పెద్ద కుటుంబాలకు సరిపోయే రూ.10 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. దేశంలో వీటికే డిమాండ్ ఎక్కువ!

మీరు తక్కువ బడ్జెట్‌లో విశాలమైన, కుటుంబ అవసరాలకు సరిపోయే 7-సీటర్ కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? రోజువారీ వినియోగంతో పాటు కుటుంబ సభ్యులందరూ కలిసి సౌకర్యంగా ప్రయాణించేందుకు అనువైన కారు కోసం చూస్తున్నట్లయితే, మార్కెట్లో మీ కోసం అనేక మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు 7-సీటర్ కారు అంటే భారీ బడ్జెట్ అవసరమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అందుబాటు ధరలోనే మంచి ఫీచర్లు, మెరుగైన మైలేజ్, తగినంత స్థలం, భద్రతా సదుపాయాలతో కూడిన 7-సీటర్ కార్లు భారత మార్కెట్లో లభిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ.10 లక్షల లోపు అయితే, ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ ధర పరిధిలో అందుబాటులో ఉన్న, మంచి డిమాండ్‌తో పాటు వినియోగదారుల ఆదరణ పొందుతున్న కార్లను చూద్దాం.

Maruti Ertiga: భారత మార్కెట్లో కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యమైన 7-సీటర్ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా ఒకటి. విశాలమైన క్యాబిన్, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో ఈ MPV మంచి ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఎర్టిగా LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, వీటిలో LXi, VXi వేరియంట్లు మాత్రమే రూ.10 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరలో లభిస్తున్నాయి.

Best Family 7 Seater Cars Under 10 Lakh Ertiga Triber And Bolero Neo

బేస్ LXi వేరియంట్ ధర రూ.8.85 లక్షలు, VXi వేరియంట్ ధర రూ.9.90 లక్షలు(ఎక్స్-షోరూమ్). పనితీరు పరంగా ఎర్టిగాలో 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ‌ను అందిస్తున్నారు. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. మైలేజ్ కోరుకునే వారి కోసం ఇదే ఇంజన్‌తో CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. అయితే CNG మోడల్‌లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే లభిస్తుంది.

Renault Triber: తక్కువ బడ్జెట్‌లో 7-సీటర్ కారు కొనాలనుకునే వారికి రెనాల్ట్ ట్రైబర్ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. కేవలం 4 మీటర్లలోపు పొడవు ఉన్నప్పటికీ, ఏడుగురు ప్రయాణికులు కూర్చునేలా దీన్ని తెలివిగా డిజైన్ చేశారు. విశాలమైన క్యాబిన్, మాడ్యులర్ సీటింగ్ లేఅవుట్, మంచి బూట్ స్పేస్‌తో ఈ MPV కుటుంబ అవసరాలకు బాగా సరిపోతుంది. అందుబాటు ధరలో ఇంత ప్రయోజనకరమైన 7-సీటర్‌ను అందించడం ట్రైబర్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.

Best Family 7 Seater Cars Under 10 Lakh Ertiga Triber And Bolero Neo

ప్రస్తుతం రెనాల్ట్ ట్రైబర్ ఆథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.81 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించగా, 5-స్పీడ్ మాన్యువల్, AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. మైలేజ్ కోరుకునే వినియోగదారుల కోసం డీలర్‌షిప్ స్థాయిలో CNG కిట్‌ను కూడా అమర్చుకునే అవకాశం ఉంది.

Mahindra Bolero Neo: రూ.10 లక్షల లోపు లభించే 7-సీటర్ వాహనాల్లో SUV బాడీ స్టైల్‌తో అందుబాటులో ఉన్న అరుదైన మోడళ్లలో బొలెరో నియో ఒకటి. బలమైన నిర్మాణం, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, గ్రామీణ ప్రాంతాలు, కఠినమైన రోడ్లపై సులభంగా నడిచే సామర్థ్యంతో ఈ SUV మంచి ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం బొలెరో నియో N4, N8, N10(R), N10 Opt, N11 అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Best Family 7 Seater Cars Under 10 Lakh Ertiga Triber And Bolero Neo

వీటిలో N10 Opt మినహా మిగతా అన్ని వేరియంట్లు రూ.10 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరలో లభిస్తున్నాయి. రూ. 8.85 లక్షల నుండి వీటి ధరలు ఉంటాయి. పనితీరు పరంగా ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను అందించారు. తక్కువ బడ్జెట్‌లో డీజిల్ ఇంజన్‌తో వచ్చే 7-సీటర్ SUV కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉండగా, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లేదు.

Article Published On: Sunday, June 28, 2026, 7:21 [IST]
English summary
Best family 7 seater cars under 10 lakh ertiga triber and bolero neo
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+