ఒకప్పుడు దేశం మొత్తం క్రేజ్ క్రియేట్ చేసిన కారు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా రాబోతోంది!

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో వేగంగా దూసుకెళ్తున్న టాటా మోటార్స్ (Tata Motors), పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ విజయంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే EV సెగ్మెంట్‌లో బలమైన స్థానం సంపాదించిన టాటా, ఇప్పుడు మరో ఐకానిక్ పేరును తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అదే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియోర్రా ఈవీ (Tata Sierra EV). సమాచారం ప్రకారం, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ కొత్త సియెర్రా EV అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశముంది. అంటే 2026 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒకప్పుడు భారతీయ రోడ్లపై ప్రత్యేక గుర్తింపు పొందిన సియెర్రా పేరు, ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ అవతారంలో తిరిగి రాబోతుండటం SUV అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ధర విషయానికి వస్తే, ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVను టాటా పోటీ ధరలోనే అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంచనా ప్రకారం, రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధర ఉండొచ్చు.

All New Tata Sierra Ev India Launch Expected In Fy2027 First Quarter

ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో గట్టి పోటీని తీసుకురావడం ఖాయం. ఇటీవల సియోర్రా ఐసీఈలో కొత్త అప్‌డేట్‌లతో మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో విడుదల చేయగా, అది బాగా సక్సెస్ అయింది. లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే వినియోగదారులకు బాగా నచ్చింది. అందుకే దీని బుకింగ్స్ కూడా ఊహించని స్థాయిలో పెరిగాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈవీ కూడా రాబోతుంది.

పాత సియెర్రా ప్రత్యేకతను నిలుపుకుంటూనే, కొత్త తరం డిజైన్‌తో ప్రత్యేక గుర్తింపు పొందేలా రూపొందించబడింది. సైజు పరంగా 4,340 mm పొడవు, 1,841 mm వెడల్పు, 1,715 mm ఎత్తుతో బలమైన రోడ్ ప్రెజెన్స్ ఇస్తుంది. 2,730 mm వీల్‌బేస్ కారణంగా లోపల ప్రయాణీకులకు విస్తృతమైన లెగ్‌రూమ్ లభిస్తుంది. 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల నగర రోడ్లపై కాకుండా, కొంచెం రఫ్ రోడ్లపై కూడా నమ్మకంగా నడిపించవచ్చు.

All New Tata Sierra Ev India Launch Expected In Fy2027 First Quarter

5-సీటర్ లేఅవుట్ ఫ్యామిలీకి సరైన కాంబినేషన్‌గా ఉంటుంది. బయటి డిజైన్‌లో మెరుగైన LED హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ LED DRLలు, ప్రొజెక్టర్ ఫాగ్ లైట్లు, స్టైలిష్ LED టెయిల్ ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్ అన్నీ కలిసి దీనికి ప్రీమియమ్, ఫ్యూచరిస్టిక్ లుక్ ఇస్తాయి. రోడ్డుపై ఈ SUV కనిపిస్తే, ఒక్కసారి తిరిగి చూసేలా చేసే అట్రాక్షన్ ఉండనుంది. పవర్ పరంగా కూడా ఇది నిరాశపరచదు.

ఈ ఎలక్ట్రిక్ SUVలో 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలు లభించనున్నాయి. పూర్తి ఛార్జ్‌పై సుమారు 538 నుంచి 627 కి.మీ.ల వరకు రేంజ్ అందించగలదని అంచనా. అంటే డైలీ కమ్యూట్ నుంచి లాంగ్ డ్రైవ్ వరకూ రేంజ్ టెన్షన్ లేకుండా ప్రయాణించవచ్చు. ఫీచర్ల పరంగా నిజంగా ప్రీమియమ్ SUV. కేబిన్‌లోకి అడుగుపెడితే ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

All New Tata Sierra Ev India Launch Expected In Fy2027 First Quarter

భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అదనపు డిస్‌ప్లే కలిసి ఫ్యూచరిస్టిక్ ఫీలింగ్ ఇస్తాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉండటంతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సులభం. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వలన డ్రైవర్, ప్యాసింజర్ తమకు నచ్చిన ఉష్ణోగ్రత సెట్ చేసుకోవచ్చు.

భద్రత విషయంలో కూడా ఈ SUV రాజీ పడదనే చెప్పాలి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS (Advanced Driver Assistance Systems) టెక్నాలజీతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అదనంగా ABS, EBD, ESC, TPMS, 360-డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ సిస్టమ్స్ డ్రైవింగ్‌ను మరింత భద్రంగా మార్చనున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 24, 2026, 17:17 [IST]
English summary
All new tata sierra ev india launch expected in fy2027 first quarter
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+