సరికొత్త లుక్, లగ్జరీ ఫీచర్లు.. రూ.5 లక్షల బడ్జెట్లో టాటా నుంచి చౌకైన నయా కారు..మే 28న గ్రాండ్ లాంచ్
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors), మధ్యతరగతి కార్ల మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించడానికి రెడీ అయింది. తన పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత చౌకైన, ప్రజాదరణ పొందిన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగోను సరికొత్త అవతారంలో లాంచ్ చేయబోతోంది.
2026 టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ (2026 Tata Tiago Facelift) పేరుతో వస్తున్న ఈ మోడల్‌ను మే 28న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడానికి కంపెనీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవలే ఈ కారు రోడ్లపై ముస్తాబై టెస్టింగ్ చేస్తూ పలుమార్లు పట్టుబడింది. మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ10 కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా టాటా ఈ చిన్న కారును భారీ మార్పులతో అప్‌డేట్ చేసింది.

కొత్త డిజైన్ అదిరింది.. ఎల్‌ఈడీ వెలుగులతో సరికొత్త లుక్
రోడ్లపై టెస్టింగ్ సమయంలో లీకైన సమాచారం ప్రకారం.. కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్ వెలుపలి డిజైన్‌లో (Exterior) టాటా మోటార్స్ చాలా మార్పులు చేసింది. కారు ముందు భాగంలో సరికొత్త డిజైన్ గల ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు (LED Headlights), డే-టైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), కారు వెనుక వైపు స్టైలిష్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లను అమర్చారు.
రెండు హెడ్‌లైట్లను కలుపుతూ మధ్యలో ఒక క్రోమ్ లేదా గ్లోసీ బ్లాక్ పట్టీని ఇచ్చారు. ఫాగ్ ల్యాంప్స్ పొజిషన్ కూడా కిందకు మారింది. కారుకు మరింత స్పోర్టీ లుక్ ఇచ్చేందుకు వీలుగా సరికొత్త జామెట్రిక్ పాటర్న్ డిజైన్‌తో కూడిన డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్‌ను (Alloy Wheels) జోడించారు.

కేబిన్ లోపల లగ్జరీ ఫీచర్లు.. సన్‌రూఫ్ కూడా రానుందా?
ప్రస్తుత మోడల్‌లో ఇప్పటికే టాటా లేటెస్ట్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 10.25-ఇంచుల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే పాత కార్లలో మిస్ అయిన కంఫర్ట్ ఫీచర్లను ఈ 2026 మోడల్‌లో టాటా యాడ్ చేస్తోంది.
ఇందులో సరికొత్త 7-ఇంచుల టీఎఫ్‌టీ (TFT) డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ సెంటర్ ఆమ్‌రెస్ట్, వెనుక సీట్ ప్రయాణికుల కోసం రేర్ ఏసీ వెంట్స్ (Rear AC Vents), అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, వెనుక వైపు ఆమ్‌రెస్ట్ వంటి సౌకర్యాలను ఇస్తున్నారు. మిడ్-సైజ్ కార్లలో లాగా ఈ చిన్న బడ్జెట్ కారులో కూడా సింగిల్-ప్యానెల్ సన్‌రూఫ్ (Sunroof), వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ను టాప్ వేరియంట్లలో ఆఫర్ చేసే అవకాశం ఉందని మార్కెట్ టాక్.

పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్స్.. టర్బో పెట్రోల్ ఎంట్రీ!
టెక్నికల్ పరంగా చూస్తే, ఈ కారులో నమ్మకమైన పాత 1.2-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కొనసాగించనున్నారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టీ (AMT) గేర్‌బాక్స్‌తో వస్తుంది. మైలేజ్ ప్రియుల కోసం టాటా పేటెంటెడ్ ఐ-సీఎన్‌జీ (i-CNG) డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ కూడా ఇందులో లభిస్తుంది.
దీనివల్ల బూట్ స్పేస్ తగ్గకుండా మంచి మైలేజ్ వస్తుంది. అలాగే దీని ప్యూర్ ఎలక్ట్రిక్ (EV) వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇటీవల అప్‌డేట్ అయిన టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాగే, ఈ కొత్త టియాగోలో కూడా మరింత పవర్ కోరుకునే వారి కోసం 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా టాటా కొత్తగా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ధర ఎంత ఉండొచ్చు?
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో పాత టాటా టియాగో బేస్ మోడల్ ధర రూ.4.60 లక్షల నుంచి రూ.8.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ సరికొత్త అప్‌డేట్స్, అధునాతన ఫీచర్ల కారణంగా కొత్త 2026 టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర దాదాపు రూ.5 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్‌లో టాప్ క్లాస్ బిల్డ్ క్వాలిటీ, 4-స్టార్ సేఫ్టీ రేటింగ్, మోడ్రన్ ఫీచర్లు కావాలనుకునే మధ్యతరగతి ఫ్యామిలీలకు, మొదటిసారి కారు కొనేవారికి ఇది ఒక వండర్‌ఫుల్ ఆప్షన్ కానుంది.


Click it and Unblock the Notifications