హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఈజీగా నడపగలిగే కార్లు ఇవే! రూ.6 లక్షల లోపు బడ్జెట్ ఉంటే కొనచ్చు
భారతదేశంలోని మెట్రో నగరాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా, రోజువారీ వాహనాల వినియోగం ప్రజలకు పెద్ద సవాల్‌గా మారుతోంది. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో నివసించే వారు ప్రతిరోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడపాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆఫీస్‌కు వెళ్లడం, తిరిగి ఇంటికి రావడం అన్నీ ఓ పెద్ద పరీక్షలా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన కొన్ని ప్రముఖ కార్ తయారీ సంస్థలు, నగరాల్లో డ్రైవింగ్‌ను మరింత సులభంగా, సౌకర్యంగా మార్చే దిశగా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తక్కువ పరిమాణం, సులభమైన మలుపులు, మంచి మైలేజ్, ట్రాఫిక్‌లో ఇబ్బంది లేకుండా నడిచే లక్షణాలతో ఈ కార్లు నగర ప్రయాణాలకు సరైన పరిష్కారంగా మారుతున్నాయి. ఈ కథణంలో ఆ కార్లను చూద్దాం.
Maruti Suzuki Wagon R: నగర ప్రయాణాలకు సరైన కారుగా పేరుగాంచిన మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ వినియోగదారులకు ఇంధన సామర్థ్యం, సౌకర్యం, విశ్వసనీయతను ఒకేసారి అందిస్తోంది. ఇందులో ఉన్న 1.2 లీటర్ కె-సిరీస్ ఇంజిన్ మంచి మైలేజ్‌తో పాటు అవసరమైన శక్తిని అందించడంలో ప్రసిద్ధి చెందింది. ట్రాఫిక్‌లో తరచూ ఆగి సాగాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ ఇంజిన్ స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.

ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో పాటు, నగర డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేసే AGS ఆటోమేటిక్ ఎంపికలో కూడా లభిస్తుంది. అంతేకాదు, CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉండటం మరో ప్రధాన ఆకర్షణ. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. CNG వేరియంట్ల ధర రూ. 5.88 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది వేరియంట్లను బట్టి 33 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Maruti Suzuki Baleno: నగరాల్లో సౌకర్యవంతమైన డ్రైవింగ్‌ను కోరుకునే వారికి మారుతి సుజుకి బాలెనో ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. నగర రోడ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన దీని సస్పెన్షన్ సిస్టమ్, గుంతలు ఉన్నా లేదా కఠినమైన రోడ్లపై ప్రయాణించినా వాహనాన్ని స్థిరంగా, సాఫీగా నడిపేలా చేస్తుంది. దీంతో రోజువారీ ప్రయాణాల్లో డ్రైవర్‌కు అలసట తక్కువగా అనిపిస్తుంది.

బాలెనో పెట్రోల్‌తో పాటు CNG ఎంపికల్లో లభిస్తోంది. ఇంధన ఖర్చులపై శ్రద్ధ పెట్టేవారికి CNG వేరియంట్ ఒక ఆర్థిక పరిష్కారంగా మారుతుంది. ధర విషయానికి వస్తే, మారుతి సుజుకి బాలెనో రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.10 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. ఫీచర్ల పరంగా చూస్తే, బాలెనో తన సెగ్మెంట్‌లో ముందంజలో నిలుస్తోంది. హెడ్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా వంటి అధునాతన సాంకేతికత అంశాలు ఉన్నాయి.
MG Comet EV: నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి సరైన పరిష్కారంగా MG కామెట్ EV ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రద్దీగా ఉండే నగర వీధుల్లో సులభంగా నడిపించేందుకు రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ వాహనం, చిన్న పరిమాణంతో పాటు అద్భుతమైన మానీవరబిలిటీని అందిస్తుంది. ముఖ్యంగా కేవలం 4.2 మీటర్ల టర్నింగ్ రేడియస్ ఉండటంతో, ఇది భారతదేశంలోనే అతి చిన్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలుస్తోంది.

ఇరుకైన వీధుల్లో మలుపులు తిప్పడం, ట్రాఫిక్‌లో దారి మార్చడం చాలా సులభంగా మారుతుంది. ధర విషయానికి వస్తే, రూ. 7.49 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. అయితే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ పథకాన్ని ఎంచుకుంటే, ఈ కారు రూ. 4.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కూడా అందుబాటులో ఉండటం నగర వినియోగదారులకు మరింత ఆకర్షణగా మారింది. ఒకే ఛార్జ్‌పై దాదాపు 230 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.


Click it and Unblock the Notifications








