ధర రూ. 4.69 లక్షలే.. కానీ ఈ టాటా కారు ఫీచర్లు చూస్తే లగ్జరీ బెంజ్, ఆడి కార్లకే దిమ్మతిరగాల్సిందే

భారత ఆటోమొబైల్ మార్కెట్లో బడ్జెట్ కార్ల రూపురేఖలను మార్చేస్తూ టాటా మోటార్స్ (Tata Motors) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో దగ్గరైన తమ పాపులర్ ఎంట్రీ-లెవల్ హాచ్‌బ్యాక్ కారు టియాగోను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మోడ్రన్ డిజైన్, అదిరిపోయే లగ్జరీ ఫీచర్లు, సేఫ్టీ అప్‌గ్రేడ్స్‌తో 2026 టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ (2026 Tata Tiago Facelift)ను దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది.

దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కేవలం రూ.4.69 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. దశాబ్ద కాలంగా భారత రోడ్లపై రన్ అవుతున్న టియాగో కార్లలో ఇది రెండవ అతిపెద్ద మేజర్ అప్‌డేట్ కావడం విశేషం. ఈ సరికొత్త మోడల్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి సెలెరియో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

2026 tata tiago facelift and tiago cng launched in india price features details telugu

టాటా మోటార్స్ ఈ కారును కస్టమర్ల అవసరాలకు తగినట్లు మొత్తం ఆరు అద్భుతమైన ట్రిమ్ లెవెల్స్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇవి వరుసగా స్మార్ట్, ప్యూర్, ప్యూర్+, ప్యూర్+ A, క్రియేటివ్, క్రియేటివ్+ వేరియంట్లుగా లభించనున్నాయి. ప్రస్తుతం కంపెనీ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ (MT) వేరియంట్ల ధరలను మాత్రమే మార్కెట్లో ప్రకటించింది. వీటిలో బేస్ మోడల్ అయిన స్మార్ట్ పెట్రోల్ ధర రూ. 4.69 లక్షలుగా ఉంటే, సీఎన్‌జీ మోడల్ ధర రూ. 5.79 లక్షలుగా ఉంది.

అలాగే మిడ్ వేరియంట్లు అయిన ప్యూర్ పెట్రోల్ రూ.5.49 లక్షలు (సీఎన్‌జీ రూ.6.49 లక్షలు), ప్యూర్+ పెట్రోల్ రూ.5.99 లక్షలు (సీఎన్‌జీ రూ.6.99 లక్షలు), మరియు ప్యూర్+ A పెట్రోల్ రూ.6.49 లక్షలుగా (సీఎన్‌జీ రూ.7.49 లక్షలు) నిర్ణయించారు. ఇక హై-ఎండ్ మోడల్స్ అయిన క్రియేటివ్ పెట్రోల్ రూ.6.99 లక్షలు (సీఎన్‌జీ రూ.7.99 లక్షలు) కాగా, టాప్ వేరియంట్ క్రియేటివ్+ పెట్రోల్ రూ.7.29 లక్షల ధరతో లభించనుంది. ఆటోమేటిక్ (AMT) వేరియంట్ల రేట్లను త్వరలోనే వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది.

2026 tata tiago facelift and tiago cng launched in india price features details telugu

కారు ఎక్స్‎టీరియర్ విషయానికొస్తే.. సరికొత్త 2026 టాటా టియాగో మునుపటి కంటే చాలా షార్ప్‌గా, అప్‌రైట్ స్టైలింగ్‌తో రోడ్లపై స్పెషల్ లుక్ ఇచ్చేలా మెరిసిపోతోంది. దీని ముందు భాగంలో స్లిమ్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, గాలి ఫ్రీగా వెళ్లేలా పెద్ద ఎయిర్ డ్యామ్‌ను ఇచ్చారు. కారు వెనుక వైపు సాధారణంగా ప్రీమియం లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించే సరికొత్త కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ (Connected Tail-lamps) సెటప్‌ను జోడించారు.

