ఒక్కకారు కోసం ఒక్కరోజులో 2 లక్షల మందికి పైగా ఎగబడ్డారు.. దీనికి అంత డిమాండ్ ఎందుకో?
చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన షియోమి (Xiaomi), ఇప్పుడు ఆటోమొబైల్ రంగానికీ అదే ఉత్సాహంతో అడుగుపెడుతోంది. ఫోన్ లాంటి ధరకు టాప్-క్లాస్ ఫీచర్లు ఇచ్చి వినియోగదారుల మనసు గెలుచుకున్న ఈ బ్రాండ్, ఇప్పుడు కార్ల రంగంలో కూడా అదే ఫార్ములాను పాటిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ బ్రాండ్ మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా, అవసరమైతే కార్లు కూడా తయారు చేయగలదని ఇప్పటికే నిరూపించింది. ఈ దిశగా Xiaomi అడుగులు వేస్తున్నప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా టెక్, ఆటోప్రియుల దృష్టి ఈ బ్రాండ్‌పై నిలిచింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EVs) రంగంలో Xiaomi ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ, ఇప్పటికే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.
ఇటీవల విడుదలైన Xiaomi తాజా ఎలక్ట్రిక్ SUV వైయూ7(YU7), చైనాలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. దీని డిజైన్, టెక్నాలజీ, ధర వంటి అంశాలన్నీ కస్టమర్‌కు నచ్చేలా ఉండటంతో, మార్కెట్‌లో విడుదలైన 18 గంటల్లోనే ఏకంగా 2.4 లక్షలకు పైగా బుకింగ్స్ దక్కించుకుంది. ఇది లాంచ్ మాత్రమే కాదు... చైనీస్ EV రంగంలో ఒక సంచలన ఘటనగానే నిలిచింది. ఇది ట్రెడిషనల్ ఆటోమొబైల్ బ్రాండ్‌లకు గట్టి పోటీగా మారే విధంగా రూపుదిద్దింది.

Xiaomi, SU7 సెడాన్ లాంచ్ చేసి ఓ సంవత్సరం తరువాత తన తదుపరి YU7 SUVను చైనాలో అధికారికంగా ఆవిష్కరించింది. మొబైల్ టెక్నాలజీ దిగ్గజం నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్ వాహనం ఇది కావడంతో మార్కెట్‌లో దీనిపై భారీ హైప్ నెలకొంది. చైనా మీడియా నివేదికల ప్రకారం, YU7 ఆద్యంతం అనూహ్యంగా ఆకట్టుకుంది. ఈ SUV లాంచ్ అయిన కేవలం మూడు నిమిషాల్లోనే సుమారు 2 లక్షల ప్రీ-ఆర్డర్‌లు నమోదయ్యాయి.
అంతే కాకుండా, ఒక గంటలో ఈ సంఖ్య 2.89 లక్షలకు పెరిగింది. అంటే కేవలం ఫోన్ మార్కెట్‌కి మాత్రమే కాదు, ఆటో మార్కెట్‌కి కూడా Xiaomi పూర్తిగా సిద్దమైందని చెప్పక తప్పదు. ఇది ఓ ఎలక్ట్రిక్ SUVకి సాధారణ స్పందన కాదు, ఇది పూర్తిస్థాయిలో ఒక సెన్సేషన్. YU7 SUV ధర 253,500 యువాన్లు, అంటే సుమారుగా రూ. 30 లక్షల వరకూ ఇండియన్ కరెన్సీలో ఉంటుంది.

ఈ ధరకు ఇచ్చే ఫీచర్లు, పనితీరు వల్లే దీనిపై అంత డిమాండ్ నెలకొంది. Xiaomi తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV అయిన YU7ని వినియోగదారుల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ ఉన్నాయి, అందులోనూ రేర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) కాన్ఫిగరేషన్‌లు వినియోగదారులకు అనుకూలంగా ఉంటాయి.
ఎంట్రీ-లెవల్ వేరియంట్లు వెనుక చక్రాల డ్రైవ్(RWD)తో పని చేస్తాయి. ఇవి ఎక్కువ రేంజ్ అందిస్తాయి. ఇక డ్యూయల్ మోటార్ వేరియంట్లు అయితే, AWD(All-Wheel Drive) టెక్నాలజీతో వస్తూ, అధిక శక్తి, టార్క్, ట్రాక్షన్‌ను అందిస్తాయి. Xiaomi ప్రకారం, డ్యూయల్ మోటార్ మోడల్ 288kW పవర్, 528 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. CLTC రేంజ్ ప్రకారం, 96.3kWh బ్యాటరీ ప్యాక్ (RWD)తో 835 కి.మీ వరకు రేంజ్ అందించగలదు.

అదే YU7 AWD Pro(96.3kWh బ్యాటరీ, AWD) 760 కి.మీ వరకు రేంజ్ అందించగలదు. 101.7kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను పొందే టాప్-ఆఫ్-ది-లైన్ AWD Max 770 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఈ మూడు వేరియంట్లు చూస్తే, Xiaomi EV విభాగంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికాయి. ముఖ్యంగా 835 కి.మీ వరకు ఒకే ఛార్జ్‌లో ప్రయాణించగల SUV EV బ్రాండ్‌లను కూడా తీవ్రంగా గమనించేలా చేస్తోంది.


Click it and Unblock the Notifications








