అరె ఏంట్రా ఇది..ఈగలు తోలుకుంటున్న షోరూం వాళ్లు..కియా లగ్జరీ కార్లను ఒక్కరు కూడా కొనలేదా ?
భారతీయ మార్కెట్‌లో కియా (Kia) మోటార్స్ నుంచి సోనెట్, సెల్టోస్ వంటి కార్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఆ కంపెనీ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల (e-SUVs) పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. కియా విడుదల చేసిన అక్టోబర్ నెల సేల్స్ బ్రేకప్‌లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
ఆ రిపోర్ట్ ప్రకారం కియా అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ మోడల్ EV6ను ఒక్క కస్టమర్ కూడా కొనలేదు (సున్నా సేల్స్). ఇక EV9 మోడల్‌ను కేవలం ఒక్కరు మాత్రమే కొనుగోలు చేశారు. అత్యంత అడ్వాన్సుడ్ ఫీచర్లు, భారీ రేంజ్‌తో వచ్చిన ఈ లగ్జరీ కార్లు ఎందుకు అమ్ముడవలేదు? వాటి ప్రత్యేకతలు ఏంటి? కారణాలు ఏమై ఉండొచ్చు? అనే వివరాలు చూద్దాం.

కియా కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల వాటా అతి తక్కువగా ఉంది. EV6, EV9 రెండూ కలిపి అక్టోబర్ నెలలో కేవలం ఒక యూనిట్ మాత్రమే అమ్ముడైందిజ Kia EV6 కారును గత అక్టోబర్‌లో ఎవరూ కొనలేదు. ఇందులో 84kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 663 కి.మీ వరకు ప్రయాణించే రేంజ్‌ను ఇస్తుంది.
Kia EV9 కారు కేవలం ఒక్క యూనిట్ మాత్రమే అమ్ముడైంది. ఇందులో 99.8kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 561 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. కియా ఇటీవల కొత్త EV6 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సింగిల్ వేరియంట్‌లో (GT-Line AWD) విడుదల చేసింది. ఇందులో కొత్త స్టైలింగ్, స్లీక్ హెడ్‌ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.

లోపల కొత్త స్టీరింగ్ వీల్, ట్విన్-స్క్రీన్ పనోరమిక్ సెటప్ (రెండు స్క్రీన్‌లు కలిపి) ఉన్నాయి. ఫీచర్లలో ఫ్రింగర్ ప్రింట్ స్టార్టర్, లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 14 స్పీకర్ల మెరిడియన్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. 325 PS పవర్, 605 Nm టార్క్‌తో ఈ కారు చాలా శక్తివంతంగా ఉంది.
కియా అత్యంత లగ్జరీ ఎస్‌యూవీ అయిన EV9లో 6-సీట్ లేఅవుట్ ఉంటుంది. రెండో వరుసలో ఉన్న కెప్టెన్ సీట్లకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, మసాజ్ ఫంక్షన్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌లు, వెహికల్-టు-లోడ్ ఫంక్షనాలిటీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ కోసం 10 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, 360-డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS ఫీచర్లు (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటివి) ఉన్నాయి. 384 hp పవర్, 700 Nm టార్క్‌తో ఇది 5.3 సెకన్లలో 0-100 kph వేగాన్ని అందుకుంటుంది. ఫాస్ట్ ఛార్జర్ (350 kW DC)తో కేవలం 24 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.
ఈ రెండు కార్లు కూడా భారతదేశంలోకి పూర్తిగా దిగుమతి అవుతాయి. దీని కారణంగా వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అంత ఖరీదైన సెగ్మెంట్‌లో ఈ ఎలక్ట్రిక్ కార్లను కొనే కస్టమర్లు తక్కువగా ఉండటం వల్లే అమ్మకాలు తగ్గాయని తెలుస్తోంది. ఈ అమ్మకాలపై కియా పెద్దగా ఆందోళన చెందడం లేదని భావిస్తున్నారు. ఎందుకంటే అధిక ధరల కారణంగా అమ్మకాలు తక్కువగా ఉంటాయని కంపెనీ ముందుగానే అంచనా వేసి ఉండవచ్చు.


Click it and Unblock the Notifications








