రోడ్డు మీద రెండు సింహాలు ఎదురెదురైతే ఇలానే ఉంటుంది! ఒకటి మాస్.. మరొకటి క్లాస్! నువ్వా నేనా అంటూ బరిలోకి!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం 7-సీటర్ SUVల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. పెద్ద ఫ్యామిలీలకు సరిపోయే స్పేస్, లగ్జరీ ఫీచర్లు, బలమైన రోడ్ ప్రెజెన్స్ కలిపి ఈ సెగ్మెంట్ ఇప్పుడు అత్యంత పోటీభరితంగా మారింది. ఇలాంటి సమయంలో స్కోడా తన కొత్త తరం 2026 కోడియాక్ (Kodiaq)ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈసారి కంపెనీ కేవలం డిజైన్ మార్పులతో మాత్రమే కాకుండా, ధర వ్యూహంలో కూడా పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఇది భారత మార్కెట్లో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన ఫుల్-సైజ్ SUVల్లో ఒకటైన టయోటా ఫార్చ్యూనర్(Toyota Fortuner)కు గట్టి పోటీ ఇవ్వబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్ల ధర, ఇంజిన్, ఇతర వివరాల గురించి ఈ కింది కథణంలో ఇవ్వడం జరిగింది.
2026 స్కోడా కోడియాక్ భారత మార్కెట్లో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 36.99 లక్షలుగా నిర్ణయించబడింది. ఈసారి కంపెనీ అత్యంత కీలకమైన మార్పు ధర విషయంలోనే చేసింది. గత మోడల్‌తో పోలిస్తే సుమారు రూ. 3 లక్షల వరకు ధరను తగ్గించడం వల్ల, ఈ ప్రీమియం 7-సీటర్ SUV ఇప్పుడు మరింత మంది కొనుగోలుదారులకు చేరువైంది. వేరియంట్లను బట్టి ధరలను నిర్ణయించారు.

మరోవైపు టయోటా ఫార్చ్యూనర్ ప్రారంభ ధర ప్రస్తుతం సుమారు రూ. 34.76 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ధర పరంగా చూస్తే ఈ రెండు SUVలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నట్లే కనిపిస్తున్నాయి. అయితే అసలు తేడా ఫీచర్లు, టెక్నాలజీ, డ్రైవింగ్ అనుభవంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫార్చ్యూనర్ ధర కోడియాక్ బేస్ వేరియంట్ కంటే కాస్త తక్కువగా ఉండటం ఇక్కడ గమనించదగ్గ విషయం.
ఇంజిన్, పనితీరు పరంగా చూస్తే 2026 స్కోడా కోడియాక్, ఫార్చ్యూనర్ రెండు బలమైన SUVలుగా నిలుస్తాయి. అయితే వీటి ఫోకస్ పూర్తిగా వేర్వేరుగా ఉంటుంది. కోడియాక్‌లో 2.0-లీటర్ TSI టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 201 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడింది. అలాగే ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ కూడా ఉంది.

మరోవైపు టయోటా ఫార్చ్యూనర్ మాత్రం పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌తో ఉంటుంది. ఇందులో 2.7-లీటర్ పెట్రోల్, 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ 201 bhp పవర్‌తో పాటు భారీగా 500 Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అధిక టార్క్ కారణంగా ఫార్చ్యూనర్ ఆఫ్-రోడింగ్, కఠినమైన రోడ్లు, భారీ లోడ్ల సమయంలో మరింత శక్తివంతంగా అనిపిస్తుంది.
కోడియాక్‌లో అతిపెద్ద హైలైట్ దాని ఆధునిక ADAS సేఫ్టీ టెక్నాలజీ. ఇందులో 360-డిగ్రీ కెమెరాతో పాటు లేన్ కీప్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే మొత్తం 9 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటంతో ప్రయాణికులకు మరింత భద్రత లభిస్తుంది. మరోవైపు ఫార్చ్యూనర్ 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నప్పటికీ, ADAS టెక్నాలజీ ఇంకా అందుబాటులో లేదు.

ఫీచర్ల పరంగా కోడియాక్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో 12.9-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, 10.42-అంగుళాల డిజిటల్ క్లస్టర్, వెంటిలేటెడ్ & మసాజ్ ఫ్రంట్ సీట్లు, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 13-స్పీకర్ల కాంటన్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్లు, ప్రీమియం ఇంటీరియర్ ఉన్నాయి. ఫార్చ్యూనర్‌లో 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, JBL సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అయితే టెక్నాలజీ పరంగా కొంచెం వెనుకబడి ఉన్నప్పటికీ, ఫార్చ్యూనర్ ఇప్పటికీ తన బలమైన రోడ్ ప్రెజెన్స్, నమ్మకమైన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది. మొత్తం మీద ఆఫ్-రోడ్ సామర్థ్యం, రగ్గడ్ బిల్డ్, పవర్‌ఫుల్ డీజిల్ పనితీరు కావాలనుకునేవారికి Toyota Fortuner బలమైన ఎంపిక. కానీ నగర ప్రయాణాలు, హైవే కంఫర్ట్, ప్రీమియం ఫీల్, ఆధునిక డ్రైవింగ్ అనుభవం కోరుకునేవారికి కోడియాక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications