కేవలం 15 నిమిషాలు.. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లొచ్చు.. స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నాలజీకి టెస్లా షాక్!

చైనా‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి (xiaomi) ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోన తన స్థానాన్ని బలపర్చుతోంది. సంస్థ తొలిసారి విడుదల చేసిన ఎలక్ట్రిక్ సెడాన్ SU7, అంచనాలకు మించి సక్సెస్ అయింది.. ఈ కారుకు మార్కెట్లో విశేష ఆదరణ లభించడంతో షియోమి దాదాపు 2.58 లక్షల కార్లను విక్రయించింది. ఇది సంస్థకు పెద్ద మైలురాయిగా నిలిచింది. తన కార్లకు మంచి డిమాండ్ ఉందని గమనించిన కంపెనీ తన వాహన మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి YU7ని అధికారికంగా ఆవిష్కరించింది. ఈ SUVను ప్రత్యేకంగా టెస్లా మోడల్ Yకి ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చినట్టు కంపెనీ చెబుతోంది. ఇది శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. షియోమి మొబైల్ రంగంలో ఎలాంటి వినూత్నత చూపిందో, అదే స్థాయిలో ఆటోమొబైల్ రంగంలోనూ తనదైన ముద్ర వేయాలని ఈ కారుతో ప్రయత్నిస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ SUV స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రతి వేరియంట్‌కి తగిన విధంగా డిజైన్, శక్తి సామర్థ్యం, డ్రైవింగ్ శైలిలో తేడాలు ఉంటాయి. స్టాండర్డ్ వేరియంట్‌ రియర్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ఇందులో 96.3 kWh సామర్థ్యం కలిగిన ఆశావర్ ELFP బ్యాటరీని ఉపయోగించారు. ఒకే ఛార్జ్‌తో ఇది గరిష్టంగా 835 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

xiaomi Yu7 Electric Car Design Battery And Range

అంటే, ఉదాహరణకు చెన్నై నుండి కన్యాకుమారి వరకు ప్రయాణించాలన్నా ఎలాంటి ఛార్జింగ్ అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఇది దాని శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రో వేరియంట్‌లో మరింత శక్తివంతమైన పనితీరు కోసం ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అమర్చారు. దీనిలోనూ అదే 96.3 kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది గరిష్టంగా 496 PS పవర్‌ను అందించగలదు.

ఒకే ఛార్జ్‌తో ఈ వేరియంట్ సుమారు 770 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. హైవే ప్రయాణాలకు సరిపడే రేంజ్. ఇంకా, స్టాండర్డ్ వేరియంట్‌ 320 PS శక్తిని అందించగలదు. టాప్ వేరియంట్ మ్యాక్స్ 101.7 kWh కెపాసిటీలో కూడిన అత్యాధునిక NCM బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 760 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంటే, ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, హైదరాబాద్ నుండి ముంబయి వరకు ప్రయాణించచ్చు.

xiaomi Yu7 Electric Car Design Battery

దీని టాప్ స్పీడ్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా గంటకు 253 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు. ఈ SUV 0 నుండి 100 కి.మీ. వేగాన్ని కేవలం 3.23 సెకన్లలో చేరగలదు. ఇది స్పోర్ట్స్ కార్ల స్థాయిలో పెర్ఫామెన్స్. దీని ప్రధాన పోటీ అయిన టెస్లా మోడల్ Yతో పోలిస్తే కూడా, YU7 మ్యాక్స్ వేరియంట్ కొంత ముందంజలో ఉంది. మోడల్ Y 510 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది

దీని టాప్ స్పీడ్ 250 కి.మీ. వేగాన్ని అందించగలదు, ఇది YU7 మ్యాక్స్ కంటే కొంచెం తక్కువ. టెస్లా మోడల్ Y లాంగ్ రేంజ్ ఆల్-వీల్ డ్రైవ్ మోడల్ ఇప్పటికే మార్కెట్లో మంచి స్థానం సంపాదించుకుంది. ఇది 78 కిలోవాట్-అవర్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 719 కిలోమీటర్ల రేంజ్ వరకు అందిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.

xiaomi Yu7 Electric Car Design

షియోమి YU7 మరింత వేగంగా ఛార్జ్ అవుతుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 620 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు. ఇది శక్తివంతమైన ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ. అదే టెస్లా మోడల్ Y, 15 నిమిషాల ఛార్జింగ్‌తో 260 కిలోమీటర్ల వరకు మాత్రమే అందిస్తుంది. అంటే, Xiaomi YU7 ఛార్జింగ్ వేగం పరంగా దాదాపు రెండున్నర రెట్లు మెరుగైనది. ఛార్జ్ కోసం ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.

More from DriveSpark

Article Published On: Saturday, May 24, 2025, 11:00 [IST]
English summary
Xiaomi yu7 electric car design battery and range details check here
Read more on: #electric car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+