రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ కార్లు ఇవే.. మెయింటెనెన్స్‌ చాలా తక్కువ

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఆఫీసుకు వెళ్లాలనే హడావుడి, ఇటు రోడ్డు మీదకు రాగానే కిలోమీటర్ల కొద్ది సాగే ట్రాఫిక్ జామ్..ఈ రెండింటి మధ్య నలిగిపోయే సాధారణ ఉద్యోగికి ఒక మంచి కారు ఉంటే ఎంత ఊరటగా ఉంటుందో కదా.. బైకు మీద ఎండకు ఎండి.. వానకు తడిసి ఆఫీసుకు వెళ్లే వారికి సగం ఓపిక నశిస్తుంది.

అందుకే ప్రస్తుతం చాలా మంది మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లే వారు ఒక చిన్న కారు కొనాలని కలలు కంటున్నారు. అయితే, సిటీ ట్రాఫిక్‌లో నడపాలంటే అది కేవలం కారు మాత్రమే సరిపోదు.. మైలేజీ అదిరిపోవాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి. అన్నింటికీ మించి పార్కింగ్ చేసేందుకు ఈజీగా ఉండాలి.

best budget mileage cars like gold for daily office commute in india 2026

2026 నాటి లేటెస్ట్ ఆటోమొబైల్ ట్రెండ్స్, యూజర్ రివ్యూలను దృష్టిలో ఉంచుకుని, అవసరాలకు తగ్గట్టుగా ఆఫీస్ ప్రయాణాన్ని సుఖమయం చేసే బంగారం(gold) లాంటి బెస్ట్ కార్ల వివరాలు తెలుసుకుందాం.

బడ్జెట్ ధరలో మైలేజీ తోపులు (5-7 లక్షల లోపు):
మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Alto K10):
సిటీలో ఆఫీసుకు వెళ్లేందుకు ఇంతకంటే మంచి కారు దొరకడం కష్టం. దీని చిన్న సైజు వల్ల ఇరుకైన గల్లీలో కూడా ఈజీగా దూసుకుపోవచ్చు. పార్కింగ్ ప్లేస్ తక్కువ ఉన్న వారికి ఇది నిజంగా వరం. లీటరుకు సుమారు 24.9 కిమీ మైలేజ్ ఇస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ దీని ప్లస్ పాయింట్.

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో (Maruti S-Presso):
తక్కువ బడ్జెట్‌లో ఒక మినీ SUV ఫీలింగ్ కావాలనుకుంటే ఎస్ ప్రెస్సో బెస్ట్ ఛాయిస్. ఇది రోడ్డు మీద కాస్త ఎత్తుగా ఉండటం వల్ల విజిబిలిటీ బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సిటీ గుంతలను ఈజీగా దాటేయొచ్చు.

best budget mileage cars like gold for daily office commute in india 2026

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid):
స్టైలిష్ లుక్ కావాలనుకునే యంగ్ ఉద్యోగులకు క్విడ్ మంచి ఆప్షన్. దీని ఇంటీరియర్ డిజైన్, టచ్ స్క్రీన్ ఫీచర్లు ఈ బడ్జెట్‌లో చాలా బాగుంటాయి. చూడ్డానికి స్పోర్టీగా ఉండడం దీని ప్రత్యేకత.

ఫ్యామిలీ కంఫర్ట్, ఆఫీస్ యూజ్ (6-9 లక్షల లోపు):
మారుతి సుజుకి సెలెరియో (Maruti Celerio):
భారతదేశంలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే పెట్రోల్ కారుగా సెలెరియో పేరు తెచ్చుకుంది. లీటరుకు 26.68 కి.మీ మైలేజ్ అంటే మామూలు విషయం కాదు. దీని నెక్స్ట్-జెన్ ఇంజిన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఆఫీస్ ప్రయాణంలో పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది నెంబర్ వన్ ఛాయిస్.

మారుతి సుజుకి వాగన్ ఆర్ (Maruti Wagon R):
దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై రాజ్యమేలుతున్న కారు ఇది. దీని టాల్ బాయ్ డిజైన్ వల్ల లోపల స్పేస్ ఎక్కువగా ఉంటుంది. హెడ్ రూమ్ విషయంలో దీనికి సాటి లేదు. ఫ్యామిలీతో పాటు ఆఫీస్ అవసరాలకు కూడా ఇది పర్ఫెక్ట్. సీఎన్జీ వేరియంట్‌లో కూడా ఇది అద్భుతమైన మైలేజీ ఇస్తుంది.

best budget mileage cars like gold for daily office commute in india 2026

టాటా టియాగో (Tata Tiago):
సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చే వారు కళ్లు మూసుకుని టియాగోను ఎంచుకోవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దీని మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది.

ప్రీమియం ఫీచర్లు, సులభమైన డ్రైవింగ్ (8-10 లక్షల పైబడి):
హోండా అమేజ్ V CVT (Honda Amaze):
ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మార్చడం విసుగ్గా అనిపిస్తుందా? అయితే హోండా అమేజ్ ఆటోమేటిక్ (CVT) వేరియంట్ మీ కోసమే. ఇది చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‎పీరియన్స్ ఇస్తుంది. సెడాన్ కావడంతో బూట్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్, ఆఫీస్ కమ్యూట్ రెండింటికీ ఇది బెస్ట్.

best budget mileage cars like gold for daily office commute in india 2026

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Swift):
స్విఫ్ట్ అంటేనే ఒక ఎమోషన్. దీని లుక్ ఎప్పటికీ పాతబడదు. 2026 మోడల్స్‌లో మరిన్ని సేఫ్టీ ఫీచర్లు, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. పర్ఫార్మెన్స్, మైలేజ్ సమపాళ్లలో కావాలనుకునే వారికి స్విఫ్ట్ కి మించిన కారు లేదు.

హ్యుందాయ్ i10 నియోస్ (Hyundai i10 Nios):
లోపల ఇంటీరియర్ చూస్తే ఒక విదేశీ కారులో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఇందులో ఉండే స్మార్ట్ ఫీచర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఆఫీస్ గోయర్స్‌కి చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. దీని క్లచ్ చాలా లైట్‌గా ఉండటం వల్ల ట్రాఫిక్‌లో కాలు నొప్పి పుట్టదు.

మీరు రోజుకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేస్తుంటే, ఆటోమేటిక్ వేరియంట్ లేదా CNG ఆప్షన్‌ని పరిశీలించండి. ఆటోమేటిక్ వల్ల మీ కాళ్లకు, మనసుకి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే, కార్లలో ఇప్పుడు వస్తున్న హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల మైలేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కారు కొనేముందు మీ రూట్ లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి, టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చిన కారును ఎంచుకోండి.

Article Published On: Friday, May 1, 2026, 10:00 [IST]
English summary
Best budget mileage cars like gold for daily office commute in india 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+