లీటరుకు 27 కిమీ..వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్..రూ. 12 లక్షలకే సరికొత్త హోండా సిటీ లాంచ్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన లగ్జరీ సెడాన్ కారు హోండా సిటీ సరికొత్త అవతారంలో దర్శనమిచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా, తన ఐదవ తరం మోడల్‌కు సంబంధించి రెండో మిడ్-లైఫ్‌సైకిల్ అప్‌డేట్‌గా 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ (2026 Honda City Facelift) వెర్షన్‌ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త డిజైన్ మార్పులు, అధునాతన ఇంటీరియర్ ఫీచర్లు, లగ్జరీ హంగులతో వచ్చిన ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.12 లక్షలుగా నిర్ణయించారు.

భారతదేశంలో సెడాన్ కార్ల విభాగంలో దశాబ్దాలుగా రారాజుగా వెలుగుతున్న హోండా సిటీ, పోటీదారులైన హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో సిద్ధమైంది. ఈ కొత్త 2026 మోడల్‌ను కంపెనీ మొత్తం నాలుగు ప్రధాన వేరియంట్లలో (SV, V, ZX, ZX+) ప్రవేశపెట్టింది. పాత మోడల్‌తో పోలిస్తే ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, కారు వెలుపలి డిజైన్, లోపలి భాగంలో కస్టమర్లను ఆకట్టుకునేలా ఎన్నో వినూత్న సాంకేతిక మార్పులను చేర్చారు.

2026 honda city facelift sedan launched in india price features mileage details telugu

కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగం పూర్తిగా సరికొత్త డిజైన్‌తో రూపుదిద్దుకుంది. ఇందులో మరింత స్లిమ్‌గా ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ను అమర్చారు. వీటికి ఐబ్రో తరహాలో రెండు భాగాలుగా ఉండే సరికొత్త ఎల్ఈడీ డిజైన్, ఒక లైట్ బార్‌ను జత చేశారు. కారు ముందు భాగంలో ఉన్న పాత క్రోమ్ గ్రిల్ స్థానంలో ఇప్పుడు హనీకోంబ్ ఆకారంలో ఉండే సరికొత్త గ్రిల్‌ను అమర్చారు, దీనిపై కారు రంగులోనే ఉండే ప్యానల్‌ను ఇచ్చారు. ఈ సరికొత్త లైటింగ్ సిస్టమ్ ద్వారా రాత్రి వేళల్లో రోడ్డుపై చాలా దూరం వరకు స్పష్టమైన వెలుతురు కనిపిస్తుందని హోండా సంస్థ వెల్లడించింది.

కారు కింది భాగంలో ఉండే ఎయిర్ ఇన్‌టేక్ గ్రిల్ పరిమాణాన్ని పెంచడంతో పాటు బంపర్ అంచులలో త్రిభుజాకారపు ఎయిర్ డక్ట్స్‌ను ఇచ్చారు. ఇది కారుకు మరింత స్పోర్టీ, అగ్రెసివ్ లుక్‌ను ఇస్తుంది. వెనుక వైపు చూస్తే, డ్యూయల్-టోన్ బంపర్, రెండు వైపులా నిలువుగా ఉండే రిఫ్లెక్టర్లతో పాటు కారు బాడీ రంగులోనే ఉండే ఫాక్స్ డిఫ్యూజర్‌ను అందించారు. వీటికి అదనంగా సరికొత్త డిజైన్‌తో కూడిన పదహారు ఇంచుల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కస్టమర్ల కోసం ఒక సరికొత్త ప్రత్యేకమైన బ్లాక్ (నలుపు) కలర్ ఆప్షన్‌ను కూడా హోండా ప్రవేశపెట్టింది.

2026 honda city facelift sedan launched in india price features mileage details telugu

కారు లోపలి భాగంలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. సరికొత్తగా అమర్చిన 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఇది పాత స్క్రీన్ లాగా కాకుండా డ్యాష్‌బోర్డ్ నుండి కొద్దిగా ముందుకు వచ్చేలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఎండకాలంలో ప్రయాణం హాయిగా సాగడానికి వీలుగా ఈసారి ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లను అందించారు. అలాగే కారును అన్ని వైపుల నుండి సులభంగా పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా 360-డిగ్రీల కెమెరా సిస్టమ్‌ను కూడా జోడించారు. డ్యూయల్-టోన్ కలర్ థీమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ నాబ్‌లు, సెమీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మునుపటి లాగే కొనసాగుతాయి.

ఈ ప్రీమియం సెడాన్ కారులో లగ్జరీ ఆడియో అనుభూతి కోసం ఎనిమిది స్పీకర్ల సౌండ్ సిస్టమ్, క్యాబిన్ లోపల మంచి అనుభూతిని ఇచ్చే యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెనుక విండ్‌స్క్రీన్ సన్‌షేడ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా హోండా సిటీ ఎల్లప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఇందులో లెవెల్-2 ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీ, లేన్ వాచ్ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ప్రయాణికుల రక్షణ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డుగా అందించారు.

2026 honda city facelift sedan launched in india price features mileage details telugu

ఇంజన్ సామర్థ్యం విషయానికి వస్తే, 2026 హోండా సిటీలో నమ్మకమైన 1.5 లీటర్ సహజసిద్ధమైన పెట్రోల్ ఇంజన్‌ను కొనసాగించారు. ఇది 121 హార్స్‌పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ సివిటి (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

ఇక మైలేజ్ ఎక్కువగా కోరుకునే వారి కోసం పవర్‌ఫుల్ హైబ్రిడ్ వెర్షన్ ఇ:హెచ్ఈవి (e:HEV) కూడా అందుబాటులో ఉంది. ఇది 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో నడుస్తూ, గరిష్టంగా 126 హార్స్‌పవర్, 253 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ హైబ్రిడ్ మోడల్ లీటరుకు ఏకంగా 27.26 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని ఇస్తుందని సంస్థ పేర్కొంది. అంతేకాకుండా హైబ్రిడ్ విడిభాగాలపై కంపెనీ ఐదేళ్ల వారంటీని కూడా ఇస్తోంది.

2026 honda city facelift sedan launched in india price features mileage details telugu

2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వారీగా పూర్తి ధరల లిస్ట్ (ఎక్స్-షోరూమ్):
1.5 లీటర్ పెట్రోల్ మాన్యువల్ (MT) వేరియంట్లు:
* హోండా సిటీ SV (బేస్ మోడల్): రూ. 12.00 లక్షలు
* హోండా సిటీ V (మిడ్ మోడల్): రూ. 13.30 లక్షలు
* హోండా సిటీ ZX (టాప్ మోడల్): రూ. 15.26 లక్షలు
* హోండా సిటీ ZX+ (ప్రీమియం మోడల్): రూ. 16.15 లక్షలు

1.5 లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ (CVT) వేరియంట్లు:
* హోండా సిటీ V (ఆటోమేటిక్): రూ. 14.30 లక్షలు
* హోండా సిటీ ZX (ఆటోమేటిక్): రూ. 16.26 లక్షలు
* హోండా సిటీ ZX+ (ఆటోమేటిక్ ప్రీమియం): రూ. 17.15 లక్షలు

1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (e:HEV) వేరియంట్:
* హోండా సిటీ ZX+ (స్ట్రాంగ్ హైబ్రిడ్): రూ. 21.00 లక్షలు

Article Published On: Friday, May 22, 2026, 13:39 [IST]
English summary
2026 honda city facelift sedan launched in india price features mileage details telugu
Read more on: #honda city #facelift
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+