భారత‌లో టెస్లా కారు హల్‌చల్.. 500KM రేంజ్‌‌తో మోడల్ వై ప్రీమియం ఎంట్రీ! 5.9 సెకన్లలో 0-100 వేగం

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త దిశ చూపించిన సంస్థగా టెస్లా (Tesla) పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలాన్ మస్క్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద EV తయారీదారుగా గుర్తింపు పొందింది. ఇలాంటి బ్రాండ్ భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించడం సహజంగానే భారీ ఆసక్తిని రేకెత్తించింది. టెస్లా ఎంట్రీని ఆటోమొబైల్ రంగంలో ఒక పెద్ద మైలురాయిగా కూడా భావించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్లా గత ఏడాది భారత మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే మొదటగా పరిచయం చేసిన మోడల్ వైపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, కొన్ని మార్కెట్ పరిస్థితులు, స్థానిక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

దీంతో కంపెనీ ఇప్పుడు భారత మార్కెట్లో తన స్థానాన్ని బలపరచడానికి మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో టెస్లా తన అత్యంత ప్రాచుర్యం పొందిన SUV మోడళ్లలో ఒకటైన మోడల్ వై(Model Y)ని కొత్త రూపంలో మళ్లీ పరిచయం చేసింది. తాజాగా విడుదల చేసిన ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్(RWD) వేరియంట్‌ను ప్రత్యేకంగా భారత వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.50.89 లక్షలుగా నిర్ణయించబడింది.

2026 Tesla Model Y Premium Rwd India Launch Price And Features

ఇది ప్రీమియం EV సెగ్మెంట్‌లో టెస్లా స్థానాన్ని మరింత బలపరచే ప్రయత్నంగా చెప్పవచ్చు. పనితీరు పరంగా మోడల్ వై ప్రీమియం RWD వేరియంట్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే WLTP సర్టిఫైడ్ ప్రకారం సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. దూర ప్రయాణాలు చేసే వినియోగదారులకు బెస్ట్. అధిక రేంజ్‌తో పాటు టెస్లా సిగ్నేచర్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫీచర్లు ఈ మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి.

ప్రస్తుతం టెస్లా కొత్త RWD వేరియంట్ డెలివరీలను 2026 జూలై నుండి ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత మార్కెట్లో EVలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ మోడల్ ద్వారా మళ్లీ తన స్థానాన్ని బలపరచుకోవాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి, టెస్లా మోడల్ వై ప్రీమియం RWD రాక భారత ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో మరోసారి భారీ చర్చకు దారితీసే అవకాశం ఉంది.

2026 Tesla Model Y Premium Rwd India Launch Price And Features

ఇదే సమయంలో భారత మార్కెట్లో గతంలో అందుబాటులో ఉన్న సుమారు రూ.67.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర గల లాంగ్ రేంజ్ ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్‌ను కంపెనీ ఇప్పుడు నిలిపివేసింది. ప్రస్తుతం భారతదేశంలో టెస్లా మోడల్ Y లైనప్‌లో రెండు ప్రధాన వేరియంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ (RWD), లాంగ్ రేంజ్ ప్రీమియం ఆల్-వీల్ డ్రైవ్ (AWD).

2026 మోడల్ Y ప్రీమియం RWD వేరియంట్ పనితీరు విషయానికి వస్తే, 5.9 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 201 kmph వేగం వరకు వెళ్లగల సామర్థ్యం ఇందులో ఉంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, 175 kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, మోడల్ Y RWD కేవలం 15 నిమిషాల్లో సుమారు 238 కిలోమీటర్ల రేంజ్‌ను పొందగలదని కంపెనీ చెబుతోంది.

2026 Tesla Model Y Premium Rwd India Launch Price And Features

ఇది 5-సీటర్ కాన్ఫిగరేషన్‌తో అందుబాటులో ఉంది. ఇది ఆల్-బ్లాక్, జెన్ గ్రే ఇంటీరియర్ థీమ్‌లలో లభిస్తుంది. స్టోరేజ్ పరంగా ఈ SUV అత్యంత ప్రాక్టికల్‌గా ఉండి, సీట్లను ఫోల్డ్ చేస్తే గరిష్టంగా 2,138 లీటర్ల వరకు బూట్ స్పేస్‌ను అందిస్తుంది. ఇంటీరియర్‌లో కొత్తగా 16-అంగుళాల పెద్ద సెంటర్ టచ్‌స్క్రీన్‌తో పాటు వెనుక ప్రయాణికుల కోసం 8.0-అంగుళాల డిస్‌ప్లే కూడా అందించారు.

ముందు టచ్‌స్క్రీన్ ద్వారానే వాహనంలోని అన్ని ఫంక్షన్లను నియంత్రించవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే, LED పనోరమిక్ గ్లాస్ రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, పవర్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, అకౌస్టిక్ గ్లాస్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మొత్తం మీద ఇది లగ్జరీ, టెక్నాలజీ, ప్రాక్టికాలిటీ కలయికగా నిలుస్తోంది.

Article Published On: Friday, May 29, 2026, 17:10 [IST]
English summary
2026 tesla model y premium rwd india launch price and features
Read more on: #tesla #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+