అమ్మల కోసం సూపర్ కార్స్.. డ్రైవింగ్ కంఫర్ట్ గా ఉండే వీటిని ‘మదర్స్ డే’ కానుకగా వారికి గిఫ్టుగా ఇచ్చేయండి
ప్రతేడాది మే 11న మాతృ దినోత్సవం(Mothers Day) జరుపుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుటుంబానికి పెద్దగా అమ్మ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. వారికి వాహనం నడపడం కూడా ఒక గొప్ప విషయమే. ప్రస్తుతం చాలా కుటుంబాల్లో తల్లులు స్వయంగా కార్లు నడుపుతున్నారు. అలాంటి భారతీయ తల్లులకు డ్రైవింగ్ ఈజీ చేసే కార్ల గురించిన పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.
ఈ లిస్టులో వాహనాన్ని కొని మీరు మీ అమ్మకు మదర్స్ డే గిఫ్టుగా ఇవ్వవచ్చు. ఈ జాబితాలో మొదటి స్థానంలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా కారు ఉంది. ఈ కారు భారత మార్కెట్‌లో రూ.12.94 లక్షల నుంచి రూ.24.15 లక్షల ధరల రేంజ్లో విక్రయించబడుతోంది. ఈ కారు మొత్తం 59 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.

ఈ కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే ఆటోమేటిక్ సీవీటీ, ఆటోమేటిక్ డీసీటీ, ఆటోమేటిక్ డీసీ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ధర రూ.16.66 లక్షల నుంచి రూ.24.15 లక్షల వరకు ఉంది. ఈ కారులో పిల్లల సేఫ్టీ కోసం బెస్ట్ సేఫ్టీ రేటింగ్, చైల్డ్ సీట్ యాంకర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
తరువాత స్థానంలో మహీంద్రా కంపెనీకి చెందిన ఎక్స్‌యూవీ 700 కారు ఉంది. ఈ కారు రూ.17.10 లక్షల నుంచి రూ.30.88 లక్షల ధరల రేంజ్లో విక్రయించబడుతోంది. ఈ కారు మొత్తం 66 రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారును కొనడానికి ప్రజలు చాలా రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది.

ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారులో ఆటోమేటిక్ డీసీ అనే ఒకే ఒక ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ల ధర రూ.21.68 లక్షల నుండి రూ.30.88 లక్షల వరకు ఉంది. ఈ కారులో కూడా సేఫ్టీ ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. క్రాష్ టెస్ట్ పరీక్షలో ఈ కారు 5 స్టార్ రేటింగ్‌ను పొందింది.
తరువాత స్థానంలో టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ కారు ఉంది. ఈ కారు రూ.23.29 లక్షల నుంచి రూ.38.04 లక్షల ధరల రేంజ్లో విక్రయించబడుతోంది. కుటుంబంతో అందరూ కలిసి ప్రయాణించడానికి ఇది అనువైన కారు. ఈ కారు మొత్తం 11 రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు బాగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి.

ఈ కారులో ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ల విషయానికి వస్తే సీవీటీ, ఈ-సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ కలిగిన కార్ల ధర రూ.23.29 లక్షల నుండి రూ.24.85 లక్షల వరకు ఉంది. ఈ కారు కూడా సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు అధిక ధరలో విక్రయించబడుతున్న కార్లలో ఒకటి.
తరువాత స్థానంలో కియా కంపెనీకి చెందిన సోనెట్ కారు ఉంది. ఈ కారు ధర రూ.8.99 లక్షల నుండి రూ.18.45 లక్షల వరకు ఉంది. ఈ కారు మొత్తం 20 రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు కుటుంబంతో ప్రయాణించడానికి అనువైన కారు.

ఈ కారులో ఆటోమేటిక్ వేరియంట్‌ల విషయానికి వస్తే డీసీటీ, టార్క్ కన్వర్టర్ అనే రెండు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ధర రూ.14.61 లక్షల నుంచి రూ.18.45 లక్షల వరకు ఉంది. కుటుంబంతో సురక్షితంగా ప్రయాణించడానికి ఇది ఒక బెస్ట్ కారు.
తరువాత స్థానంలో మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో ఎన్ కారు ఉంది. ఈ కారు రూ.16.53 లక్షల నుండి రూ.29.71 లక్షల ధరల రేంజ్లో విక్రయించబడుతోంది. ఈ కారు భారతదేశంలో సురక్షితమైన ఫీచర్లలో ప్రత్యేకమైనది. ఈ కారును భారతీయులు చాలా కాలంగా ఇష్టపడుతున్నారు.
ఈ కారు మొత్తం 46 రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లలో విక్రయించబడుతోంది. ఇందులో ఆటోమేటిక్ గేర్ ఆప్షన్లలో టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ల ధర రూ.20.31 లక్షల నుండి రూ.29.71 లక్షల వరకు ఉంది.
ఒకప్పుడు డ్రైవింగ్ అనేది పురుషులు మాత్రమే చేస్తారన్న భావన ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. చాలా మంది మహిళలు ఇప్పుడు కార్లు నడపడం ప్రారంభించారు. దీనికి ముఖ్య కారణం కార్ల తయారీదారులు చాలా మంది మహిళలు ఈజీగా వాహనం నడిపే విధంగా టెక్నికల్ అంశాలను ఉపయోగించి వాహనాలను తయారు చేస్తున్నారు.
ఇందులో ముఖ్యమైన విషయం గేర్‌బాక్స్. మాన్యువల్ గేర్‌బాక్స్ మహిళలు నడపడానికి కష్టంగా ఉండేది. దానికి వరంగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ వచ్చింది. దీని వల్ల క్లచ్ తొక్కాల్సిన అవసరం లేదు. స్కూటర్ నడిపినట్లుగా ఇప్పుడు కారును నడపవచ్చు. దీని వల్ల భవిష్యత్తులో చాలా మంది తల్లులు కార్లు నడపడం చూడవచ్చు. నేటి యువతులు రేపటి తల్లులుగా మారబోతున్నారు. కాబట్టి రేపటి తల్లులకు కూడా ఈ జాబితాలోని కారును బహుమతిగా ఇవ్వవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారతదేశంలో మహిళలను చాలా ఎక్కువగా గౌరవిస్తారు. మహిళలు నిరంతరం అభివృద్ధి చెందడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇంట్లో అమ్మను ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చడానికి వాహనాలు ఉపయోగపడుతున్నాయి. ఈ జాబితాలోని కార్లను మాతృ దినోత్సవం నాడు మీ అమ్మకు బహుమతిగా ఇవ్వచ్చు. ఈ మాతృ దినోత్సవం నాడు ప్రపంచంలోని ప్రతి బిడ్డను కని పెంచే తల్లి త్యాగాన్ని మనం కొనియాడుదాం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








