ఒకే ఛార్జ్‌తో 400 కి.మీ పైగా వెళ్లే 3 ఎలక్ట్రిక్ కార్లు.. బడ్జెట్‌లో లాంగ్ రేంజ్.. రోజూ వాడొచ్చు
ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారుల దృష్టి వేగంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో పాటు, పర్యావరణంపై అవగాహన పెరగడం కూడా ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. గతంలో ఈవీలు పరిమిత ఎంపికలతో ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విభిన్న ధరల పరిధిలో, విభిన్న అవసరాలకు సరిపోయేలా అనేక మోడళ్లు అందుబాటులోకి రావడంతో కొనుగోలుదారులకు ఎంపికలు విస్తరించాయి. ప్రత్యేకంగా మధ్యతరగతి వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి పెడుతున్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న వాహనాలు రోజువారీ ప్రయాణాలకే కాకుండా, పొడవైన ట్రిప్‌లకూ అనుకూలంగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో 400 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇచ్చే ఈవీలు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇవి తరచుగా ఛార్జింగ్ చేయాల్సిన అవసరాన్ని తగ్గించి, వినియోగదారులకు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో Tata Nexon EV, MG Windsor EV, అలాగే Tata Punch EV వంటి మోడళ్లు ప్రముఖంగా నిలుస్తున్నాయి. వీటి గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

Tata Nexon EV: ఎక్కువ రేంజ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ పనితీరు, సౌలభ్యం రెండింటినీ అందిస్తుంది. 45 kWh సామర్థ్యం గల బ్యాటరీతో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా సుమారు 489 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం లభిస్తుంది. ఈ రేంజ్ కారణంగా రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు మాత్రమే కాకుండా, వీకెండ్ ట్రిప్స్‌కు బెస్ట్ అవుతుంది.
60 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. సరైన ఫాస్ట్ ఛార్జర్ ఉంటే సుమారు 40 నిమిషాల్లోనే బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయచ్చు. అదే ఇంటి వద్ద లేదా సాధారణ స్టేషన్లలో ఉపయోగించే ఏసీ ఛార్జింగ్ ద్వారా ఛార్జ్ చేస్తే దాదాపు 6.5 గంటలు పడుతుంది. ఈ కారు రూ.12.49 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభమై, టాప్ ఎండ్ వేరియంట్ రూ.17.49 లక్షల వరకు వెళ్తుంది.

MG Windsor EV: ఎంజీ విండ్సర్ సాధారణంగా ఎక్సైట్ (బేస్) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.13.50 లక్షల నుంచి రూ.14.00 లక్షల మధ్య ఉండగా, కంపెనీ అందిస్తున్న BaaS (Battery as a Service) ఆప్షన్‌ను ఎంచుకుంటే ప్రారంభ ధరను రూ.9.99 లక్షల వరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా, టాప్-ఎండ్ ఎసెన్స్ ప్రో వేరియంట్ సాధారణంగా సుమారు రూ.18.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంటుంది.
కానీ ఇదే వేరియంట్‌ను BaaS మోడ్‌లో తీసుకుంటే ధర రూ.12.50 లక్షల వద్ద ప్రారంభమవడం మరో ముఖ్యమైన ఆకర్షణ. పనితీరు పరంగా కూడా 38 kWh, 52.9 kWh అనే రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉండటం వల్ల, వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. పూర్తి ఛార్జ్‌పై సుమారు 331 కిలోమీటర్ల నుంచి 449 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగల సామర్థ్యం ఉండటం వల్ల రోజువారీ ప్రయాణాలు సరిపోతుంది.

Tata Punch EV: టాటా పంచ్ ఈవీ గరిష్టంగా సుమారు 468 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదు. కొత్త 2026 ఫేస్‌లిఫ్ట్‌తో మెరుగైన రేంజ్, ఆధునిక టెక్నాలజీ, మరింత అఫోర్డబుల్ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.9.69 లక్షల వద్ద మొదలవుతుండగా, BaaS (Battery as a Service) ఆప్షన్‌ను ఎంచుకుంటే ప్రారంభ ధరను రూ.6.49 లక్షల వరకు తగ్గించుకోవచ్చు.


Click it and Unblock the Notifications