జాగ్రత్త.. ముందు ప్రమాదం ఉందని చెప్పే కారు వచ్చేసింది! డ్రైవర్ చూడకపోయినా కారు చూసుకుంటుంది!

లగ్జరీ SUV మార్కెట్లో పోటీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, స్కోడా ఆటో (Skoda Auto) ఇండియా ఇప్పుడు తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లను మరింత ఆకర్షణీయంగా మార్చే పనిలో పడింది. ఇప్పటికే భారత మార్కెట్లో ప్రీమియం కార్లకు ప్రత్యేక గుర్తింపు సంపాదించిన స్కోడా, ఇప్పుడు 2026 కోసం తన ప్రముఖ లగ్జరీ SUV అయిన కోడియాక్‌ను భారీ అప్‌డేట్‌లతో కొత్తగా పరిచయం చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌తో కోడియాక్ మరింత ప్రీమియంగా, మరింత స్టైలిష్‌గా, అలాగే విభిన్న రకాల వినియోగదారుల అభిరుచులకు సరిపోయేలా రూపొందించబడింది. ముఖ్యంగా లగ్జరీ SUV కొనాలనుకునే వారికి ఇప్పుడు మరిన్ని ఎంపికలు అందించేందుకు కంపెనీ మూడు ప్రత్యేక వేరియంట్లను తీసుకొచ్చింది.

కోడియాక్ శ్రేణిలో లాంజ్‌, స్పోర్ట్‌లైన్‌, అలాగే సెలక్షన్ L&K మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రతి వేరియంట్‌కు ప్రత్యేక ఉంటుంది. ధరల విషయానికి వస్తే, కొత్త కోడియాక్ లాంజ్ వేరియంట్ ధర రూ. 36.99 లక్షలుగా నిర్ణయించగా, స్పోర్ట్‌లైన్ వేరియంట్ ధర రూ. 44.99 లక్షలు ఉంది. ఇక టాప్ ఎండ్ సెలక్షన్ L&K వేరియంట్‌ను రూ. 46.99 లక్షల ధరకు అందిస్తోంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.

2026 Skoda Kodiaq Launched In India With Adas And New Features Details

2026 కోసం అప్‌డేట్ చేసిన కోడియాక్ కేవలం డిజైన్ పరంగానే కాదు, టెక్నాలజీ, భద్రతా ఫీచర్ల విషయంలో మరింత ప్రీమియం స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఆధునిక డ్రైవింగ్ అనుభూతిని కోరుకునే వినియోగదారులను ఆకట్టుకునేలా కంపెనీ ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) జోడించడం ప్రధాన హైలైట్‌. ఇప్పటికే లగ్జరీ SUV మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోడియాక్‌, ఈ కొత్త అప్‌డేట్‌తో మరింత స్మార్ట్, సేఫ్ SUVగా మారింది.

ప్రస్తుతం మార్కెట్లో ప్రీమియం కార్ల కొనుగోలుదారులు భద్రతా ఫీచర్లకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో, స్కోడా కూడా అదే దిశగా భారీ అప్‌గ్రేడ్‌లు చేసింది. కొత్త కోడియాక్‌లో ADASలో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ హెడ్‌లైట్లు, ఫ్రంటల్ అసిస్ట్‌తో పాటు హెచ్చరిక, ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్‌, లేన్ కీప్ అసిస్ట్‌, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్‌, రియర్ ట్రాఫిక్ అలర్ట్‌, ఎగ్జిట్ వార్నింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

2026 Skoda Kodiaq Launched In India With Adas And New Features Details

ఇవన్నీ కలిసి డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా, అలాగే హైవే ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి. ప్రస్తుతం ఈ ADAS ఫీచర్లను కోడియాక్ స్పోర్ట్‌లైన్, టాప్ ఎండ్ సెలక్షన్ L&K వేరియంట్లలో కంపెనీ అందిస్తోంది. ముఖ్యంగా మిడ్-స్పెక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్‌ను ఈసారి స్కోడా మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఇంతకుముందు టాప్ ఎండ్ L&K వేరియంట్‌కే పరిమితమైన కొన్ని ప్రీమియం ఫీచర్లను ఇప్పుడు స్పోర్ట్‌లైన్‌లో కూడా అందించడం వినియోగదారులకు పెద్ద ప్లస్‌గా మారింది.

అందులో ముఖ్యంగా 360-డిగ్రీ కెమెరా, ముందుభాగంలోని గ్రిల్‌లో పొందుపరిచిన LED స్ట్రిప్ ఇప్పుడు స్పోర్ట్‌లైన్ వేరియంట్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. 360-డిగ్రీ కెమెరా వల్ల భారీ SUVను నగర ట్రాఫిక్‌లో లేదా పార్కింగ్ సమయంలో సులభంగా నియంత్రించవచ్చు. ఇక గ్రిల్‌లోని LED లైట్ స్ట్రిప్ కోడియాక్‌కు మరింత ప్రీమియం, ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తోంది. ఈ అప్‌డేట్‌లను చూస్తుంటే, స్కోడా ఇప్పుడు హైటెక్ ప్రీమియం ఫ్యామిలీ SUVగా మార్కెట్లో నిలబెట్టే చేస్తుంది.

2026 Skoda Kodiaq Launched In India With Adas And New Features Details

ఫీచర్ల విషయానికి వస్తే, 2026 కోడియాక్ ఇప్పుడు మరింత ఆధునిక టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. క్యాబిన్‌లోకి అడుగుపెట్టగానే కనిపించే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ SUVకి ప్రీమియం అనుభూతిని తీసుకొస్తున్నాయి. అయితే ఈసారి స్కోడా కేవలం స్క్రీన్ సైజ్ పెంచడంపైనే కాకుండా, సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని కూడా గణనీయంగా మెరుగుపరిచింది.

ఇక మెకానికల్ విషయానికి వస్తే, స్కోడా కోడియాక్‌లో పెద్ద మార్పులు చేయలేదు. ఇప్పటికే మంచి పనితీరుతో పేరు తెచ్చుకున్న 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కంపెనీ కొనసాగిస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 204 bhp పవర్‌తో పాటు 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. భారీ SUV అయినప్పటికీ, పవర్ డెలివరీ విషయంలో కోడియాక్ చాలా రిఫైన్‌డ్ అనుభూతిని అందిస్తుందని వినియోగదారులు చెబుతున్నారు.

Article Published On: Monday, May 11, 2026, 14:55 [IST]
English summary
2026 skoda kodiaq launched in india with adas and new features details
Read more on: #skoda #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+