మధ్యతరగతి కోసం భారీ ప్లాన్.. 30 కిమీ మైలేజ్, 500 కిమీ రేంజ్4 SUVలతో రెనాల్ట్-నిస్సాన్ ఎంట్రీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తమ పట్టును మరింత బలపరుచుకోవడానికి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్ (Renault), నిస్సాన్ (Nissan) జంట ఒక భారీ గేమ్‌ప్లాన్‌తో ముందుకు వస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు కలిసి ఇండియాలో నాలుగు సరికొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) కార్లను లాంచ్ చేయడానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

రెనాల్ట్ సరికొత్త RGMP ప్లాట్‌ఫారమ్‌పై ఈ కార్లను రూపొందిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత ఏంటంటే.. దీనిపై పెట్రోల్, హైబ్రిడ్, సీఎన్‌జీతో పాటు ఎలక్ట్రిక్ (EV) ఇంజన్లను కూడా చాలా ఈజీగా అమర్చవచ్చు. అంతేకాకుండా, గూగుల్ భాగస్వామ్యంతో తయారు చేసిన అధునాతన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ కూడా ఈ కార్లలో కస్టమర్లకు లభించనుంది.

30 kmpl Mileage 500 km Range EVs Renault-Nissan Preparing 4 New SUVs for India

రెనాల్ట్ బ్రిడ్జర్ పెట్రోల్, హైబ్రిడ్..
రెనాల్ట్ కంపెనీ తీసుకొస్తున్న వ్యూహాత్మక మోడళ్లలో రెనాల్ట్ బ్రిడ్జర్ (Renault Bridger) అత్యంత కీలకమైనది. ఈ ఎస్‌యూవీ మంచి బాక్సీ లుక్, మస్కులర్ డిజైన్‌తో రోడ్డుపై వెళ్తుంటే తిరుగులేని పవర్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. ఇందులో అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్, క్యాబిన్ స్పేస్ ఉండనున్నాయి. ఇంజన్ విషయానికి వస్తే.. సరికొత్త 1.2-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్, టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఇందులో ఇస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ కారులోని స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఏకంగా లీటరుకు 30 కిలోమీటర్ల బంపర్ మైలేజీని ఇస్తుందని టాక్.

ఈవీ మార్కెట్లోకి రెనాల్ట్ బ్రిడ్జర్ ఎలక్ట్రిక్
పెట్రోల్, హైబ్రిడ్ వెర్షన్లతో పాటు ఈ కారును పూర్తి ఎలక్ట్రిక్ రూపంలో బ్రిడ్జర్ ఈవీ (Bridger EV)గా కూడా మార్కెట్లోకి తెస్తున్నారు. 2028 ప్రారంభం నాటికి ఇది భారత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఇది గేమ్ ఛేంజర్ కాబోతోంది. ఇందులో కస్టమర్ల కోసం 35 kWh, 55 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇస్తున్నారు. చిన్న బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై 300 నుంచి 350 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, పెద్ద బ్యాటరీ ప్యాక్ ఏకంగా 500 కిలోమీటర్ల రేంజ్‌తో దూసుకుపోనుంది.

30 kmpl Mileage 500 km Range EVs Renault-Nissan Preparing 4 New SUVs for India

నిస్సాన్ నుంచి సరికొత్త బ్రిడ్జర్ బేస్డ్ ఎస్‌యూవీ
రెనాల్ట్ బ్రిడ్జర్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే, దాని భాగస్వామ్య సంస్థ అయిన నిస్సాన్ కూడా ఇదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన తన సొంత సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని రంగంలోకి దించనుంది. లోపలి ఫీచర్లు, ఇంజన్ పరంగా ఇది పూర్తిగా రెనాల్ట్ బ్రిడ్జర్ లాగే ఉంటుంది. కానీ నిస్సాన్ కంపెనీ దీనికి తన మార్క్ సిగ్నేచర్ స్టైలింగ్‌ను జోడించి, సరికొత్త ఫ్రంట్ లుక్‌తో మార్కెట్లోకి తెస్తోంది. ఇందులో కూడా అదే 1.2-లీటర్ రిఫైన్డ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్, 30 కిమీ మైలేజ్ ఇచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లు ఉండనున్నాయి.

టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా నిస్సాన్ కొత్త ఎలక్ట్రిక్ కారు
నిస్సాన్ కంపెనీ కూడా బ్రిడ్జర్ ప్లాట్‌ఫారమ్‌పైనే తన మొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ కారు 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది నేరుగా టాటా నెక్సాన్ ఈవీ, రెనాల్ట్ బ్రిడ్జర్ ఈవీ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

30 kmpl Mileage 500 km Range EVs Renault-Nissan Preparing 4 New SUVs for India

ఇందులో కూడా 500 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బ్యాటరీ ఆప్షన్లు, గూగుల్ అడ్వాన్స్డ్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ఉంటాయి. అయితే కస్టమర్లకు ఒక సరికొత్త ఫీలింగ్ ఇవ్వడానికి నిస్సాన్ దీని ఫ్రంట్, రియర్ డిజైన్‌ను చాలా ఫ్యూచరిస్టిక్‌గా డిజైన్ చేస్తోంది.

Article Published On: Sunday, May 31, 2026, 9:25 [IST]
English summary
30 kmpl mileage 500 km range evs renault nissan preparing 4 new suvs for india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+