బండి చిన్నదే కానీ..లోపల టెక్నాలజీ మాత్రం లగ్జరీ కారును మించిపోయిందిగా..జనాల మనసు దోచుకోనున్న టాటా
భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో మధ్యతరగతి ప్రజల మనసు గెలుచుకున్న మోడల్ టాటా టియాగో ఈవీ (Tata Tiago.ev). సరసమైన ధర, సిటీ డ్రైవింగ్‌కు తగ్గ రేంజ్‌తో దూసుకుపోతున్న ఈ కారు, ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతోంది. టాటా మోటార్స్ ఈ పాపులర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ (Facelift) వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. ఇటీవల భారతీయ రోడ్లపై ఈ కారు టెస్టింగ్ జరుగుతుండగా తీసిన స్పై చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి కవర్‌తో ఉన్నప్పటికీ, ఈ కారులో రాబోయే విప్లవాత్మక మార్పులు ఏంటో స్పష్టంగా అర్థమవుతున్నాయి.
స్పై చిత్రాల ప్రకారం.. 2026 టాటా టియాగో ఈవీ డిజైన్ పరంగా భారీ మార్పులకు లోనవుతోంది. దీనికి సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ (LED Headlamps) అమర్చారు. ప్రస్తుత మోడల్‌లో ఉన్న రిఫ్లెక్టర్ల స్థానంలో పవర్‌ఫుల్ ప్రొజెక్టర్ ఎలిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, హెడ్‌లైట్ల పైన అమర్చిన స్లిమ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ (LED DRLs) కారుకు ఒక అగ్రెసివ్, ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి.

ముందు భాగంలోని బంపర్, గ్రిల్ ప్రాంతం పూర్తిగా రీడిజైన్ చేయబడ్డాయి. ఎలక్ట్రిక్ కార్లకు ఉండే ప్రత్యేకమైన షార్క్-నోస్ డిజైన్‌ను కొనసాగిస్తూనే, మరింత స్టైలిష్‌గా మార్చారు. వెనుక భాగంలో కూడా టెయిల్ ల్యాంప్స్ కొత్త వెలుగులతో దర్శనమివ్వనున్నాయి. వీల్స్ విషయానికి వస్తే, ఎయిరో-డైనమిక్ స్టైల్ కలిగిన కొత్త అల్లాయ్ వీల్స్ లేదా వీల్ కవర్లు ఇందులో ఉండే ఛాన్స్ ఉంది.
ఈ కొత్త డియోగా.ఇవి గురించి వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన వార్త సన్‌రూఫ్. టెస్టింగ్ చేస్తున్న కారు పైభాగంలో ఒక చిన్న హంప్ కనిపించింది, ఇది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే, బడ్జెట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో సన్‌రూఫ్ ఫీచర్ కలిగిన మొదటి కారుగా డియోగా.ఇవి చరిత్ర సృష్టిస్తుంది. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్ అందించడమే లక్ష్యంగా టాటా ఈ అడుగు వేస్తోంది.

కారు లోపలి భాగాన్ని కూడా టాటా మోటార్స్ అప్‌గ్రేడ్ చేస్తోంది. ప్రధానంగా 360-డిగ్రీ కెమెరా (360-degree Camera) ఫీచర్ ఈసారి డియోగాలో రాబోతోంది. కారు సైడ్ మిర్రర్లు (ORVMs) సైజ్ పెరగడం ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. దీనివల్ల ఇరుకైన సందుల్లో కారును పార్క్ చేయడం చాలా సులభమవుతుంది.
ఇతర ముఖ్యమైన ఫీచర్లు:
10.25-అంగుళాల టచ్‌స్క్రీన్: పెద్దదైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్: కారు వేగం, బ్యాటరీ వివరాలను చూపించే పూర్తి డిజిటల్ స్క్రీన్.
న్యూ స్టీరింగ్ వీల్: టాటా కర్వ్, నెక్సాన్ తరహాలో వెలుగులీనే (Illuminated) లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్.
వైర్‌లెస్ ఛార్జింగ్: స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కోసం ప్రత్యేక ప్యాడ్.

ప్రస్తుత టియాగో.ఇవి రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తోంది.. 19.2 kWh (మీడియం రేంజ్), 24 kWh (లాంగ్ రేంజ్). అయితే, 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో టాటా పంచ్.ఇవి లో వాడిన 30 kWh బ్యాటరీని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల కారు రేంజ్ గణనీయంగా పెరిగి, సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 260 - 280 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఛార్జింగ్ స్పీడ్ కూడా మెరుగుపడుతుందని అంచనా.
టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ 2026 ద్వితీయార్థంలో లేదా 2027 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. టాటా మోటార్స్ అమ్మకాల్లో 12% వాటా ఉన్న టియాగోను అప్‌డేట్ చేయడం ద్వారా ఎంజీ కామెట్, సిట్రోయెన్ ఈ-సీ3 వంటి ప్రత్యర్థులకు టాటా గట్టి పోటీ ఇవ్వబోతోంది.


Click it and Unblock the Notifications








