రేపటి నుంచే రోడ్లపై కొత్త కార్ల జాతర.. షోరూమ్‌ల ముందుకు క్యూ కట్టడానికి రెడీ అయిపోండి

భారతీయ కార్ల మార్కెట్లో రాబోయే రోజులు చాలా హాట్‌గా మారబోతున్నాయి. దేశంలోని ప్రముఖ దిగ్గజ కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్, హోండా, రెనాల్ట్, నిస్సాన్ కంపెనీలు తమ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి దించడానికి లైన్ కట్టాయి. ఈ సరికొత్త కార్ల లాంచ్‌ల పండగ రేపు (జూన్ 30) టాటా కంపెనీతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూలై మొదటి రెండు వారాల్లోనే ఒకదాని తర్వాత ఒకటిగా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ 6 కార్ల వివరాలు తెలుసుకుందాం.

1. టాటా ససియెర్రా ఈవీ (Tata Sierra EV)
టాటా మోటార్స్ తన ఐకానిక్ కారు సియెర్రాను సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో రేపు మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో హారియర్ ఈవీ నుంచి సేకరించిన 65kWh, 75kWh సామర్థ్యం గల రెండు పవర్‌ఫుల్ బ్యాటరీ ఆప్షన్లను ఇస్తున్నారు. ఇవి ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు సులభంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. దీని టాప్ వేరియంట్లలో నాలుగు చక్రాలకు సమానంగా పవర్ ఇచ్చే టాటా అడ్వాన్స్‌డ్ QWD డ్యూయల్-మోటార్ సెటప్‌ను కూడా కస్టమర్ల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.

6 New Cars Launching in India by July 2026 From Tata Sierra EV to Maruti Brezza Facelift

2. రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ (Renault Kwid Facelift)
మధ్యతరగతి ఫ్యామిలీలకు ఎంతో ఇష్టమైన బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కారు రెనాల్ట్ క్విడ్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో జూలై 3వ తేదీన మార్కెట్లోకి రానుంది. ఈ సరికొత్త మోడల్ లుక్, ఫీచర్లు గ్లోబల్ మార్కెట్లో మంచి సక్సెస్ సాధించిన డాసియా స్ప్రింగ్ కారును పోలి ఉంటాయి. అయితే కంపెనీ దీని ఇంజన్ పర్ఫార్మెన్స్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. పాత మోడల్ లాగే ఇందులో కూడా నమ్మకమైన 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కొనసాగనున్నాయి.

3. నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton)
నిస్సాన్ మోటార్స్ తన సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ టెక్టాన్‎ను జూలై 9వ తేదీన ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఈ కారు డిజైన్ కంపెనీ మోస్ట్ ప్రీమియం కారు నిస్సాన్ పెట్రోల్‎లాగా చాలా గంభీరంగా, రగ్గడ్‌గా ఉండబోతోంది. ఇంజన్ విషయానికి వస్తే కొత్త రెనాల్ట్ డస్టర్ కారులో ఉపయోగించే 1.0 లీటర్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లను ఇందులో వాడుతున్నారు. దీని ప్లాట్‌ఫారమ్, ఇంటీరియర్ కేబిన్, చాలా ఫీచర్లు రాబోయే కొత్త డస్టర్ కారుతో షేర్ చేసుకోనున్నారు.

6 New Cars Launching in India by July 2026 From Tata Sierra EV to Maruti Brezza Facelift

4. ఎంజీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ (MG Plug-in Hybrid SUV)
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియాలో తన మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) ఎస్‌యూవీ కారును జూలై 9న లాంచ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. చైనా మార్కెట్లో పాపులర్ అయిన వూలింగ్ స్టార్‌లైట్ 560 కారు ఆధారంగా దీనిని రూపొందించారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 20.5kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను జత చేశారు. ఈ రెండు పవర్‌సోర్స్‌లు కలిసి కారుకు ఏకంగా 197bhp ల మైండ్ బ్లోయింగ్ పవర్‌ను అందిస్తాయి. దీనివల్ల మైలేజ్ మరియు పికప్ రెండు అదిరిపోతాయి.

5. మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ (Maruti Brezza Facelift)
భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి బ్రెజ్జా సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో ఇదే జూలై నెలలో రాబోతోంది. ఈసారి ఈ కారులో కంపెనీ మైండ్ బ్లోయింగ్ మార్పు చేసింది. ఇందులో పాత ఇంజన్‌తో పాటు కొత్తగా ఫ్రాంక్స్ కారులో వచ్చే 1.0 లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చబోతున్నారు. దీనికి తోడు సరికొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కూడా తోడవనుంది. పాత 1.5 లీటర్ నార్మల్ ఇంజన్ కారును కూడా కస్టమర్ల కోసం మార్కెట్లో కొనసాగించనున్నారు.

6 New Cars Launching in India by July 2026 From Tata Sierra EV to Maruti Brezza Facelift

6. హోండా జెడ్ఆర్-వీ (Honda ZR-V)
హోండా మోటార్స్ కూడా జూలై నెలలో ప్రీమియం హైబ్రిడ్ కార్ల మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తన సరికొత్త ఎస్‌యూవీ 'ZR-V' ని ఇండియాలో దించబోతోంది. ఈ లగ్జరీ కారులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు, ఇది పవర్‌ఫుల్ డ్యూయల్-మోటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ మొత్తం పవర్ ట్రెయిన్ కలిసి కారుకు ఏకంగా 184bhp ల పవర్, 315Nm ల భారీ టార్క్‌ను అందిస్తుంది. లగ్జరీ కేబిన్, అదిరిపోయే మైలేజ్ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.

Article Published On: Monday, June 29, 2026, 18:12 [IST]
English summary
6 new cars launching in india by july 2026 from tata sierra ev to maruti brezza facelift
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+