ఫుల్ ట్యాంక్ చేస్తే చాలు.. నాన్‌స్టాప్‌గా 1000 కిమీ.. పెద్ద ఫ్యామిలీస్ కోసం బెస్ట్ SUVలు వచ్చేస్తున్నాయ్

సొంతంగా ఓ పెద్ద కారు కొని తన ఫ్యామిలీతో కలిసి లాంగ్ జర్నీలకు వెళ్లాలని అనుకునే వాళ్లుకు ఓ సూపర్ గుడ్ న్యూస్. భారత ఆటోమొబైల్ మార్కెట్లో రాబోయే రోజుల్లో 6 లేదా 7 సీటర్ కార్ల హవా నడవబోతోంది. దేశంలోని ప్రముఖ దిగ్గజ కార్ల తయారీ కంపెనీలైన మారుతి సుజుకి, టయోటా, టాటా మోటార్స్, మహీంద్రా, కియా, ఎంజీ మోటార్స్ త్వరలోనే సరికొత్త ఫీచర్లు, అదిరిపోయే డిజైన్లతో కూడిన 7 సరికొత్త ఎస్‌యూవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాయి. ఈ కార్లన్నీ మల్టిఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో రోడ్లపైకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఆ 7 అద్భుతమైన SUVల పూర్తి వివరాలు, వాటి విశేషాలు తెలుసుకుందాం.

మారుతి, టయోటా నుంచి సరికొత్త 7-సీటర్ కార్లు
భారత మార్కెట్లో మంచి భాగస్వామ్యంతో నడుస్తున్న మారుతి సుజుకి, టయోటా కంపెనీలు తమ పాపులర్ మోడల్స్ అయిన గ్రాండ్ విటారా, హైరైడర్ కార్లను ఇప్పుడు 7-సీటర్ వెర్షన్లుగా మార్చే పనిలో పడ్డాయి. ప్రస్తుతం ఈ రెండు కార్ల టెస్టింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి.

7 Powerful 7 Seater SUVs Launching Soon In India With Up To 1000 KM Driving Rang

ఈ 7-సీటర్ మోడళ్లను 2026 చివరి నాటికి లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 5-సీటర్ మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త కార్ల పొడవు, వీల్‌బేస్ చాలా పెద్దగా ఉండబోతున్నాయి. దీనివల్ల మూడో వరుసలో కూర్చునే వారికి కూడా మంచి స్పేస్ లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో మునుపటి లాగే పవర్‌ఫుల్ హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ల ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ దీపావళికి టాటా సఫారీ ఈవీ ధమాకా
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్, తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన సఫారీని ఎలక్ట్రిక్ అవతార్‌లో తీసుకురాబోతోంది. టాటా సఫారీ ఈవీని ఈ 2026 దీపావళి పండుగ సీజన్ లో మార్కెట్లోకి విడుదల చేయడానికి కంపెనీ ముహూర్తం ఖరారు చేసింది.

త్వరలో రాబోయే టాటా సీరా ఈవీ తరహాలోనే ఇందులో కూడా 63kWh, 75kWh సామర్థ్యం గల రెండు పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. ఈ భారీ ఎస్‌యూవీ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని టాటా సంస్థ చెబుతోంది. దీని టాప్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఉండబోతోంది.

7 Powerful 7 Seater SUVs Launching Soon In India With Up To 1000 KM Driving Rang

సరికొత్త లుక్‌తో వస్తున్న మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్
భారతీయ యువతను ఎంతగానో ఆకట్టుకున్న మహీంద్రా స్కార్పియో ఎన్ ఇప్పుడు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో మెరవడానికి సిద్ధమైంది. ఈ దీపావళి పండుగ నాటికి మహీంద్రా ఈ కొత్త మోడల్‌ను లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ తో వచ్చే అలాయ్ వీల్స్, కొత్త రియర్ బంపర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

కారు లోపల కస్టమర్ల కోసం పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సరికొత్త డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను అమర్చనున్నారు. అయితే ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవు, ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ఇంజిన్లనే ఇందులోనూ కొనసాగిస్తారు.

కియా నుంచి వస్తున్న తొలి హైబ్రిడ్ కారు సొరెంటో
కియా ఇండియా కంపెనీ 2026 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి భారతదేశంలో తన మొట్టమొదటి పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఎస్‌యూవీ కియా సొరెంటోను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రీమియం కారు మార్కెట్లోకి టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్ వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

7 Powerful 7 Seater SUVs Launching Soon In India With Up To 1000 KM Driving Rang

అంతర్జాతీయ మార్కెట్లో దీనికి 1.6-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండగా, భారత్‌కు వచ్చేసరికి దీనిని 1.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. అదిరిపోయే మైలేజ్‌తో పాటు అల్ట్రా లగ్జరీ ఫీచర్లు ఈ కారు సొంతం.

ఫుల్ ట్యాంక్ చేస్తే 1000కిమీ పరిగెత్తే సరికొత్త ఎంజీ SUV
భారత మార్కెట్లో ఎంజీ మోటార్స్ సరికొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన ఒక సంచలన ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. చైనా మార్కెట్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వులింగ్ స్టార్‌లైట్ 560 మోడల్ ఆధారంగా ఈ కారును ఇండియన్ రోడ్లపైకి తెస్తున్నారు.

ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 20.5kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చనున్నారు. విశేషం ఏంటంటే.. కేవలం బ్యాటరీ పైనే ఈ కారు 125 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఒకవేళ పెట్రోల్, బ్యాటరీ పవర్ రెండింటినీ కలిపి వాడితే, ఎలాంటి బ్రేక్ లేకుండా ఏకంగా 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

టయోటా ఫార్చ్యూనర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్ వచ్చేస్తోంది
భారతదేశంలో లగ్జరీ, పవర్,స్టేటస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టయోటా ఫార్చ్యూనర్ ఇప్పుడు సరికొత్త నెక్స్ట్ జనరేషన్ మోడల్‌తో రాబోతోంది. 2026 చివరి నాటికి అంతర్జాతీయంగా పరిచయం కానున్న ఈ కారు, 2027 ప్రారంభంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

ఈ కొత్త మోడల్‌లో భారీ కాస్మెటిక్ మార్పులతో పాటు చాలా బోల్డ్ లుక్, అత్యంత లగ్జరీ ఇంటీరియర్ ఉండబోతున్నాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా కారు సేఫ్టీని పెంచేందుకు ఇందులో మొదటిసారిగా అడ్వాన్స్డ్ ADAS సేఫ్టీ ఫీచర్ల సుయిట్‌ను జోడించబోతున్నారు.

Article Published On: Wednesday, July 8, 2026, 11:10 [IST]
English summary
7 powerful 7 seater suvs launching soon in india with up to 1000 km driving rang
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+