చూపు తిప్పుకోనివ్వని అందం.. పట్టుకోలేనంత వేగం.. మార్చి 17న తన మ్యాజిక్ చూపనున్న ఆడి ఎస్‌క్యూ8

జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి (Audi) తన క్యూ8 (Q8) లైనప్‌ను భారత్‌లో మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. వేగాన్ని, విలాసాన్ని కోరుకునే వారి కోసం సరికొత్త ఆడి ఎస్‌క్యూ8 (Audi SQ8) పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని మార్చి 17న మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కారు కోసం బుకింగ్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ.5 లక్షల టోకెన్ అమౌంట్‌తో ఆడి అధికారిక వెబ్‌సైట్ లేదా myAudi Connect యాప్ ద్వారా తమ కలల కారును రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ కొత్త మోడల్ సాధారణ క్యూ8 వెర్షన్‌కు, అత్యంత శక్తివంతమైన ఆర్‌ఎస్ క్యూ8 (RS Q8)కు మధ్యలో ఉంటుంది. దీని ధరలను లాంచ్ రోజైన మార్చి 17న అధికారికంగా వెల్లడించనున్నారు.

ఆడి ఎస్‌క్యూ8 ఇంజిన్, పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇది ఒక పవర్‌ఫుల్ బీస్ట్ అని చెప్పాలి. ఇందులో 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. నిజానికి ఇది ఆర్‌ఎస్ క్యూ8 ఇంజిన్‌కు కాస్త తగ్గించిన వెర్షన్. ఇది గరిష్టంగా 507 హెచ్‌పీ శక్తిని, 770 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఆడి ప్రఖ్యాత క్వాట్రో (quattro) ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ సహాయంతో కారులోని నాలుగు చక్రాలకు పవర్ అందుతుంది.

Audi SQ8 India Launch on March 17 V8 Power 0-100 in 4 1s Luxury Redefined

ఈ కారు కేవలం 4.1 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇందులో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, రియర్-వీల్ స్టీరింగ్, స్పోర్ట్ డిఫరెన్షియల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.

డిజైన్ పరంగా ఎస్‌క్యూ8 తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. క్యూ8 సిరీస్ లో ఉండే కూపే-ఎస్‌యూవీ ఆకారాన్ని ఇది కొనసాగిస్తున్నప్పటికీ, స్పోర్టియర్ లుక్ కోసం ముందు బంపర్‌లో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్, ఎస్ (S) బ్యాడ్జింగ్, వెనుక నాలుగు ఎగ్జాస్ట్ టిప్స్ (Quad exhaust tips) ఇచ్చారు. మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, కారు వెనుక వైపు ఒక చివర నుండి మరో చివర వరకు సాగే ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ దీనికి మరింత రాజసాన్ని తెచ్చిపెట్టాయి. ఇండియా వెర్షన్‌లో సుమారు 21 నుంచి 23 అంగుళాల వరకు ఉండే భారీ అలాయ్ వీల్స్‌ను మనం ఆశించవచ్చు. చూడగానే కళ్లు చెదిరేలా ఉండే ఈ డిజైన్ లగ్జరీ కార్ల ప్రియులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

Audi SQ8 India Launch on March 17 V8 Power 0-100 in 4 1s Luxury Redefined

కారు లోపలి భాగం అంటే ఇంటీరియర్ విషయానికి వస్తే, ఆడి తన లగ్జరీ ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. డాష్‌బోర్డ్ మీద 12.3 అంగుళాల రెండు భారీ స్క్రీన్‌లు ఉంటాయి. ఒకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం అయితే, మరొకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది.

క్యాబిన్ మొత్తం ప్రీమియం అల్కాంటారా, లెదర్ తో నిండి ఉంటుంది. సీట్లపై ఎస్ (S) లోగో ఎంబ్రాయిడరీ చేసి ఉంటుంది. ఇంకా పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రఖ్యాత బ్యాంగ్ & ఓలుఫ్సెన్ (Bang & Olufsen) సౌండ్ సిస్టమ్ ప్రయాణాన్ని అత్యంత విలాసవంతంగా మారుస్తాయి. అంతేకాకుండా ముందు సీట్లకు హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లు కూడా ఉన్నాయి.

ధర, పోటీ విషయానికి వస్తే.. ఆడి ఎస్‌క్యూ8 ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.1.8 నుంచి 1.9 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బేస్ క్యూ8 ధర రూ.1.13 కోట్లు కాగా, టాప్ మోడల్ ఆర్‌ఎస్ క్యూ8 ధర రూ.2.34 కోట్లుగా ఉంది. ఈ ఎస్‌క్యూ8 మోడల్ మెర్సిడెస్-ఏఎంజీ జీఎల్ఈ 53 కూపే (Mercedes-AMG GLE 53 Coupe), పోర్షే కయీన్ జీటీఎస్ (Porsche Cayenne GTS) వంటి పవర్‌ఫుల్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ కావాలి కానీ మరీ ఆర్‌ఎస్ క్యూ8 అంత ఖరీదు వద్దు అనుకునే వారికి ఈ ఎస్‌క్యూ8 ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, March 13, 2026, 13:49 [IST]
English summary
Audi sq8 india launch on march 17 v8 power 0 100 in 4 1s luxury redefined
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+