లీటరుకు 22 కిలోమీటర్ల మైలేజ్.. రాబోయే 2 నెలల్లో మార్కెట్లోకి 6 అదిరిపోయే కొత్త ఎలక్ట్రిక్ SUVలు
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్ల హవా కొనసాగుతోంది. కస్టమర్లలో ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ పాత హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మోడల్స్ పక్కన పెట్టి, సరికొత్త ఎస్‌యూవీలు, క్రాస్‌ఓవర్ కార్లపైనే పూర్తి ఫోకస్ పెట్టాయి. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రెనాల్ట్ డస్టర్, అప్‌డేటెడ్ హారియర్, సఫారి, మహీంద్రా XUV 7XO వంటి కార్లు సృష్టించిన సంచలనం మనందరికీ తెలిసిందే. అయితే రాబోయే రెండు నెలలు (జులై, ఆగస్టు) కార్ల లవర్స్‌కు మరింత పండగలా మారబోతున్నాయి. దేశంలో లాంచ్ కాబోతున్న ఆ 6 SUVల గురించి తెలుసుకుందాం.
కొత్త ఎలక్ట్రిక్ అవతారంలో టాటా సియెర్రా ఈవీ
ఈ అప్‌కమింగ్ కార్ల లిస్టులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అతిపెద్ద పేరు టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV). 90ల కాలంలో భారతీయ రోడ్లపై సంచలనం సృష్టించిన ఐకానిక్ సియెర్రా కారు.. ఇప్పుడు సరికొత్త మోడరన్ ఎలక్ట్రిక్ అవతారంలో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది.

టాటా మోటార్స్ ఈ కారును జూన్ నెలాఖరుకల్లా దేశం ముందుకు తీసుకురానుంది. పాత మోడల్ లాగే దీని లుక్‌ను కూడా బాక్సీ, మస్కులర్ డిజైన్‌తో రూపొందించారు. ఇందులో 55 kWh నుంచి 75 kWh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించనున్నారు. ఇవి సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 500 నుంచి 600 కిలోమీటర్ల మైండ్ బ్లాకింగ్ రేంజ్ ఇస్తాయని టాటా కంపెనీ చెబుతోంది.
మైలేజ్ కింగ్ హోండా ZR-V హైబ్రిడ్
ప్రముఖ జపనీస్ కార్ల సంస్థ హోండా, తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ హైబ్రిడ్ ఎస్‌యూవీ ZR-Vని జులై నెలలో లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఇదొక అత్యంత ప్రీమియం కారు కాబోతోంది. ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అమర్చారు.

ఇది 184bhp పవర్, 315Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెద్ద ఎస్‌యూవీ లీటరు పెట్రోల్‌కు ఏకంగా 22.80 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. దీనితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, 11 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, హోండా సెన్సింగ్ (ADAS) వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
డస్టర్ మోడల్‌కు పోటీగా నిస్సాన్ టెక్టాన్
నిస్సాన్ కంపెనీ తన సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ టెక్టాన్ ను జులై 9న ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి ప్రదర్శించబోతోంది. నిజానికి ఇది త్వరలో రాబోతున్న సరికొత్త రెనాల్ట్ డస్టర్ కారుకు నిస్సాన్ వర్షన్ అని చెప్పవచ్చు. ఈ కారులో కస్టమర్ల కోసం 1.0-లీటర్, 1.3-లీటర్ పవర్‌ఫుల్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను అందించనున్నారు.
కారు లోపల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అన్ని రకాల మోడరన్ ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.

ఆఫ్-రోడింగ్ లవర్స్ కోసం టయోటా హిలక్స్
ఆఫ్-రోడింగ్, అడ్వెంచర్ ప్రయాణాలను ఇష్టపడే వారి కోసం టయోటా కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ హిలక్స్ (Toyota Hilux) పిక్-అప్ ఎస్‌యూవీని జులై లేదా ఆగస్టు నెలలో మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఈ కారు ఇండియాలో ఒక యాడ్ షూట్ సమయంలో కెమెరా కంటికి చిక్కింది.
ఈ సరికొత్త వాహనాన్ని అప్‌డేటెడ్ IMV ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేశారు. ఇదే ప్లాట్‌ఫారమ్‌ను రాబోయే కొత్త ఫార్చ్యూనర్ కారులో కూడా వాడనున్నారు. ఇందులో నమ్మకమైన 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అలాగే కొనసాగించనున్నారు. అలాగే టయోటా కంపెనీ దీని ఎలక్ట్రిక్ (EV) వెర్షన్‌పై కూడా వేగంగా పనిచేస్తోంది.
400 కిమీ రేంజ్‌తో కియా సైరోస్ ఈవీ
కొరియన్ కార్ల తయారీ సంస్థ కియా, తన సరికొత్త ఎస్‌యూవీ సైరోస్ (Kia Syros EV) ఎలక్ట్రిక్ మోడల్‌ను ఆగస్టు నాటికి మార్కెట్లోకి దించడానికి ప్లాన్ చేస్తోంది. టెస్టింగ్ సమయంలో ఈ కారు రోడ్లపై చాలాసార్లు కనిపించింది. ఇది చూడటానికి పూర్తిగా ప్రొడక్షన్ రెడీగా ఉంది.

ఇందులో సరికొత్త డిజైన్ బంపర్, న్యూ ఫ్రంట్ గ్రిల్, ఏరో-ఆప్టిమైజ్డ్ అలాయ్ వీల్స్‌ను అందించారు. ఈ ఎలక్ట్రిక్ కారులో 42 kWh, 49 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండనున్నాయి. ఇవి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 300 నుండి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.
బడ్జెట్ రేంజ్ లో సిట్రోయెన్ eC3X కూపే
ఫ్రెంచ్ కార్ల బ్రాండ్ సిట్రోయెన్, భారత మార్కెట్ కోసం సరికొత్త ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్-ఎస్‌యూవీ eC3X పై పని చేస్తోంది. 2026 కొత్త అప్‌డేట్‌తో రాబోతున్న ఈ కారులో ఎల్‌ఈడీ ఫాగ్ లైట్లు, సరికొత్త డీఆర్‌ఎల్‌లు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్‌తో పాటు ఒక వినూత్నమైన కూపే లాంటి X డిజైన్‌ను అందించనున్నారు.
ఈ కారులో కీ-లెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్లు యాడ్ కానున్నాయి. ఇందులో పాత 29.2kWh బ్యాటరీ ప్యాక్‌నే ఉపయోగించనున్నారు, ఇది 320 కిలోమీటర్ల రేంజ్, 143 Nm టార్క్‌ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications