జస్ట్ రూ.3 లక్షలకే 4 డోర్స్ ఎలక్ట్రిక్ కారు.. ఎండ తగలకుండా ఏసీ గాలిలో ప్రయాణం

మధ్య తరగతి ప్రజలకు తమ సొంత కారు కలను నిజం చేయడానికి ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త సంచలనానికి తెరలేపింది. భారతీయ మార్కెట్లోకి అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బజాజ్ క్యూట్ ఈవీ (Bajaj Qute EV) పేరుతో రాబోతున్న ఈ చిన్న కారు ధర, ఫీచర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మూడు లక్షల బడ్జెట్‌లోనే కొత్త ఈవీ కారు
సొంతంగా ఒక కారు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఉంటుంది. కానీ ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, లక్షల్లో ఉండే కార్ల రేట్లు చూసి చాలామంది వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే బజాజ్ సంస్థ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది.

bajaj qute ev affordable electric car launch price features

గతంలో మార్కెట్లో విడుదలైన బజాజ్ క్యూట్ సీఎన్‌జీ, ఎల్‌పీజీ మోడళ్లకు మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీనిని ఆటో రిక్షాకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా భావించేవారు. ఇప్పుడు అదే మోడల్‌ను కంప్లీట్ ఎలక్ట్రిక్ రూపంలో, సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమైంది. దీని ధర సుమారు రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

చిన్న కారే కానీ ఫీచర్లు అదరహో
ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, ఇందులో ప్రయాణికులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించారు. సాధారణంగా ఇంత తక్కువ ధరలో వచ్చే వాహనాల్లో ఏసీ సౌకర్యం ఊహించలేము. కానీ బజాజ్ క్యూట్ ఈవీలో ముందు భాగంలో డ్యాష్‌బోర్డ్‌తో పాటు టెంపరేచర్ కంట్రోల్ చేసుకునే ఏసీ డయల్స్ ఇచ్చారు.

bajaj qute ev affordable electric car launch price features

అంతేకాదు, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూఫ్ మౌంటెడ్ ఏసీ యూనిట్ లేదా కూలింగ్ ఫ్యాన్‌ను అమర్చడం విశేషం. ఇది ముందు వైపు నుండి వచ్చే చల్లని గాలిని కారు మొత్తం వేగంగా వ్యాపింపజేస్తుంది.

డిజైన్ అదిరింది.. లుక్ పరంగా మార్కులు పడ్డట్టే
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో లీకైన కొన్ని వీడియోల ప్రకారం, ఈ కారు నాలుగు తలుపులతో (4-Doors) వస్తోంది. దీనికి నలుపు రంగు డోర్ హ్యాండిల్స్, సైడ్ క్లాడింగ్ ఇచ్చారు. ముందు భాగంలో సంప్రదాయ హాలోజన్ హెడ్‌లైట్లు, విండ్‌షీల్డ్‌పై ఒకే ఒక వైపర్ ఉంటాయి.

bajaj qute ev affordable electric car launch price features

కారు లోపల స్టీరింగ్ వీల్‌పై స్పష్టంగా 'Qute' అనే లోగో కనిపిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ లేదా స్టీరియోను బయట మార్కెట్లో కొనుగోలు చేసి అమర్చుకోవడానికి వీలుగా డ్యాష్‌బోర్డ్‌పై ప్రత్యేక స్థలాన్ని వదిలేశారు. లగేజీని తీసుకెళ్లడానికి కారుపై భాగంలో రూఫ్ క్యారియర్ కూడా లభిస్తుంది.

లాంచ్ ఎప్పుడు? మైలేజ్ ఎంత ?
ప్రస్తుతం బజాజ్ సంస్థ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి తుది విడత రోడ్ టెస్టింగ్‌లను నిర్వహిస్తోంది. భారతీయ రహదారులపై దీని పనితీరును పరీక్షించిన తర్వాత, రాబోయే కొన్ని వారాల్లోనే దీనిని అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

అయితే ఈ కారులో ఉపయోగించే బ్యాటరీ సామర్థ్యం ఎంత, ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది (రేంజ్), అలాగే దీని టాప్ స్పీడ్ ఎంత అనే విషయాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తక్కువ ధరలో రోజువారీ ప్రయాణాలకు, సిటీ ట్రాఫిక్‌లో సులభంగా తిరగడానికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

Article Published On: Friday, May 22, 2026, 7:28 [IST]
English summary
Bajaj qute ev affordable electric car launch price features
Read more on: #bajaj #electric car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+