భారత్‌లో బెస్ట్ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు.. రూ.6.49 లక్షల నుంచి స్టార్ట్, 400 కి.మీ రేంజ్!

పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, సాధారణంగా కార్ కొనుగోలు చేయాలని భావించే చాలామంది ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ రన్నింగ్ ఖర్చు, తక్కువ మెయింటెనెన్స్, దీర్ఘకాలికంగా ఆదా చేసే అవకాశాల కారణంగా ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ఈవీ మార్కెట్ వేగంగా విస్తరించడంతో, వివిధ బడ్జెట్ సెగ్మెంట్లలో అనేక ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. నగర ప్రయాణాలకు సరిపోయే కాంపాక్ట్ మోడల్స్ నుంచి ఫ్యామిలీకి అనువైన SUV రేంజ్ వరకు ఎన్నో ఆప్షన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా టాటా పంచ్ EV, నెక్సాన్ EV, మహీంద్రా XUV400 EV కార్ల గురించి ఈ కింది కథణంలో తెలుసుకుందాం.

Tata Nexon Ev: టాటా నెక్సాన్ ఈవీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ SUVలలో ఒకటి. ఈ కారు ధర ఎక్స్‌షోరూమ్ రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.49 లక్షల మధ్య ఉండగా, వినియోగదారుల అవసరాలను బట్టి 30 kWh, 45 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లు కూడా రోజువారీ నగర ప్రయాణాల నుంచి హైవే డ్రైవింగ్ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తాయి.

Best Budget Electric Suvs In India Tata Nexon Punch And Mahindra Xuv400

ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ ఇది సుమారు 275 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 489 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదు. ఇది వినియోగదారులకు రేంజ్ ఆంక్షలపై ఉన్న ఆందోళనను గణనీయంగా తగ్గిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఆధునిక కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రీమియం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్లు ఈవీ సెగ్మెంట్‌లో దీన్ని మరింత ప్రీమియం ఆప్షన్‌గా నిలబెడుతున్నాయి.

Tata Punch Ev : టాటా పంచ్ ఈవీ ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల మధ్య ఉండటంతో, మధ్యతరగతి వినియోగదారులకు ఇది ఒక ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది. BaaS ప్లాన్‌లో రూ. 6.49 లక్షల ప్రారంభ ధరతోనే ఈ ఎలక్ట్రిక్ SUVను ఇంటికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. కిలోమీటరుకు సుమారు రూ. 2.60 చెల్లించాల్సి ఉంటుంది.

Best Budget Electric Suvs In India Tata Nexon Punch And Mahindra Xuv400

రేంజ్ విషయానికి వస్తే, 25 kWh బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 265 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇక ఎక్కువ రేంజ్ కోరుకునే వినియోగదారుల కోసం 35 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ వెర్షన్ సుమారు 365 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదు. ఇది 360-డిగ్రీ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి టెక్నాలజీలను కూడా కలిగి ఉంది.

Mahindra XUV400 EV: మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ ధర సుమారు రూ.15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారత ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో సరసమైన ధరతో పాటు విశాలమైన ఇంటీరియర్ స్పేస్, బలమైన పర్ఫార్మెన్స్‌ను అందించే మోడల్‌గా గుర్తింపు పొందింది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, Mahindra XUV400 EV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 34.5 kWh బ్యాటరీ ప్యాక్.

Best Budget Electric Suvs In India Tata Nexon Punch And Mahindra Xuv400

ఈ వేరియంట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 375 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదు. ఇది రోజువారీ నగర ప్రయాణాలతో పాటు మధ్యస్థ దూర ప్రయాణాలకు కూడా సరిపోయే విధంగా రూపొందించబడింది. ఇక రెండవది 39.4 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ వేరియంట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 456 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించగలదు.

Article Published On: Saturday, May 23, 2026, 12:51 [IST]
English summary
Best budget electric suvs in india tata nexon punch and mahindra xuv400
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+