కొత్త కారు కొనాలనుకుంటున్నారా? రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే

నేటి కాలంలో సొంతంగా ఒక కారు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. అందులోనూ రోడ్లపై గంభీరంగా కనిపించే కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV) అంటే మిడిల్ క్లాస్ ప్రజలకు ఎంతో క్రేజ్. 2026 నాటికి భారత ఆటోమొబైల్ మార్కెట్ విపరీతంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు రూ.10 లక్షల కంటే తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన ఫీచర్లు, అదిరిపోయే మైలేజ్, అత్యుత్తమ భద్రత కలిగిన ఎస్‌యూవీలు అందుబాటులోకి వచ్చాయి. మీ బడ్జెట్‌లో సరిపోయే టాప్-5 కాంపాక్ట్ ఎస్‌యూవీల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టాటా పంచ్
టాటా మోటార్స్ నుంచి వచ్చిన టాటా పంచ్ (Tata Punch) ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటి. దీనికి ప్రధాన కారణం దీని భద్రత. భారత్ ఎన్‌క్యాప్ (BNCAP) టెస్టుల్లో ఇది 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. అంటే ప్రయాణికుల భద్రత విషయంలో దీనికి తిరుగులేదు. ఈ కారులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, నేచురల్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.

Best Compact SUVs Under 10 Lakhs in India Style Safety and Performance Combined

ఇది గరిష్టంగా 118 హార్స్‌పవర్, 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఖర్చులు భరించలేని వారి కోసం టాటా ఇందులో సీఎన్‌జీ (CNG) వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నగరం లోపల డ్రైవింగ్ చేయడానికి, కుటుంబంతో కలిసి చిన్న చిన్న ట్రిప్పులు వేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

హ్యుందాయ్ ఎక్స్టర్
మీకు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వాళ్లకు హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter) మీ కోసమే. హ్యుందాయ్ కంపెనీ ఈ కారును కేవలం యువతను, టెక్నాలజీని ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 81 హార్స్‌పవర్, 113.8 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

Best Compact SUVs Under 10 Lakhs in India Style Safety and Performance Combined

ఎక్స్టర్ లోని అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే, ఇందులో వాయిస్ ఎనేబుల్డ్ సన్‌రూఫ్, డాష్‌క్యామ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. దీని ప్రారంభ ధర రూ.5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్). మంచి మైలేజీతో పాటు స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఎక్స్టర్ ఒక అద్భుతమైన ఎంపిక.

మారుతి సుజుకి బ్రెజ్జా
ఎప్పటిలాగే మారుతి సుజుకి తన బ్రెజ్జా (Maruti Suzuki Brezza) మోడల్‌తో 10 లక్షల లోపు విభాగంలో దూసుకుపోతోంది. బ్రెజ్జా అంటేనే నమ్మకమైన ఇంజిన్, రీసేల్ వాల్యూ. ఇందులో శక్తివంతమైన 1.5 లీటర్ కే-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 99.23 హార్స్‌పవర్ మరియు 137.1 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

Best Compact SUVs Under 10 Lakhs in India Style Safety and Performance Combined

పొదుపుగా ఉండాలనుకునే వారికి సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. బ్రెజ్జా ఇంటీరియర్ చాలా విశాలంగా ఉంటుంది, ఇది ఐదుగురు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.26 లక్షల నుంచి మొదలవుతుంది. సర్వీసింగ్ నెట్‌వర్క్, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలని కోరుకునే వారు బ్రెజ్జాను ఎంచుకోవచ్చు.

మహీంద్రా XUV 3XO
ఒకప్పుడు XUV 300గా పిలవబడే ఈ కారు ఇప్పుడు కొత్త హంగులతో మహీంద్రా XUV 3XOగా మన ముందుకు వచ్చింది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మంచి పవర్, పికప్ కోరుకుంటే XUV 3XO ని మించిన కారు మరొకటి లేదు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ ఏకంగా 128 హార్స్‌పవర్, 230 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది, ఇది ఈ విభాగంలోనే అత్యధికం.

అలాగే డీజిల్ వెర్షన్ 300 ఎన్ఎమ్ టార్క్‌తో కొండ ప్రాంతాల్లో కూడా సునాయాసంగా దూసుకుపోతుంది. సెగ్మెంట్లోనే మొదటిసారిగా ఇందులో లెవల్-2 ADAS వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.7.37 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్పోర్టీ డ్రైవింగ్ ఇష్టపడే వారికి ఇది సరైన మొనగాడు.

Best Compact SUVs Under 10 Lakhs in India Style Safety and Performance Combined

మారుతి సుజుకి ఫ్రాంక్స్
మారుతి నుంచి వచ్చిన మరో విభిన్నమైన మోడల్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx). దీని డిజైన్ చాలా మోడ్రన్‎గా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ కే-సిరీస్ ఇంజిన్‌తో పాటు, వేగం కోరుకునే వారి కోసం 1.0 లీటర్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్ కూడా ఉంది.

ఈ టర్బో ఇంజిన్ సుమారు 21.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఫ్రాంక్స్ లోని కర్వీ డిజైన్, కూపే తరహా లుక్ రోడ్డుపై అందరినీ ఆకర్షిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.85 లక్షల నుండి ప్రారంభమవుతుంది. తక్కువ ధరలో ఒక లగ్జరీ కారు అనుభూతిని పొందాలనుకుంటే ఫ్రాంక్స్ ఉత్తమమైనది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 18, 2026, 18:34 [IST]
English summary
Best compact suvs under 10 lakhs in india style safety and performance combined
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+