చిన్న కార్లు కావు.. 8 సీటర్ భారీ కార్లు, 23 కి.మీ మైలేజ్ ఇస్తాయ్! ఫ్యామిలీకి ప్యాలెస్‌లు

పెద్ద కుటుంబాలతో ప్రయాణం చేయడం అంటే కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడమే కాదు, అందరూ కలిసి కంఫర్ట్‌గా, ఇబ్బంది లేకుండా ప్రయాణించడం కూడా అంతే ముఖ్యమైన విషయం. అలాంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన వాహనాలే ఎంవీపీలు (MPVs). ఇవి సాధారణ కార్లతో పోలిస్తే ఎక్కువ స్పేస్, మెరుగైన సీటింగ్ అమరిక, ఫ్యామిలీ అవసరాలకు సరిపోయే విధంగా ప్రాక్టికల్ డిజైన్‌ను అందిస్తాయి. ప్రత్యేకంగా పెద్ద కుటుంబాల కోసం చూస్తే, ఎంవీపీలు ఒక పూర్తి ప్యాకేజ్‌లా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎంపీవీ విభాగంలో టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross), మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) వంటి రెండు ప్రసిద్ధి చెందాయి. వీటి గురించిన వివరాలను ఈ కింది కథనంలో ఇవ్వడం జరిగింది.

డిజైన్: డిజైన్ పరంగా చూస్తే మారుతి సుజుకి ఇన్విక్టో ఒక సింపుల్ కానీ ఎలిగెంట్ స్టైలింగ్‌తో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్స్, DRLs ఇవ్వడం వల్ల ఆధునిక టచ్ కనిపిస్తుంది. వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్స్ కూడా సరిగ్గా సెటప్ చేయబడినట్టు కనిపిస్తాయి. అయితే అల్లాయ్ వీల్స్ విషయంలో ఇది 16 అంగుళాల ఆప్షన్‌తో రావడం వల్ల కొంచెం సబ్టిల్, సొగసైన లుక్ ఇస్తుంది.

Best Family Mpvs Maruti Invicto Vs Toyota Innova Hycros Price Design Comparison

టయోటా ఇన్నోవా హైక్రాస్ విషయానికి వస్తే, దీని ఫ్రంట్ ప్రొఫైల్ ఆకర్షణీయంగా ఉండి, పెద్ద గ్రిల్‌తో పాటు షార్ప్ LED హెడ్‌ల్యాంప్స్, DRLs కలిపి రోడ్డుపై స్ట్రాంగ్ ప్రెజెన్స్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కూడా మోడ్రన్‌గా ఉండి, మొత్తం లుక్‌ను కంప్లీట్ చేస్తాయి. ముఖ్యంగా 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ దీనికి మరింత ప్రీమియం టచ్‌ను ఇచ్చి, పెద్ద కార్ ఫీల్‌ను స్పష్టంగా చూపిస్తాయి.

పనితీరు: ఇన్విక్టో 2-లీటర్ పెట్రోల్ + ఎలక్ట్రిక్ కాంబినేషన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. దీనికి e-CVT గేర్‌బాక్స్ జత కావడం వల్ల డ్రైవింగ్ స్మూత్‌గా అనిపిస్తుంది, ముఖ్యంగా నగర ట్రాఫిక్‌లో ఎలాంటి జర్క్స్ లేకుండా సాఫీగా ప్రయాణించవచ్చు. మైలేజ్ పరంగా సుమారు 23 kmpl వరకు ఇంధన సామర్థ్యం ఇవ్వడం కూడా దీని పెద్ద ప్లస్ పాయింట్. అంతేకాకుండా, గరిష్ట వేగం సుమారు 170 kmph.

Best Family Mpvs Maruti Invicto Vs Toyota Innova Hycros Price Design Comparison

ఇన్నోవా హైక్రాస్‌లో 2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 2-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ లభిస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయంలో CVT, e-CVT గేర్‌బాక్స్ ఎంపికలు ఉండటం వల్ల వినియోగదారులు తమ డ్రైవింగ్ స్టైల్‌కు తగ్గట్టు ఎంపిక చేసుకోవచ్చు. మైలేజ్ పరంగా 16.13 kmpl నుంచి 23.24 kmpl వరకు ఇవ్వడం వల్ల, పనితీరు, ఎఫిషియెన్సీ మధ్య మంచి బ్యాలెన్స్‌ను ఇది అందిస్తుంది.

ఫీచర్స్: ఫీచర్ల పరంగా చూస్తే ఇన్విక్టో ఏమాత్రం తగ్గదు. ఇందులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత ప్రీమియంగా మార్చేస్తాయి. ముఖ్యంగా డ్రైవర్,ముందు ప్రయాణీకులకు ఇది చాలా కంఫర్ట్‌ను అందిస్తుంది.

Best Family Mpvs Maruti Invicto Vs Toyota Innova Hycros Price Design Comparison

ఇన్నోవా హైక్రాస్‌ ఫీచర్ల పరంగా బెస్ట్‌గా కనిపిస్తుంది. ఇందులో కూడా 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి తోడు సన్‌రూఫ్, వెనుక AC వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సౌకర్యాలు ఉండటం వల్ల అన్ని సీట్లలో కూర్చున్న వారికి సమానంగా కంఫర్ట్ లభిస్తుంది. మంచి క్వాలిటీ మ్యూజిక్ సిస్టమ్ కూడా ప్రయాణాన్ని మరింత ఎంజాయ్ చేయించేలా చేస్తుంది.

ధర: ఇన్విక్టో ధరలు రూ. 24.97 లక్షల నుంచి ప్రారంభమై, సుమారు రూ. 28.61 లక్షల వరకు ఉంటాయి (ఎక్స్-షోరూమ్). ఇన్నోవా హైక్రాస్ విస్తృతమైన ధర శ్రేణితో మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 18.48 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్లకు వెళ్తే రూ. 31.30 లక్షల వరకు చేరుతుంది. తక్కువ బడ్జెట్‌తో పెద్ద ఎంవీపీ కొనాలనుకునే వారికి ఈ రెండు బెస్ట్ ఆప్షన్లు.

Article Published On: Thursday, April 23, 2026, 18:18 [IST]
English summary
Best family mpvs maruti invicto vs toyota innova hycros price design comparison
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+