రేపటితో ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్.. దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఫేవరెట్ కారు వచ్చేస్తోంది!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు కియా (Kia), భారత మార్కెట్‌లో మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. 2026 జనవరి 2న కియా ఇండియా అధికారికంగా 2026 కియా సెల్టోస్ (రెండవ తరం) కాంపాక్ట్ SUVని భారతదేశంలో విడుదల చేయనుంది. ఇప్పటికే భారతీయ వినియోగదారులలో బలమైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న సెల్టోస్, ఈ కొత్త తరం వెర్షన్‌తో మరింత శక్తివంతంగా మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. కొత్త తరం కియా సెల్టోస్‌లో అప్‌డేట్ చేసిన ఎక్స్‌టీరియర్ డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరింత షార్ప్ లైన్స్, ఆధునిక లైటింగ్ ఎలిమెంట్స్, స్పోర్టీ లుక్‌తో ఈ SUVను మరింత ప్రీమియంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. కియా తన తాజా గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌ను ఈ మోడల్‌లో స్పష్టంగా చూపించనుందని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇంటీరియర్‌ల విషయానికి వస్తే, కొత్త సెల్టోస్‌లో పునరుద్ధరించబడిన క్యాబిన్ డిజైన్‌తో పాటు మరింత టెక్-లాడెన్ సెటప్ ఉండనుంది. ప్రీమియం మెటీరియల్స్, కొత్త కలర్ థీమ్‌లు, పెద్ద డిజిటల్ డిస్‌ప్లేలు, అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఈ SUVని సెగ్మెంట్‌లో మరింత ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి. డ్రైవర్,యు ప్రయాణికులకు సౌకర్యం, లగ్జరీ రెండింటినీ సమతుల్యం చేసేలా కియా ఇంటీరియర్‌ను రూపొందించినట్లు సమాచారం.

ఫీచర్ల పరంగా చూస్తే, రెండవ తరం సెల్టోస్‌లో అనేక కొత్త, ప్రీమియం ఫీచర్లు జోడించనున్నట్లు తెలుస్తోంది. భద్రత, కన్వీనియన్స్, ఇన్ఫోటైన్‌మెంట్ అంశాల్లో గణనీయమైన అప్‌గ్రేడ్‌లు ఉండే అవకాశముంది. దీంతో ఇప్పటికే తీవ్రమైన పోటీ ఉన్న కాంపాక్ట్ SUV విభాగంలో కియా తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ధరల విషయానికి వస్తే, లాంచ్ ఈవెంట్ సమయంలోనే అధికారిక ధరలను వెల్లడించనున్నారు.
కొత్త ఫీచర్లు, అప్‌డేటెడ్ డిజైన్ నేపథ్యంలో ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాబోయే కొత్త తరం కియా సెల్టోస్ ఇంజిన్ ఎంపికల విషయంలో పెద్ద మార్పులు చేయకుండా, ఇప్పటికే మార్కెట్‌లో తన విశ్వసనీయతను నిరూపించుకున్న అవుట్‌గోయింగ్ మోడల్‌లోని మూడు పవర్‌ట్రెయిన్‌లను కొనసాగించనుంది. మొదటిగా 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.

ఈ ఇంజిన్ 113 bhp పవర్, 144 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ పవర్ కోరుకునే వినియోగదారుల కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను కూడా కొనసాగిస్తోంది. ఈ ఇంజిన్ 158 bhp పవర్తో పాటు 253 Nm టార్క్ను అందిస్తుంది. వేగవంతమైన యాక్సిలరేషన్, హైవే డ్రైవింగ్‌లో బలమైన పనితీరును అందించే ఈ టర్బో పెట్రోల్ యూనిట్ సెల్టోస్ లైనప్‌లో అత్యంత పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఆప్షన్‌గా నిలుస్తుంది.
డీజిల్ అభిమానులను కూడా కియా నిరాశపరచలేదు. కొత్త తరం సెల్టోస్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 118 bhp పవర్, 260 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అధిక టార్క్‌తో పాటు మెరుగైన మైలేజీ అందించే ఈ డీజిల్ ఇంజిన్, దీర్ఘ ప్రయాణాలు, హైవే వినియోగానికి మరింత అనుకూలంగా ఉంటుంది. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, అన్ని పవర్‌ట్రెయిన్‌లలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ప్రామాణికంగా అందించనున్నారు.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కోరుకునే వినియోగదారుల కోసం కూడా విస్తృత ఆప్షన్లు ఉన్నాయి. 1.5 లీటర్ NA పెట్రోల్ ఇంజిన్‌తో CVT గేర్‌బాక్స్ అందుబాటులో ఉండగా, టర్బో పెట్రోల్ వేరియంట్‌కు 6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌లు లభించనున్నాయి. ఇక డీజిల్ వేరియంట్‌లో మాన్యువల్‌తో పాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందించనున్నారు. ఫీచర్లు కూడా డజన్ల కొద్ది ఉండబోతున్నాయి. ఇది రూ.12 లక్షల ఎక్స్ షోరూమ్ ధరలో లభించవచ్చు.
ఈ కొత్త మోడల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్,పనోరమిక్ సన్‌రూఫ్, HUD డిస్ప్లే, 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, 64-రంగు యాంబియంట్ లైటింగ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, వెనుక సీటు రిక్లైన్ ఫంక్షన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ పనోరమిక్ గ్లాస్ రూఫ్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను అందిస్తుంది. అలాగే, లెవల్ 2 ADAS తో 21 అటానమస్ సేఫ్టీ ఫీచర్లతో అమర్చబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








