కేవలం 30 గ్రాముల బంగారంతో మిడిల్ క్లాస్ డ్రీమ్ కారు కొనచ్చు.. 33 కి.మీ మైలేజ్, 5 సీట్లు
ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు సాధారణ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ధరలు ఎంతగా పెరిగినా, బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పెట్టుబడిగా, భవిష్యత్తు భద్రతగా భావిస్తూ చాలా మంది ఇప్పటికీ బంగారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.1.42 లక్షలకు చేరింది. అలాగే వెండి ధర కూడా ఆకాశాన్ని తాకుతోంది. ఒక కిలో వెండి ధర సుమారు రూ.2.70 లక్షలు ఉండటం గమనార్హం. ఈ ధరలను చూస్తే, కొన్ని సంవత్సరాల క్రితం ఊహించలేని స్థాయికి విలువలు పెరిగాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆసక్తికరమైన పోలికను గమనించవచ్చు.
అదేంటంటే, మీరు కొత్త కారు కొనాలని అనుకుంటే, అదే డబ్బుతో మీరు ఎంత బంగారం కొనగలుగుతారు? లేదా బంగారం కొనడం కంటే ఒక కారు కొనడం మరింత ప్రయోజనకరమా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే, భారతదేశంలో అత్యంత సరసమైన కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.3.50 లక్షలు మాత్రమే.

హైదరాబాద్ లాంటి నగరాల్లో టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు కలిపి ఆన్-రోడ్ ధర సుమారు రూ.4.15 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు ఇదే మొత్తాన్ని బంగారం ధరతో పోల్చి చూస్తే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతం 30 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.4.26 లక్షలకు చేరుకుంది. అంటే, మీ వద్ద 30 గ్రాముల బంగారం ఉంటే మీరు కొత్త మారుతి ఎస్-ప్రెస్సో కారును కొనుగోలు చేయగలుగుతారు.
ఒకవైపు చిన్న సైజ్ బంగారు బిస్కెట్లు, మరోవైపు మీ ఇంటి ముందు నిలిచే ఒక కొత్త కారు - ఈ రెండు మధ్య ఉన్న విలువ తేడా ఇప్పుడు చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఇది కేవలం ధరల పోలిక మాత్రమే కాదు, జీవనశైలి మార్పును కూడా సూచిస్తోంది. బంగారం ఒక పెట్టుబడి అయితే, కారు రోజువారీ అవసరాలకు ఉపయోగపడే సాధనం.

కుటుంబంతో కలిసి ప్రయాణించడం, వర్షం ఎండకు ఇబ్బంది లేకుండా ఆఫీసుకు వెళ్లడం, అవసరమైన పనుల కోసం సౌకర్యంగా తిరగడం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎస్-ప్రెస్సో లాంటి చిన్న కారు మంచి మైలేజ్ ఇవ్వడం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్. ఈ రోజుల్లో బంగారం ధరలు పెరుగుతున్న వేళ, అదే మొత్తంలో డబ్బుతో ఒక కారు కొనగలిగే అవకాశం ఉండటం ఆలోచించాల్సిన విషయం.
మారుతి ఎస్-ప్రెస్సో గురించి చూసినట్లయితే, చిన్న హ్యాచ్‌బ్యాక్. దీనిలో ఉన్న 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ 66 PS హార్స్‌పవర్, 89 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 1-లీటర్ CNG ఇంజన్ 56 PS హార్స్‌పవర్, 82 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది 24 నుండి 33 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు. ఇది 5 మంది ప్రయాణీకులను సౌకర్యవంతంగా కూర్చోబెట్టగలదు. ఈ కారులో చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయి. ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, పవర్ విండోస్, USB కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ వంటి వివిధ ఫీచర్స్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








