ఏప్రిల్‌లో రాబోతున్న అదిరిపోయే కార్లు! బ్రెజ్జా నుంచి ఎలక్ట్రిక్ వరకు భారీ లాంచ్‌లు!
ఈ ఏడాది ప్రారంభం నుంచే భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కొత్త కార్ల హడావిడి ఎక్కడా తగ్గలేదు. ప్రతి నెలా కొత్త మోడళ్లు వరుసగా ఎంట్రీ ఇస్తూ, కొనుగోలుదారుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా మార్చి నెలలో కీలకమైన లాంచ్‌లు జరిగిన తర్వాత, అదే జోరు ఇప్పుడు ఏప్రిల్ నెలలో కూడా కొనసాగనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో, కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ నెలలో వివిధ సెగ్మెంట్లలో పలు ఆసక్తికరమైన మోడళ్లు భారతీయ వినియోగదారుల ముందుకు రానున్నాయి. వాటిలో ముఖ్యంగా మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్, ఎంజీ మెజెస్ట్రీ, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా కార్లు ఉన్నాయి. వాటి గురించి ఈ కింది కథణంలో.
Maruti Suzuki Brezza Facelift: అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUVలలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజ్జా ఇప్పుడు కొత్త అవతారంలో రాబోతోంది. ఏప్రిల్‌లో లాంచ్ కానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్, పెద్దగా రూపాంతరం చెందకపోయినా, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక మార్పులతో వస్తోంది. డిజైన్ విషయానికి వస్తే, బయట నుంచి పెద్దగా మార్పులు కనిపించకపోయినా, చిన్న చిన్న అప్‌డేట్స్‌తో ఇది మరింత ఫ్రెష్ లుక్‌ను అందించనుంది.

ఈ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశం మాత్రం ప్రాక్టికాలిటీ. ముఖ్యంగా CNG వేరియంట్‌లో, బూట్ స్పేస్ సమస్యను తగ్గించేందుకు అండర్‌బాడీ CNG ట్యాంక్‌ను అమర్చే అవకాశముంది. సాధారణంగా CNG కార్లలో బూట్ స్పేస్ తగ్గిపోవడం ఒక పెద్ద మైనస్‌గా ఉండగా, ఈ మార్పుతో ఆ సమస్యకు మంచి పరిష్కారం లభించనుంది. ఇంకా ఒక ముఖ్యమైన అప్‌డేట్ ట్రాన్స్‌మిషన్ పరంగా కనిపించనుంది.
Volkswagen Taigun Facelift: జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన ప్రీమియం SUV లైన్‌ప్‌ను మరింత బలపరచేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, ఫేస్‌లిఫ్ట్ అవతారంలో వస్తున్న టైగన్‌ను 2026 ఏప్రిల్ 9న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్న ఈ మిడ్-సైజ్ SUV, కొత్త మార్పులతో మరింత ఆకర్షణీయంగా మారబోతోందని సమాచారం.

డిజైన్ విషయంలో, ఈ కొత్త టైగన్ గ్లోబల్ మోడళ్ల నుంచి ప్రేరణ పొందిన స్టైలింగ్‌ను అందుకోనుంది. దీంతో వాహనం లుక్ మరింత ప్రీమియంగా, ఆధునికంగా కనిపించే అవకాశం ఉంది. చిన్న చిన్న కాస్మెటిక్ మార్పులతో పాటు, ఫ్రంట్ గ్రిల్, లైటింగ్ ఎలిమెంట్స్ వంటి భాగాల్లో కొత్త టచ్‌లు ఇచ్చే అవకాశముంది మిడ్-సైజ్ SUVలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
MG Majestor: ఎంజీ మెజెస్ట్రీ 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించబడిన ఈ ఫుల్-సైజ్ SUV, ఇటీవల భారతదేశంలో అధికారికంగా ఆవిష్కరించబడింది. ప్రస్తుతం దీనికి రూ.41,000తో ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ధరలను ఏప్రిల్‌లో ప్రకటించే అవకాశం ఉండగా, డెలివరీలు 2026 మే నుంచి ప్రారంభమవుతాయని అంచనా. MG Motor మొదటి 3,000 మంది కస్టమర్ల కోసం '5-5-5' అనే ప్రత్యేక ఓనర్‌షిప్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.

Toyota Urban Cruiser Ebella: టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాలో 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. వీటిలో 49 kWh బ్యాటరీ ప్యాక్ ARAI ధృవీకరణ ప్రకారం సుమారు 440 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. . పెద్దదైన 61 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ EV ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 543 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








