రూ.2 లక్షల బడ్జెట్‌లో ఇంత కన్ఫ్యూజన్ ఏంటి? ఈ రెట్రో బైకుల్లో ఏది కొంటే కిక్కు వస్తుంది
భారతదేశంలో నియో-రెట్రో (Neo-Retro) మోటార్‌సైకిళ్ల సెగ్మెంట్‌లోకి తాజాగా యమహా XSR155 ప్రవేశించడంతో పోటీ మరింత పెరిగింది. ఇప్పటి వరకు టీవీఎస్ రోనిన్ (TVS Ronin), రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ (Royal Enfield Hunter) మధ్య పోటీ ఉండేది. కానీ ఇప్పుడు మూడో బైక్ రావడంతో బైక్ కొనాలనుకునేవారు కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు.
అయితే ఈ మూడు మోడల్‌లు కూడా రూ.2 లక్షల లోపు ధరలోనే లభిస్తాయి. ముఖ్యంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన యమహా XSR155, మార్కెట్‌ను ఏలుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఆధిపత్యాన్ని అడ్డుకోగలుగుతుందా లేదా అనేది చూడాలి. డిజైన్, పవర్, ధర పరంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షనో తెలుసుకోవడానికి వీటిని పోల్చి చూద్దాం.

డిజైన్, స్టైలింగ్
డిజైన్ పరంగా చూస్తే ఈ రెండు బైక్‌లు మోడ్రన్-రెట్రో స్టైల్‌లో ఉన్నప్పటికీ వాటి రూపురేఖలు వేరుగా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇతర ఎన్‌ఫీల్డ్ మోడళ్ల మాదిరిగానే పాత తరం స్టైల్‌ను అనుసరిస్తుంది. హెడ్‌ల్యాంప్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, టెయిల్ ల్యాంప్‌లతో సహా అన్ని వైపులా పాత స్టైల్ కనిపిస్తుంది.
మరోవైపు యమహా XSR 155 మరింత కాంపాక్ట్‌గా, మినిమలిస్టిక్ బాడీ ప్యానెల్స్‌తో ఆధునిక స్టైల్‌ను కలిగి ఉంది. ఇది రిబ్డ్-పాటర్న్ సీట్‌తో కొంచెం స్క్రాంబ్లర్ లుక్‌ను కూడా ఇచ్చింది. హంటర్ 350 ఏడు రంగులలో లభిస్తుంటే, XSR155 కేవలం నాలుగు కలర్ ఆప్షన్లలో మాత్రమే వస్తుంది.

ఫీచర్లు, టెక్నాలజీ
ఫీచర్ల విషయంలో యమహా XSR155 స్పష్టంగా విన్నర్‌గా నిలుస్తుంది. ఇది పూర్తి డిజిటల్ కన్సోల్‌ను కలిగి ఉంది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా SMS, కాల్ నోటిఫికేషన్‌లు, నావిగేషన్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. ఇంకా ఇందులో ఎల్‌ఈడీ లైటింగ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (ABS), ట్రాక్షన్ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. హంటర్ 350 సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ను కలిగి ఉంది. దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ లేదా స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్‌లను అందించే సౌకర్యం లేదు.
ఇంజిన్, పర్ఫామెన్స్
ఇంజిన్, పవర్ విషయంలో రెండు బైక్‌ల మధ్య భారీ తేడా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 లో 349.34 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి, గరిష్టంగా 20.2 bhp పవర్, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

దీనికి స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ కూడా ఉంది. ఇక యమహా XSR 155 చాలా చిన్నదైన 155 సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో 18.1 bhp పవర్, 14.2 Nm టార్క్‌ను అందిస్తుంది.
పవర్‌ఫుల్ పర్ఫామెన్స్ కావాలంటే హంటర్ 350 మెరుగైన ఆప్షన్. అయితే, XSR155 బరువు కేవలం 137 కిలోగ్రాములు మాత్రమే. ఇది హంటర్ కంటే ఏకంగా 44 కిలోగ్రాములు తక్కువగా ఉండటం వలన రియల్ వరల్డ్‌లో రైడింగ్ సమయంలో XSR155 మెరుగైన చురుకుదనాన్ని చూపించే అవకాశం ఉంది.
ధరల విషయానికి వస్తే ఈ రెండూ రూ.2 లక్షల లోపు బడ్జెట్‌లో పోటీ పడుతున్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: ఎక్స్-షోరూమ్ ధర రూ.1.37 లక్షల నుంచి రూ.1.67 లక్షల వరకు ఉంది. దీని టాప్ వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు రూ.1.97 లక్షలు అవుతుందని అంచనా.
యమహా XSR 155: ఇది ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.52 లక్షలు. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.1.93 లక్షల వరకు ఉంటుంది.
ఈ రెండింటిలో హంటర్ 350 పవర్, టార్క్ పరంగా ముందున్నా, యమహా XSR155 అడ్వాన్సుడ్ ఫీచర్లు, తక్కువ బరువు, 6-స్పీడ్ గేర్‌బాక్స్ కారణంగా పోటీలో నిలుస్తోంది. ఏది కావాలి అనుకునేది మీ అవసరం, బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