ఇవే కాకుండా సరికొత్త 15-ఇంచుల డైమండ్-కట్ అలాయ్ వీల్స్, వీల్ ఆర్చీలపై ఉన్న బ్లాక్ క్లాడింగ్ కారుకు ఒక స్పోర్టీ ఎస్‌యూవీ లాంటి లుక్‌ను ఇస్తున్నాయి. ఈ కారు సరికొత్త వైబ్రెంట్ వారణాసి (Varanasi Vibrance), సోహో సర్జ్ (Sobo Surge), ప్యాంగాంగ్ పల్స్, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే వంటి ఆరు విభిన్నమైన ట్రెండీ రంగుల్లో లభిస్తుంది.

2026 tata tiago facelift and tiago cng launched in india price features details telugu

కారు ఇంటీరియర్ కూడా టాటా మోటార్స్ మునుపటి డిజైన్‌ను పూర్తిగా మార్చేసింది. పాత ఫ్లోయింగ్ డ్యాష్‌బోర్డ్‌ స్థానంలో చాలా లీనియర్, ఫ్లాట్ థీమ్‌తో కూడిన మోడ్రన్ డ్యాష్‌బోర్డ్‌ను అందించింది. ఇందులో మునుపెన్నడూ లేని విధంగా 10.25-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మొబైల్స్ ఈజీగా ఛార్జ్ చేసుకోవడానికి డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్‌ను అమర్చారు.

అంతేకాకుండా, వేసవిలో వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికులు కూడా హ్యాపీగా ప్రయాణించడానికి వీలుగా ప్రత్యేకంగా రియర్ ఏసీ వెంట్స్ (Rear AC Vents)ను కూడా ఇందులో జోడించారు. వీటితో పాటు క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి స్మార్ట్ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.

2026 tata tiago facelift and tiago cng launched in india price features details telugu

టాటా కార్లు అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది సేఫ్టీ. ఈ 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో టాటా మోటార్స్ సేఫ్టీని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. మిగతా బ్రాండ్లకు భిన్నంగా ఈ కారులో బేస్ వేరియంట్ (Smart) నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించారు. దీనితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ABS విత్ EBD, చిన్న పిల్లల రక్షణ కోసం ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్లను ఇచ్చారు.

వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. ఇరుకైన సందుల్లో లేదా పార్కింగ్ ప్లేస్‌లో కారును సేఫ్‌గా తిప్పడానికి వీలుగా బడ్జెట్ కార్లలోనే మొదటిసారిగా 360-డిగ్రీ సరౌండ్ వ్యూ హెచ్‌డీ కెమెరా ఫీచర్‌ను కూడా ఇందులో జోడించారు. బడ్జెట్ హాచ్‌బ్యాక్ విభాగంలో ఇలాంటి పటిష్టమైన సేఫ్టీ ప్యాకేజీ రావడం ఇదే మొట్టమొదటిసారి.

మెకానికల్ లేదా ఇంజన్ పరంగా చూస్తే ఈ కారులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటి లాగే ఎంతో నమ్మకమైన 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను వాడారు. ఇది పెట్రోల్ మోడ్‌లో 86 హార్స్‌పవర్ (hp) శక్తిని, అలాగే సీఎన్‌జీ (CNG) మోడ్‌లో 75.5 హార్స్‌పవర్ శక్తిని విడుదల చేస్తుంది.

రెండు వెర్షన్లలోనూ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ (AMT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సెగ్మెంట్‌లోనే ఒక సరికొత్త చరిత్ర సృష్టిస్తూ టాటా టియాగో CNG AMT మోడల్‌లో స్పోర్ట్స్ కార్ల లాంటి ప్యాడల్ షిఫ్టర్స్ (Paddle Shifters) ఫీచర్‌ను పరిచయం చేశారు.

ఇవే కాకుండా, పర్యావరణ ప్రేమికులు, ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడే వారి కోసం దీని ఈవీ వెర్షన్ టాటా టియాగో EV ఫేస్‌లిఫ్ట్‎ను కూడా ఇదే సరికొత్త అప్‌డేట్స్‌తో లాంచ్ చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ.9.99 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.

Article Published On: Thursday, May 28, 2026, 13:49 [IST]
English summary
2026 tata tiago facelift and tiago cng launched in india price features details telugu
Read more on: #tata motors #new launches
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+