జెన్ Z కోసం బెస్ట్ 3 ఎలక్ట్రిక్ కార్లు.. నెక్స్ట్ జనరేషన్ లైఫ్‌స్టైల్‌కు సింబల్! స్టైల్, టెక్నాలజీలో టాప్!

ఇప్పటి యువత కారు కొనుగోలు చేసే విధానం గత తరాలతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా జెన్ Z తరం కేవలం మైలేజ్ లేదా ధరను మాత్రమే కాకుండా, కారు ఎంత స్మార్ట్‌గా ఉంది, అందులో ఎలాంటి డిజిటల్ ఫీచర్లు ఉన్నాయి, మొబైల్‌తో ఎంత సులభంగా కనెక్ట్ అవుతుంది వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. స్టైలిష్ లుక్, అత్యాధునిక టెక్నాలజీ, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లపై ఈ తరం ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. అలాంటి జెన్ Z కొనుగోలుదారులకు ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

MG Comet EV: జెన్ Z కొనుగోలుదారుల అభిరుచులకు అచ్చొచ్చే ఎలక్ట్రిక్ కార్లలో కామెట్ EV ముందువరుసలో ఉంటుంది. నగర ప్రయాణాలకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ మైక్రో ఈవీ, చిన్న సైజ్‌తో పాటు ఆకట్టుకునే డిజైన్, హైటెక్ ఫీచర్లతో యువతను టార్గెట్ చేస్తోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.62 లక్షలు కాగా, BaaS పథకం ద్వారా రూ. 4.99 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

Best Electric Cars For Gen Z Mg Comet Tiago Ev Mahindra Be6

ఈ కారులో 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించగా, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఫీచర్ల విషయానికి వస్తే.. 55కు పైగా i-SMART కనెక్టెడ్ కార్ ఫీచర్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, డ్యూయల్ 10.25-అంగుళాల ఫ్లోటింగ్ స్క్రీన్లు, లెదరెట్ సీట్లు, ప్రత్యేకమైన టూ-డోర్ డిజైన్ వంటి అంశాలు ఈ కారును యువతకు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

Tata Tiago EV: తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్‌గా కనిపించే, ఆధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్న జెన్ Zకు టియాగో EV మంచి ఆప్షన్‌. ఇటీవల వచ్చిన ఫేస్‌లిఫ్ట్ కొత్త బాడీ-కలర్ బంపర్లు, లక్స్ బీమ్ LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLsతో మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.99 లక్షలు, BaaS పథకంతో రూ. 4.69 లక్షల ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Best Electric Cars For Gen Z Mg Comet Tiago Ev Mahindra Be6

కారులో 24 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించగా, సింగిల్ ఛార్జ్‌తో 285 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 18 నిమిషాల ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల రేంజ్ పొందవచ్చు. ఫీచర్ల పరంగా ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ , ట్రాక్షన్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు, వెనుక AC వెంట్లు ఉన్నాయి.

Mahindra BE 6: ఫ్యూచరిస్టిక్ డిజైన్, హై-పర్‌ఫార్మెన్స్, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఎలక్ట్రిక్ SUV కావాలనుకునే జెన్ Zకు బీఈ 6 అద్భుతమైన ఎంపిక. బోర్న్-ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిన ఈ SUV, స్పోర్టీ లుక్‌తో పాటు ప్రీమియం క్యాబిన్ అనుభూతిని అందిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.90 లక్షలు. టాప్ వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

Best Electric Cars For Gen Z Mg Comet Tiago Ev Mahindra Be6

ఫీచర్ల పరంగా రేస్ కార్ తరహా డిజిటల్ కాక్‌పిట్, భారీ పనోరమిక్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 1,400W అవుట్‌పుట్‌తో 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ డాల్బీ అట్మోస్ ఆడియో సిస్టమ్, MAIA సాఫ్ట్‌వేర్ ఆధారిత కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లైవ్ యువర్ మూడ్ లైటింగ్ థీమ్ వంటి ఫీచర్లు, భద్రత పరంగా లెవెల్-2 ADAS, 360-డిగ్రీ సేఫ్టీ సిస్టమ్, రైడ్ విజన్ X, ఆటో పార్క్ అసిస్ట్ ఉన్నాయి.

Article Published On: Monday, June 29, 2026, 9:24 [IST]
English summary
Best electric cars for gen z mg comet tiago ev mahindra be6
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+