగ్రీ కెమెరా, అన్ని విండోలను పైకి, క్రిందికి ఆపరేట్ చేసే స్మార్ట్ కీ, రూఫ్-ఫిట్టెడ్ ఎయిర్ వెంట్స్, సీటుకు అమర్చిన ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
రెండవ వరుస సీట్లకు స్లైడింగ్, రీక్లైనింగ్ ఫంక్షన్ కూడా ఉంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, నాలుగు విధాలుగా ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు ఈ ఎంపీవీ ప్రత్యేకతలు. 20కంటే ఎక్కువ డ్రైవర్ అసిస్టివ్ ఫీచర్లతో కూడిన లెవెల్ 2 ADASతో కియా కారెన్స్ క్లావిస్ వస్తోంది. దీనిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, రియర్ సీట్ ఆక్యుపెంట్ అలర్ట్, మొత్తం 18యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఈ వాహనంలో ఉన్నాయి.

కియా కారెన్స్ క్లావిస్ ఒక ప్రీమియం వాహనం కోరుకునే వారికే. కాబట్టి మీరు ఒక ఫ్యామిలీ కారు కొనాలని ఆలోచిస్తుంటే, మరో 10 రోజులు వేచి ఉండి క్లావిస్ ధరను పరిశీలించండి. ఇన్నోవా కంటే తక్కువగా, కానీ కారెన్స్, ఎర్టిగా కంటే ఎక్కువ స్థాయిలో ఉండే ఫ్యామిలీ కారును కోరుకునే వారిని క్లావిస్ ఖచ్చితంగా సంతృప్తిపరుస్తుంది. దాదాపు రూ.11లక్షల నుండి క్లావిస్ ధర ప్రారంభం కావచ్చని అంచనా.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








