ఇండియాలో పాపులర్ డీజిల్ కార్లు.. ఒక్కసారి కొంటే చాలాకాలం వాడొచ్చు.. అద్భుతమైన శక్తితో సరసమైన ధర

కొత్తగా డీజిల్ కార్ కొనాలంటే ఇప్పుడు వినియోగదారులకు అంత సులభం కాదు. మార్కెట్‌లో డీజిల్ వేరియంట్లు అందించే కంపెనీల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఇందుకు ప్రధాన కారణం. దేశంలో అగ్రగామి ఆటోమొబైల్ తయారీదారైన మారుతి సుజుకి డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేసిన తర్వాత, రోడ్లపై కూడా ఈ వాహనాల ఉనికి తగ్గుతూ వచ్చింది. మిగతా కంపెనీలు కూడా క్రమంగా తమ డీజిల్ కార్ల విడుదలను చాలా వరకు తగ్గించాయి. ఇందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఉద్గార నిబంధనలు. అదే సమయంలో, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతూ ఉండటం కూడా డీజిల్ కార్ల డిమాండ్ తగ్గడానికి దోహదపడుతోంది. ఇదిలా ఉంటే డీజిల్ కార్లను కొనుగోలు చేయాలని అనుకునే వారికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆ కార్లను ఈ కింది కథణంలో చూద్దాం.

Tata Nexon: టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో బలమైన స్థానం సంపాదించిన కాంపాక్ట్ SUVల్లో ఒకటి. పనితీరు, మైలేజ్, సేఫ్టీ ప్యాకేజీగా నిలిచే ఈ కారు, డీజిల్ కార్ కొనాలని చూస్తున్న వారికి మంచి ఆప్షన్‌. ఈ నెక్సాన్‌లో 1.5 లీటర్ సామర్థ్యం గల ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉంది. ఈ ఇంజన్ 115 హార్స్‌పవర్ పవర్, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Best Diesel Suv Cars In India Tata Nexon Hyundai Venue Toyota Fortuner

డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు, ఈ SUVలో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 6-స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్ వేరియంట్ డ్రైవింగ్ కంట్రోల్ ఇష్టపడే వారికి అనుకూలంగా ఉంటే, AMT వేరియంట్ ట్రాఫిక్ పరిస్థితుల్లో అలసట తగ్గించేలా పనిచేస్తుంది. ధర విషయానికి వస్తే, టాటా నెక్సాన్ డీజిల్ మోడల్ సుమారు రూ.9 లక్షల నుంచి రూ.14.22 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) లభిస్తోంది.

Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ కంపెనీ SUV లైనప్‌లో ఒక ముఖ్యమైన స్థానం దక్కించుకున్న మోడల్. ఇది చిన్న SUVల విభాగంలో ఉండేలా డిజైన్ చేయబడినప్పటికీ, ఫీచర్లు, పనితీరు పరంగా మాత్రం పెద్ద కార్లకు తగ్గట్టు అనుభూతిని ఇస్తుంది. వెన్యూ డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ సామర్థ్యం గల ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఈ ఇంజన్ సుమారు 116 హార్స్‌పవర్ పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Best Diesel Suv Cars In India Tata Nexon Hyundai Venue Toyota Fortuner

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా జత చేయబడింది. అయితే, రెండవ తరం వెన్యూ వచ్చాక, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా అందించడం ప్రారంభించారు. ధర పరంగా చూస్తే, హ్యుందాయ్ వెన్యూ డీజిల్ వేరియంట్ సుమారు రూ.9.88 లక్షల నుంచి రూ.15.64 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) లభిస్తోంది.

Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుల్-సైజ్ SUVల్లో ఒకటిగా కొనసాగుతోంది. బలమైన నిర్మాణం, రఫ్ అండ్ టఫ్ డిజైన్, అలాగే ఎలాంటి రోడ్లపైనా నమ్మకంగా ప్రయాణించే సామర్థ్యం వల్ల ఇది ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది. ముఖ్యంగా ఆఫ్-రోడింగ్‌ను ఇష్టపడే వారికి ఫార్చ్యూనర్ ఒక ఐకానిక్ ఎంపికగా మారింది.

Best Diesel Suv Cars In India Tata Nexon Hyundai Venue Toyota Fortuner

ఇందులో 2.8 లీటర్ సామర్థ్యం గల శక్తివంతమైన డీజిల్ ఇంజన్ ఉంటుంది, 4x4 డ్రైవ్ సిస్టమ్ లభిస్తుంది. ఈ సిస్టమ్ కారణంగా కఠినమైన మార్గాలు, పర్వత ప్రాంతాలు, చెడు రోడ్లపై కూడా కారు అద్భుతంగా ప్రదర్శన ఇస్తుంది. ఇటీవల, ఈ మోడల్‌లో 2.8 లీటర్ డీజిల్ ఇంజన్‌ను మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా అందిస్తున్నారు. ఈ సాంకేతికత వల్ల ఇంధన వినియోగం కొంత మెరుగవడంతో పాటు, డ్రైవింగ్ మరింత ఎఫిషియెంట్‌గా మారుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 21, 2026, 9:25 [IST]
English summary
Best diesel suv cars in india tata nexon hyundai venue toyota fortuner
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+