డిఫెండర్ లాంటి లుక్.. 500 కిమీ రేంజ్.. చైనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ఫీచర్లు వింటే మైండ్ బ్లాకే!

భారతదేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఒకవైపు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు మరోవైపు వినియోగదారులను ఈవీ (EV)ల వైపు నడిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ విభాగంలో దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి.

కానీ, ఈ ఆధిపత్యానికి గట్టి పోటీ ఇచ్చేందుకు చైనాకు చెందిన ఐదు పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు (SUVs) భారత గడ్డపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రేట్ వాల్ మోటార్స్, ఎంజీ (MG), చెర్రీ వంటి బ్రాండ్లు సరికొత్త టెక్నాలజీతో టాటా, మహీంద్రాల నిద్ర గడపనున్నాయి. ఈ కొత్త కార్ల ఫీచర్లు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ ఐదు కార్ల వివరాలు, వాటి ప్రత్యేకతలు వివరంగా తెలుసుకుందాం.

5 Powerful Chinese EV SUVs Set to Challenge Tata Mahindra in India

1. జెటూర్ టీ2 (Jetour T2 - JSW మ్యాజిక్)
ఈ కారు భారత మార్కెట్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. జెటూర్ బ్రాండ్ చైనాకు చెందిన చెర్రీ (Chery) అనుబంధ సంస్థ. భారతదేశంలో దీనిని జెఎస్‌డబ్ల్యూ మోటార్స్ (JSW Motors) భాగస్వామ్యంతో లాంచ్ చేయనున్నారు. ఇది మహారాష్ట్రలోని ప్లాంట్‌లో అసెంబుల్ కానుంది. దీని రూపం చూస్తే మీకు ల్యాండ్ రోవర్ డిఫెండర్ గుర్తుకు రాక మానదు. పూర్తి బాక్సీ డిజైన్‌తో, రగ్డ్ లుక్‌తో వస్తుంది.

ఇది పరిమాణంలో టాటా సఫారీ కంటే పెద్దదిగా ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఇది 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. హైవేలపై లాంగ్ జర్నీ చేసే వారికి ఇది గొప్ప ఆప్షన్.

5 Powerful Chinese EV SUVs Set to Challenge Tata Mahindra in India

2. చెర్రీ ఐకార్ వి23 (Chery iCar V23)
ఇటీవల భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఈ కారు, ఎస్‌యూవీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీని డిజైన్ జీప్ రాంగ్లర్, డిఫెండర్ మిశ్రమంలా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒక మినీ డిఫెండర్‎లా కనిపిస్తుంది. ఇందులో 15.4 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, అడాస్ (ADAS) టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్స్, రౌండ్ హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి 59.93 kWh, 81.76 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 400-500 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వగలదు. మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు ఇది ప్రధాన శత్రువు కానుంది.

5 Powerful Chinese EV SUVs Set to Challenge Tata Mahindra in India

3. ఎంజీ ఎస్5 ఈవీ (MG S5 EV)
భారతదేశంలో ఇప్పటికే ఎంజీ జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) మంచి విజయాన్ని అందుకుంది. అయితే, దీనిని మరింత అప్‌గ్రేడ్ చేస్తూ ఎంజీ ఎస్5 ఈవీని తీసుకువస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న జెడ్ఎస్ ఈవీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ మరియు ప్రీమియం ఎక్స్‌టీరియర్ దీని ప్రత్యేకత. 12.8 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని క్లెయిమ్డ్ రేంజ్ 500 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా.

5 Powerful Chinese EV SUVs Set to Challenge Tata Mahindra in India

4. ఎంజీ 520 - ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (MG 520 PHEV)
హైబ్రిడ్ కార్లను ఇష్టపడే వారికి ఎంజీ 520 ఒక గొప్ప వరం. ఇది చైనాలోని వులింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా రూపొందించబడింది. ఇది నేరుగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (XUV700)తో పోటీ పడనుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 20.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 197 hp పవర్, 230 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎంజీ నుంచి వస్తున్న మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం.

5. ఎంజీ ఎక్సియాన్ (MG Eksion)
ఎంజీ 520 కి ఇది పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్. పెట్రోల్ ఇంజిన్ అవసరం లేదు అనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఇందులో 56.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 136 hp శక్తిని, 200 Nm టార్క్‌ను అందిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా ఇందులో బ్యాటరీ ఆప్షన్లను మార్చే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 25, 2026, 7:32 [IST]
English summary
5 powerful chinese ev suvs set to challenge tata mahindra in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+