ఈ ఎలక్ట్రిక్ కార్లనే జనాలు ఎక్కువగా కొంటున్నారు.. తక్కువ బడ్జెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయ్!పెట్రోల్‌కు గుడ్‌బై
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణానికి మేలు వంటి కారణాల వల్ల చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే దేశంలో EV మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ నెలలో మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్లో కొన్ని మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా టాటా టియాగో (Tata Tiago EV), టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), ఎంజీ విండ్సర్ (MG Windsor EV) వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. ఈ కార్లు మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, అందుబాటు ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వీటి గురించి ఈ కింది కథణంలో.
Tata Tiago EV: భారత EV మార్కెట్లో అందుబాటు ధరలో లభించే కార్లలో టాటా టియాగో ఈవీ ఒకటి. ఈ కారు ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.14 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారును కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా భావించబడుతోంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఈ కారులో రెండు ఎంపికలు ఉన్నాయి.

ఇందులో 19.2 kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ఛార్జ్‌పై ఇది సుమారు 223 నుంచి 293 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. 5-సీట్ల సెటప్‌తో వచ్చే ఈ కారులో ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించేందుకు మంచి స్థలం ఉంటుంది. ఫీచర్ల పరంగా 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ పరంగా కూడా ఈ కారు ఆధునికంగా కనిపిస్తుంది.
Tata Punch EV: భారత మార్కెట్లో మైక్రో ఎలక్ట్రిక్ SUVలలో మంచి గుర్తింపు పొందిన మోడల్ టాటా పంచ్ ఈవీ. తక్కువ ధరలో SUV స్టైల్, మంచి ఫీచర్లు అందించడం వల్ల ఇది వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. అదనంగా, 'BaaS' (బ్యాటరీ యాజ్-ఎ-సర్వీస్) ప్లాన్‌ను కూడా అందిస్తోంది.

ఈ ప్లాన్‌తో కారును రూ. 6.49 లక్షల ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు సుమారు రూ. 2.60 చెల్లించాల్సి ఉంటుంది. డిజైన్ పరంగా చూస్తే పంచ్ ఈవీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి సుమారు 195 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో భారతీయ రోడ్లపై సులభంగా నడపవచ్చు. అలాగే 2,700 mm వీల్‌బేస్ ఉండటం వల్ల లోపల ప్రయాణికులకు సరిపడినంత స్థలం కూడా లభిస్తుంది.
MG Windsor EV: భారత EV మార్కెట్లో మంచి గుర్తింపు పొందుతున్న SUVలలో ఎంజీ విండ్సర్ ఒకటి. ఆధునిక ఫీచర్లు, మంచి రేంజ్‌తో ఈ కారు కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీని ధర సుమారు రూ.14 లక్షల నుంచి రూ.18.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. అదనంగా, MG Motor India ఈ కారును 'BaaS' (బ్యాటరీ యాజ్-ఎ-సర్వీస్) పథకం కింద కూడా అందిస్తోంది.

ఈ ప్లాన్‌లో కారును రూ.9.99 లక్షల ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు సుమారు రూ.3.50 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటరీ ఎంపికల విషయానికి వస్తే,38 kWh, 52.9 kWh బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ఛార్జ్‌పై ఈ కారు సుమారు 331 నుంచి 449 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. 5-సీట్ల సెటప్‌తో వచ్చే ఈ SUVలో ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించవచ్చు.


Click it and Unblock the Notifications








