ఆటోమొబైల్ మార్కెట్‎లో పెను మార్పులు.. 6 కొత్త అస్త్రాలను దింపబోతున్న కార్ కంపెనీలు

ప్రస్తుతం మార్కెట్లో SUVల ట్రెండ్ నడుస్తోంది. వచ్చే మరో రెండు వారాల్లో భారత ఆటోమొబైల్ రంగం సరికొత్త ఎస్‌యూవీల రాకతో సందడిగా మారబోతుంది. ఏకంగా మార్కెట్లోకి ఆరు సరికొత్త మోడళ్లు అడుగుపెడుతుండటంతో కారు లవర్లకు పండగ వాతావరణం నెలకొంది. రూ. 11 లక్షల నుంచి రూ. 50 లక్షల బడ్జెట్ వరకు, ఎలక్ట్రిక్ నుంచి పెట్రోల్ వేరియంట్ల వరకు అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఆ 6 అదిరిపోయే కార్ల వివరాలు, వాటి ఫీచర్లు, లాంచ్ డేట్స్ పై ఓ లుక్కేద్దాం.

భారత రోడ్లపై SUVల హవా కొనసాగుతున్న తరుణంలో, ప్రముఖ దిగ్గజ సంస్థలన్నీ తమ బెస్ట్ మోడళ్లను మార్కెట్లోకి దించుతున్నాయి. ఇందులో టాటా, మారుతి, టయోటా వంటి కంపెనీలు తమ మొదటి ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేస్తుండటం విశేషం.

6 New SUVs Launching in India Within 2 Weeks From Toyota EV to New Duster

1. టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ (Toyota Urban Cruiser EV)

జనవరి 19, 2026 టయోటా నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇది. మారుతి సుజుకి ఈ-విటారా ప్లాట్‌ఫారమ్‌పై తయారైన ఈ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల భారీ రేంజ్ ఇస్తుంది. దీని ఫ్రంట్ డిజైన్ చాలా షార్ప్‌గా, ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. లెవల్ 2 అడాస్ (ADAS), 360 డిగ్రీ కెమెరా వంటి హైటెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

2. నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite)
జనవరి 21, 2026 మధ్యతరగతి కుటుంబాల కోసం నిస్సాన్ తీసుకొస్తున్న బడ్జెట్ 7-సీటర్ ఎంపీవీ ఇది. ఇది రెనో ట్రైబర్ ఆధారంగా రూపొందించబడింది. నిస్సాన్ తనదైన శైలిలో గ్రిల్, బంపర్ మార్పులతో దీనికి కొత్త లుక్ ఇచ్చింది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, తక్కువ ధరలో ఎక్కువ స్పేస్ కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్.

6 New SUVs Launching in India Within 2 Weeks From Toyota EV to New Duster

3. కొత్త జనరేషన్ రెనో డస్టర్ (Renault Duster 2026)
జనవరి 26, 2026 ఎస్‌యూవీ లెజెండ్ డస్టర్ మళ్ళీ కొత్త అవతారంలో వస్తోంది. సరికొత్త CMF-B ప్లాట్‌ఫారమ్‌పై తయారైన ఈ కారులో వై-షేప్ ఎల్ఈడీ లైట్లు, పవర్‌ఫుల్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటాయి. ఇందులో 4X4 డ్రైవ్ ఆప్షన్ కూడా ఉండటం వల్ల ఆఫ్-రోడింగ్ లవర్లకు ఇది హాట్ ఫేవరెట్ కానుంది.

4. ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ (Volkswagen Tayron)
జనవరి 28, 2026 ఫోక్స్‌ వ్యాగన్ తన ప్రీమియం ఎస్‌యూవీ టైరాన్‌ను భారత్‌లోకి తెస్తోంది. ఇది 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. 19-ఇంచ్ అలాయ్ వీల్స్, 15-ఇంచ్ భారీ స్క్రీన్, మసాజ్ సీట్లు, 30 కలర్ యాంబియంట్ లైటింగ్‌తో ఈ కారు ఒక లగ్జరీ ప్యాలెస్ లాగా ఉంటుంది. దీని ధర రూ. 45 లక్షల వరకు ఉండవచ్చు.

6 New SUVs Launching in India Within 2 Weeks From Toyota EV to New Duster

5. మారుతి సుజుకి ఈ-విటారా (Maruti Suzuki e Vitara)
జనవరి చివరలో మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే. హ్యుందాయ్ క్రెటా ఈవీకి ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వచ్చే ఈ కారు, 500 కి.మీ పైగా రేంజ్ ఇస్తుంది. ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) ఆప్షన్ కూడా ఉండటం విశేషం.

6. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ (Skoda Kushaq Facelift)
జనవరి చివరలో ప్రస్తుతం ఉన్న కుషాక్ మోడల్‌ ను స్కోడా కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తోంది. ఇందులో 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, అడాస్ (ADAS) వంటి సేఫ్టీ ఫీచర్లు కొత్తగా చేరనున్నాయి. ఇంటీరియర్ డిజైన్ కూడా మరింత ప్రీమియంగా ఉండబోతోంది.

More from DriveSpark

Article Published On: Monday, January 19, 2026, 8:46 [IST]
English summary
6 new suvs launching in india within 2 weeks from toyota ev to new duster
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+