కారు లోపల మసాజ్ సీట్లు.. బయట లేజర్ లైట్లు.. కేవలం 4.1 సెకన్లలో 100కి.మీ వేగం.. భారత రోడ్లపై ఆడి 'వజ్రాయుధం'
జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి (Audi) భారత మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త ఆడి SQ8 (Audi SQ8) పర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,77,72,000 (సుమారు రూ.1.78 కోట్లు)గా నిర్ణయించింది. ఆడి తన పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఉన్న క్యూ8 (Q8), అత్యంత వేగవంతమైన ఆర్ఎస్ క్యూ8 (RS Q8) మోడళ్ల మధ్య ఈ సరికొత్త SQ8ని నిలిపింది. అంటే, అటు లగ్జరీని, ఇటు అదిరిపోయే పర్ఫార్మెన్స్‌ను రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకునే ధనవంతుల కోసం ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
రాకెట్ వేగం.. తిరుగులేని ఇంజిన్ పవర్
ఆడి SQ8 కారులో అత్యంత పవర్ఫుల్ 4.0 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. ఇది ఏకంగా 507 పీఎస్ (500 bhp) శక్తిని, 770 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు వేగం గురించి చెప్పాలంటే.. ఇది కేవలం 4.1 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్ల వద్ద (ఎలక్ట్రానిక్ లిమిట్) నియంత్రించారు. ఇందులో ఉన్న 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఆడికి పేరు తెచ్చిన క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ వల్ల కారు ఎంత వేగంగా వెళ్తున్నా రోడ్డుపై పట్టు కోల్పోదు.

చూపు తిప్పుకోనివ్వని డిజైన్
బయట నుంచి చూస్తే ఆడి SQ8 ఎంతో గంభీరంగా, స్పోర్టీగా కనిపిస్తుంది. దీనిలో ఉన్న HD మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ లైట్లు, ఆడి లేజర్ లైట్ టెక్నాలజీ రాత్రి వేళల్లో కూడా పగటి వెలుతురును ఇస్తాయి. కారు ముందు భాగంలో అల్యూమినియం ఫినిషింగ్‌తో ఉన్న సింగిల్‌ఫ్రేమ్ గ్రిల్, స్పెషల్ ఎస్-సిరీస్ బంపర్లు, ఫ్రేమ్ లేని డోర్లు, 22 అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్ కారుకు ఒక రాయల్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. కారు వెనుక భాగంలో ఉన్న నాలుగు ఎగ్జాస్ట్ పైపులు (Quad exhaust tips) ఈ కారు ఎంత పవర్‌ఫుల్ అనే విషయాన్ని స్పష్టం చేస్తాయి.
లగ్జరీ ఇంటీరియర్.. అదిరిపోయే టెక్నాలజీ
కారు లోపలికి అడుగుపెడితే ఏదో మాయా ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. ప్రీమియం లెదర్, మైక్రో ఫైబర్ కాంబినేషన్ సీట్లు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. ఇందులో ఉన్న మసాజ్ ఫంక్షన్, హీటింగ్, కూలింగ్ సదుపాయం ప్రయాణికులకు అలసట రానివ్వవు. కారు డ్యాష్‌బోర్డ్‌లో రెండు 12.3 అంగుళాల భారీ స్క్రీన్లు ఉన్నాయి. ఆడి వర్చువల్ కాక్‌పిట్ ప్లస్, ఎంఎంఐ నావిగేషన్ వంటి ఫీచర్లు డ్రైవర్‌కు ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా మ్యూజిక్ ప్రియుల కోసం 17 స్పీకర్లు ఉన్న బ్యాంగ్ & ఓలుఫ్సెన్ 3D సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు, ఇది కారు లోపల ఒక థియేటర్ లాంటి అనుభూతిని ఇస్తుంది.

సేఫ్టీ, కంఫర్ట్ లో నంబర్ 1
సేఫ్టీ విషయంలో ఆడి ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ SQ8లో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, పార్క్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఆడి ప్రీ సెన్స్ బేసిక్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కారు ప్రయాణం మరింత సుఖమయంగా ఉండేందుకు అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ వాడారు, ఇది రోడ్డు మీద ఉన్న గుంతలను అసలు లోపలికి తెలియనివ్వదు. సాఫ్ట్-క్లోజ్ డోర్లు, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఈ లగ్జరీ ఎస్‌యూవీని ఒక అద్భుతంగా మార్చేశాయి. మైథోస్ బ్లాక్, డేటోనా గ్రే వంటి 8 రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








