దేశంలో ప్రతివారికి ఇష్టమైన మూడు కార్లు.. చిన్న ఫ్యామిలీకి సూపర్ ఆప్షన్లు.. ఈ కార్లను మిస్ అవ్వకండి!

మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనుగోలు చేయాలంటే హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ఇప్పటికీ మొదటి ఎంపికగా నిలుస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే అందుబాటులో ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, అలాగే పట్టణ ట్రాఫిక్‌లో సులభంగా నడపగలగడం వంటి ప్రయోజనాలు ఈ కార్లను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, పిల్లల స్కూల్ డ్రాప్‌లు, వీకెండ్ షాపింగ్ ట్రిప్‌లు ఈ అన్ని అవసరాలకు హ్యాచ్‌బ్యాక్‌లు సరైన సొల్యూషన్‌గా నిలుస్తాయి. భారత మార్కెట్లో ఈ సెగ్మెంట్‌లో బలమైన స్థానం సంపాదించిన కంపెనీలలో మారుతి సుజుకి (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors) ముందంజలో ఉన్నాయి. వీటి హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు మంచి మైలేజ్, విశ్వసనీయత, తక్కువ సర్వీస్ ఖర్చులు వంటి అంశాలతో మధ్యతరగతి వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్నాయి. ఈ కంపెనీలకు చెందిన కొన్ని హ్యచ్‌బ్యాక్‌ల గురించి ఈ కథనంలో.

Maruti Suzuki Celerio: భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ కోసం చూస్తే ముందుగా గుర్తుకు వచ్చేది సెలెరియో . పరిమాణంలో చిన్నదైనా, వినియోగంలో మాత్రం ఇది ఎంతో ప్రయోజనకరంగా నిలిచింది. నగర ట్రాఫిక్‌లో సులభంగా నడిపించుకోవచ్చు, పార్కింగ్ సమస్యలు తక్కువగా ఉంటాయి, అలాగే నిర్వహణ ఖర్చులు కూడా సాధారణ కుటుంబానికి అందుబాటులో ఉంటాయి.

Affordable Maruti And Tata Motots Hatchbacks Worth Buying Details

అధిక ఇంధన సామర్థ్యం ఈ కార్ ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. తన సెగ్మెంట్‌లోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే మోడళ్లలో ఒకటి. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు లేదా చిన్న కుటుంబ అవసరాలకు ఇది సరైన ఎంపికగా ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4.69 లక్షలు ఉండటం మరో పెద్ద ప్లస్ పాయింట్. బడ్జెట్ ధరలో ఎక్కువ ప్రయోజనం పొందాలనుకునే వారికి ఇది నిజంగా ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.

Tata Tiago: కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో భద్రత, పనితీరు, ధర.. ఈ మూడు అంశాలను సమతుల్యం చేసిన కారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది టియాగో. భారత మార్కెట్లో ఇది తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4.57 లక్షలు ఉండటం వల్ల బడ్జెట్‌లోనే మంచి కార్ కోసం చూస్తున్న వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. టియాగో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది.

Affordable Maruti And Tata Motots Hatchbacks Worth Buying Details

నగర డ్రైవింగ్‌కు తగిన పవర్, స్మూత్ పనితీరు అందించడంలో ఇది మంచి బ్యాలెన్స్‌ను ఇస్తుంది. అదనంగా CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉండటం వల్ల తక్కువ ఇంధన ఖర్చులతో ప్రయాణించాలనుకునే వారికి ఇది మరింత లాభదాయకంగా మారుతుంది. భద్రత విషయంలో టియాగోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో పాటు బలమైన బాడీ నిర్మాణం, మెరుగైన స్ట్రక్చరల్ స్టాబిలిటీ కుటుంబాలకు విశ్వాసాన్ని కలిగిస్తుంది.

Maruti Suzuki Alto K10: భారత మార్కెట్లో మొదటి కారు అనే పదానికి సమానార్థకంగా నిలిచిన మోడల్ అంటే ఆల్టో కె10. చిన్న హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ, సంవత్సరాలుగా ఇది లక్షలాది కుటుంబాల విశ్వాసాన్ని గెలుచుకుంది. తక్కువ బడ్జెట్‌లో సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ఆల్టో K10 ఇప్పటికీ ఒక బెస్ట్ చాయిస్‌గా నిలుస్తోంది. పరిమాణంలో కాంపాక్ట్‌గా ఉండటం వల్ల నగర ట్రాఫిక్‌లో సులభంగా నడిపించుకోవచ్చు.

Affordable Maruti And Tata Motots Hatchbacks Worth Buying Details

చిన్న వీధులు, తక్కువ పార్కింగ్ స్థలం ఉన్న ప్రదేశాల్లో కూడా ఇది చాలా ఈజీగా హ్యాండిల్ అవుతుంది. లోపల ప్రయాణీకులకు సరిపడా స్థలం ఉండటం, రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం దీని ప్రత్యేకత. ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్‌తో పాటు CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో ఇంధన ఖర్చులను తగ్గించుకోవచ్చు. STD(O) వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.69 లక్షల నుంచే మొదలవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 16, 2026, 12:57 [IST]
English summary
Affordable maruti and tata motots hatchbacks worth buying details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+