చుట్టాలు ఎక్కువైనా చింత లేదు..గ్రావైట్ ఉంటే టెన్షన్ లేదు..బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్యామిలీ ప్యాక్

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది బడ్జెట్ ఎంపీవీ(MPV). ఇప్పుడు ఆ విభాగంలో ప్రకంపనలు సృష్టించేందుకు జపనీస్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్(Nissan) తన సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. తన పాపులర్ ఎస్‌యూవీ మాగ్నైట్ సృష్టించిన సంచలనాన్ని ఎంపీవీ మార్కెట్‌లోనూ పునరావృతం చేసేందుకు నిస్సాన్ గ్రావైట్(Nissan Gravite) పేరుతో 7-సీటర్ కారును తీసుకువస్తోంది.

చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిస్సాన్ సరికొత్త ఎంపీవీ గ్రావైట్(Gravite) లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. జనవరి 21, 2026న ఈ కారును అధికారికంగా మార్కెట్లోకి ఆవిష్కరించనున్నారు. నిస్సాన్ మాగ్నైట్ ఇప్పటికే దేశంలో బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన నేపథ్యంలో, ఇప్పుడు అదే విశ్వసనీయతతో కుటుంబాల కోసం గ్రావైట్‌ను రూపొందించారు.

Affordable Family MPV Nissan Gravite 7-Seater MPV Launch Confirmed for January 21 2026

ఇది రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా తయారైనప్పటికీ, స్టైలింగ్, ఫీచర్ల పరంగా నిస్సాన్ తనదైన మార్కును చూపిస్తోంది. ముఖ్యంగా ఇది మారుతి ఎర్టిగా వంటి పెద్ద కార్లకు తక్కువ ధరలో గట్టి పోటీ ఇవ్వనుంది. నిస్సాన్ గ్రావైట్ కేవలం ఒక సాధారణ ఫ్యామిలీ కారు మాత్రమే కాదు, చూడటానికి కూడా చాలా స్పోర్టీగా ఉంటుంది.

నిస్సాన్ సిగ్నేచర్ గ్రిల్, కొత్త డిజైన్ కలిగిన ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఇన్వర్టెడ్ ఎల్-ఆకారపు డిఆర్ఎల్‎లతో దీనికి ప్రీమియం లుక్ ఇచ్చారు. బంపర్ వద్ద ఉన్న ప్రత్యేకమైన కటింగ్స్ కారు మరింత వెడల్పుగా, రోడ్డుపై గంభీరంగా కనిపించేలా చేస్తాయి. వెనుకవైపు గ్రావైట్ బాడ్జింగ్‌తో స్లీకర్ టెయిల్ ల్యాంప్స్ దీనికి మరింత ఆకర్షణను జోడిస్తున్నాయి.

Affordable Family MPV Nissan Gravite 7-Seater MPV Launch Confirmed for January 21 2026

నిస్సాన్ గ్రావైట్ ప్రారంభ ధర సుమారు రూ.6 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి రూ.9లక్షల వరకు ఉండవచ్చని అంచనా. లోపల 8-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సౌకర్యం ఉంది. డ్రైవర్ కోసం 7-అంగుళాల సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఏడుగురు ప్రయాణించినా అందరికీ చల్లని గాలి అందేలా రెండో, మూడో వరుస సీట్ల వద్ద ప్రత్యేక ఏసీ వెంట్లను అమర్చారు. మూడవ వరుస సీట్లను అవసరమైనప్పుడు తీసివేసి లగేజీ కోసం ఎక్కువ స్థలాన్ని (Boot Space) పెంచుకునే వీలుంది.

Affordable Family MPV Nissan Gravite 7-Seater MPV Launch Confirmed for January 21 2026

నేటి కాలంలో కారు కొనేటప్పుడు భద్రత అనేది అత్యంత ముఖ్యం. నిస్సాన్ మాగ్నైట్ ఇప్పటికే భారత్ NCAP, గ్లోబల్ NCAP లలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి సత్తా చాటింది. అదే ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న గ్రావైట్ కూడా అదే స్థాయి భద్రతను అందిస్తుందని కంపెనీ ధీమాగా ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్), ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

గ్రావైట్‌లో 1.0 లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 71bhp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారుల సౌలభ్యం కోసం 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ (AMT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మైలేజీ పరంగా కూడా ఇది ఆకట్టుకోనుంది, లీటరుకు దాదాపు 18 నుంచి 20 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 6, 2026, 13:40 [IST]
English summary
Affordable family mpv nissan gravite 7 seater mpv launch confirmed for january 21 2026
Read more on: #nissan #family car #mpv #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+