పైకప్పు మీద రివర్స్‌లో పరుగులు పెట్టిన కారు.. మహా అద్భుతాన్ని ఆవిష్కరించారు.. వైరల్‌గా హైపర్ కారు వీడియో

మనం సాధారణంగా రోడ్లపై ప్రయాణించే కార్లను చూస్తుంటాం. అయితే ఇటీవల కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. అంచనాలకు ఊహించని విధంగా సాంకేతికత అభివృద్ది చెందింది. తాజాగా కారును రివర్స్‌లో పైకప్పుకు అనకుని నడిచే విధంగా రూపొందించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి రివర్స్ కారు ఇటీవల తయారైంది. ఇది సొరంగాల్లో తలక్రిందులుగా నడుస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. ఈ ప్రత్యేక కారులో టైర్లు పైన ఉంటాయి, కానీ డ్రైవర్, ప్రయాణికుల కేబిన్ కింద భాగంలో ఉంటుంది. అంటే, మీరు కూర్చోవాల్సిన స్థానం నేలవైపు, టైర్లు ఆకాశవైపు ఉంటాయన్న మాట. ఇదో హాలీవుడ్ సినిమాలో చూసినట్టు ఉంది కానీ ఇది రియాలిటీగా జరిగింది. చూడటానికి డిజైన్, ఇంజినీరింగ్ పరంగా ఎంతో వినూత్నంగా, కొత్తగా కనిపిస్తోంది.

ఈ అద్భుతమైన ఆవిష్కరణ వెనుక మెక్‌మర్ట్రీ ఆటోమోటివ్ ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో ఎలక్ట్రిక్ హైపర్‌కార్లను నిర్మించడానికి అనేక కంపెనీలు పనిచేస్తున్నాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. ఆ కంపెనీ 'స్పీర్లింగ్ ప్యూర్ VP1' అనే హైపర్‌కార్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది కేవలం ఒక హైపర్‌కారు మాత్రమే కాదు, అది భవిష్యత్తు కార్లకు ఓ ఉదాహరణగా నిలవనుంది. ఇది ఎలక్ట్రిక్ కారు కావడం వల్ల, పర్యావరణానికి మేలు చేసే టెక్నాలజీతో రూపొందించబడింది.

Speirling Pure Vp1

స్పీర్లింగ్ ప్యూర్ VP1' చూడగానే ఇది సాధారణ కార్లలాగా కాదనిపిస్తుంది. దీని డిజైన్ అతి తక్కువ శరీరాన్ని కలిగి ఉండేలా రూపుదిద్దబడింది. బరువు తక్కువగా ఉండటంతో పాటు, ఈ కారు టాప్ స్పీడ్‌ను అందుకోగలదు. హైపర్‌కార్లకు ప్రత్యేకంగా ఉండే ఎయిరోడైనమిక్స్, స్పెషల్ ఇంజినీరింగ్ ఎలిమెంట్స్ దీన్ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాయి. ఇటీవలే ఇంగ్లాండ్‌లో మెక్‌మర్ట్రీ స్పెర్లింగ్ ప్యూర్ VP1కు టెస్ట్ రన్ నిర్వహించారు.

ఈ ప్రత్యేక టెస్ట్ కోసం, కారును 360 డిగ్రీలుగా తిరిగే ఓ ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌పై ఉంచారు. సాధారణ కార్లు నిలబడటానికి భూమికి తలవంచుతుంటే, ఈ కారు పూర్తిగా భిన్నంగా పనిచేసింది. దాని ప్రత్యేక ఫ్యాన్ టెక్నాలజీ ద్వారా కారుకు 2000 కిలోల డౌన్‌ఫోర్స్-ఆన్-డిమాండ్‌ను ఉత్పత్తి చేశారు. ఆశ్చర్యకరంగా, అప్పటికి కారు ఏ వేగంతోనూ కదలడం లేదు. తలకిందులుగా ఉన్నప్పుడు మాత్రం మెళ్లగా కదలడం ప్రారంభించింది.

Worlds First Hypercar

ఈ అద్భుతమైన కారు ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. దీన్ని వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ ప్రణాళిక చేస్తుంది. కానీ ఇప్పుడే ఇది ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కారును అభివృద్ధి చేయడంలో ప్రధాన లక్ష్యం, ఫార్ములా-1 స్థాయి రేసింగ్ స్పీడ్, గమ్యం, గ్రౌండ్ కంట్రోల్‌ను సాధించడం. ఇది రేసింగ్ ట్రాక్‌ల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దిన కారే.

ఈ టెస్టింగ్ సమయంలో, కారును నడిపిన వ్యక్తి ఇంకెవరో కాదు మెక్‌మర్ట్రీ ఆటోమోటివ్‌కు సహ వ్యవస్థాపకుడు అయిన థామస్ యేట్స్. రేసింగ్ గేర్‌లో, ఆయనే స్వయంగా వాహనాన్ని పరీక్షించి, దాని సామర్థ్యాన్ని నిరూపించాడు. సాధారణంగా హై స్పీడ్ వాహనాలు తిరిగే సమయంలో కంట్రోల్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ టెక్నాలజీ రేసింగ్ ట్రాక్‌పై కారుకు బలమైన గ్రిప్‌ను ఇస్తుంది, దానివల్ల అది ట్రాక్‌పై ఉండి, పడి పోకుండా నిలబడగలదు.

Pure Vp1 That Can Drive Upside Down Tested

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇదే డౌన్‌ఫోర్స్ టెక్నాలజీ ట్రాఫిక్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, ఒక సొరంగంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే, ఈ కారు సొరంగం పైకప్పుకు అతుక్కుని గబ్బిలంలా రివర్స్‌గా కదలడం మొదలుపెడుతుంది. వినడానికి సినిమాలా ఉన్నా, ఇది సాంకేతికంగా సాధ్యమైన ఒక అంశం. ప్రస్తుతం టెస్టింగ్‌కు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 24, 2025, 15:45 [IST]
English summary
Worlds first hypercar speirling pure vp1 that can drive upside down tested
Read more on: #electric car #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+