11 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్, 700 కిమీ రేంజ్.. కళ్లు మూసి తెరిచేలోపే 100 కిమీ స్పీడ్‌.. ఈ కారు అరాచకం భయ్యా

ప్రపంచ ప్రసిద్ధ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) సరికొత్త రేసింగ్ టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ రాకెట్‌ను మార్కెట్లోకి వదిలింది. తన పవర్‌ఫుల్ రేసింగ్ విభాగం నుంచి సరికొత్త 2026 మెర్సిడెస్-ఏఎమ్‌జీ జీటీ 4-డోర్ కూపే (Mercedes-AMG GT 4-Door Coupe) మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.

సెకండ్ జనరేషన్ వేరియంట్ కింద వచ్చిన ఈ కారులో పాత వీ8 పెట్రోల్ ఇంజన్‌ను పూర్తిగా తీసేసి.. బ్రాండ్ న్యూ 800V AMG.EA ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేశారు. కేవలం కళ్లు మూసి తెరిచేలోపే.. అంటే 2.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత.

2026 mercedes amg gt 4 door coupe ev unveiled features range price telugu

ఈ సరికొత్త ఏఎమ్‌జీ జీటీ ఎలక్ట్రిక్ కారును కంపెనీ GT 55, GT 63 అనే రెండు పవర్‌ఫుల్ వేరియంట్లలో తీసుకొచ్చింది. దీని టాప్-స్పెక్ మోడల్ GT 63 ఏకంగా 1,169 హార్స్‌పవర్ (hp) క్రియేట్ చేయగలదు. ఇది కేవలం 6.4 సెకన్లలోనే 200 కిమీ టాప్ స్పీడ్‌ను ఈజీగా టచ్ చేస్తుంది. బ్రిటీష్ కంపెనీ YASA భాగస్వామ్యంతో తయారు చేసిన సరికొత్త తేలికపాటి ఆక్సియల్ ఫ్లక్స్ ఎలక్ట్రిక్ మోటార్లను (Axial Flux Motors) ఈ కారులో వాడారు.

సాధారణ మోటార్ల కంటే ఇవి చాలా సన్నగా ఉంటూనే, విపరీతమైన పవర్‌ను జనరేట్ చేస్తాయి. ఇందులో మొత్తం మూడు మోటార్లు ఉంటాయి (రెండు వెనుక, ఒకటి ముందు). స్టీరింగ్ ప్యాడిల్స్ రెండింటినీ ఒకేసారి నొక్కితే మరో 150hp అదనపు బూస్ట్ పవర్ అన్‌లాక్ అవుతుంది. ఈ కారు అల్ట్రా-ఫాస్ట్ 600kW డీసీ (DC) ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో కారులోని బ్యాటరీ కేవలం 11 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ అయిపోతుంది.

2026 mercedes amg gt 4 door coupe ev unveiled features range price telugu

కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తోనే 460 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని మెర్సిడెస్ చెబుతోంది. ఈ బ్యాటరీ ప్యాక్ లోపల 2,660 సిలిండ్రికల్ సెల్స్ ఉంటాయి. వేడెక్కకుండా ఉండటానికి వీటికి ప్రత్యేకమైన నాన్-కండక్టివ్ ఆయిల్‌తో కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక రేంజ్ విషయానికి వస్తే, సింగిల్ ఛార్జ్‌పై జీటీ 55 మోడల్ 700 కిలోమీటర్ల మైలేజ్ (WLTP Range) ఇస్తుండగా, జీటీ 63 మోడల్ 696 కిమీ రేంజ్ ఇస్తుంది.

ఎలక్ట్రిక్ కార్లలో ఇంజన్ సౌండ్ రాదనే వెలితి లేకుండా మెర్సిడెస్ ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసింది. ఇందులోని AMG FORCE S+ డ్రైవింగ్ మోడ్‌ను ఆన్ చేస్తే, పాత ఐకానిక్ AMG GT R కారుకు సంబంధించిన 1,600 పైగా రియల్ సౌండ్ ఫైల్స్ ఆధారంగా క్రియేట్ చేసిన నిజమైన వీ8 (V8) ఇంజన్ సౌండ్ లోపల వినిపిస్తుంది. స్టీరింగ్ ప్యాడిల్స్ నొక్కినప్పుడు ట్విన్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ గేర్లు మారుతున్నట్లు చేతులకు వైబ్రేషన్ కూడా వస్తుంది. స్క్రీన్‌పై టాకోమీటర్ డిస్‌ప్లే కూడా మారుతూ ప్యూర్ రేసింగ్ కార్ ఫీలింగ్ ఇస్తుంది.

2026 mercedes amg gt 4 door coupe ev unveiled features range price telugu

భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, పాత మోడల్ కంటే ఈ కారు 4 సెంటిమీటర్లు తక్కువ ఎత్తుతో, పక్కా స్పోర్ట్స్ కార్ లుక్‌తో ఉంటుంది. దీని డ్రాగ్ కోఎఫీషియంట్ కేవలం 0.22 Cd మాత్రమే. కారు స్పీడ్‌ను బట్టి ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యే అండర్‌బాడీ వెంచురీ ప్యానల్స్, యాక్టివ్ రియర్ స్పాయిలర్, 9-స్టేజ్ ఎయిర్‌ప్యానెల్ లూవ్రే సిస్టమ్ దీని ఏరోడైనమిక్స్‌ను పెంచుతాయి. వెనుక చక్రాలు కూడా 6 డిగ్రీల వరకు తిరిగేలా రియర్-యాక్సిల్ స్టీరింగ్ ఫీచర్ ఇచ్చారు. దీనివల్ల తక్కువ స్థలంలోనూ కారును సులువుగా యూ-టర్న్ తీసుకోవచ్చు.

కారు ఇంటీరియర్ ఫ్యూచరిస్టిక్ లేఅవుట్, ప్రీమియం మెటీరియల్‌తో మెరిసిపోతోంది. డాష్‌బోర్డ్‌పై ఒకే ఒక పెద్ద సీమ్‌లెస్ గ్లాస్ ప్యానల్ ఉంటుంది. ఇందులో డ్రైవర్ కోసం 10.2-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్‌లో డ్రైవర్ వైపు వంగి ఉండే 14-ఇంచుల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్ ఉన్నాయి.

2026 mercedes amg gt 4 door coupe ev unveiled features range price telugu

సెంటర్ కన్సోల్‌లో AMG రేస్ కంట్రోల్ యూనిట్ పేరిట మూడు ఫిజికల్ రోటరీ బటన్లు ఇచ్చారు. వీటితో కారు ట్రాక్షన్, రైడ్ రెస్పాన్స్‌ను 9 స్టేజీలలో మార్చుకోవచ్చు. డిజైన్‌తో పాటు 507 లీటర్ల బూట్ స్పేస్, ముందు వైపు 62 లీటర్ల ఫ్రంక్ (Frunk) స్పేస్ ఇచ్చి ప్రాక్టికాలిటీని పెంచారు. ఈ కారు అంచనా ధర దాదాపు రూ.3.30 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు.

Article Published On: Wednesday, May 20, 2026, 17:49 [IST]
English summary
2026 mercedes amg gt 4 door coupe ev unveiled features range price telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+