ఎక్కువ లగేజ్ స్పేస్ ఉన్న టాప్ SUVలు.. ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్లు
కొత్త కారు కొనేటప్పుడు చాలా మంది కేవలం సీటింగ్ కెపాసిటీ మాత్రమే కాదు, దాని ఉపయోగకరతను కూడా గమనిస్తారు. ఐదుగురు కూర్చోవచ్చా అనే విషయం తో పాటు, మైలేజ్ ఎంత ఇస్తుంది, మెయింటెనెన్స్ ఖర్చు ఎలా ఉంటుంది, రీసేల్ విలువ ఎంత ఉంటుంది వంటి అంశాలు కూడా ముఖ్యంగా చూస్తారు. అంతేకాకుండా, ప్రయాణాల్లో సామాన్లు పెట్టుకునే ట్రంక్ స్పేస్ కూడా భారతీయ వినియోగదారులకు చాలా కీలకం. ఫ్యామిలీతో ట్రిప్స్‌కు వెళ్లేటప్పుడు లేదా రోజువారీ అవసరాలకు సరిపడా లగేజ్ స్పేస్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ కారణాల వల్లనే చాలా మంది SUVలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు విస్తృతమైన ట్రంక్ స్పేస్ ఇచ్చే అనేక SUVలు అందుబాటులో ఉన్నాయి. ఆ కార్ల గురించి ఈ కింది కథణంలో.
Renault Duster: బూట్ స్పేస్ విషయానికి వస్తే రెనాల్ట్ డస్టర్ నిజంగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న SUV. చాలా కార్లలో లగేజ్ స్పేస్ ఒక పరిమితి కాగా, డస్టర్ మాత్రం ఆ విషయంలో ఎక్కడా తగ్గదు. న్యూ జెన్ మోడల్‌లో ఏకంగా 518 లీటర్ల బూట్ స్పేస్ అందించడం హైలైట్. ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్‌కు వెళ్లేటప్పుడు లేదా ఎక్కువ సామాన్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఈ స్పేస్ ఎంతో ఉపయోగపడుతుంది.

ధర పరంగా కూడా ఈ న్యూ జెన్ డస్టర్ ఆకర్షణీయంగా ఉంటుంది. రూ. 10.29 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండటం వల్ల, ఇది మిడ్-రేంజ్ SUV కొనాలనుకునే వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది. ఇది 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ సాధారణ నగర ప్రయాణాలకు సరిపోతే, 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరింత పవర్‌ను అందిస్తుంది. 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఆప్షన్ కూడా ఉంది.
Tata Sierra: మళ్లీ రీఎంట్రీ ఇస్తూ ఆకట్టుకుంటున్న టాటా సియెర్రా, తన డిజైన్‌తో పాటు ప్రాక్టికాలిటీ పరంగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా బూట్ స్పేస్ విషయంలో ఈ మిడ్-సైజ్ SUV చాలా మందిని ఆకర్షించే విధంగా ఉంది. సుమారు 600 లీటర్ల లగేజ్ స్పేస్ ఇవ్వడం దీని ప్రధాన హైలైట్. ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్‌కి వెళ్లినా, ఎక్కువ సామాన్లు తీసుకెళ్లాల్సి వచ్చినా, ఈ స్పేస్ చాలా ఉపయోగపడుతుంది.

ఇది రూ. 11.49 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 104 bhp పవర్, 145 Nm టార్క్‌ను అందిస్తుంది. 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 158 bhp పవర్, 255 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది, ఇది 116 bhp పవర్, 280 Nm టార్క్‌ను అందిస్తుంది.
Honda Elevate: ప్రస్తుతం మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో మంచి స్పందన పొందుతున్న హోండా ఎలివేట్. స్పేస్, పనితీరు పరంగా సమతుల్యమైన ఎంపికగా నిలుస్తోంది. ముఖ్యంగా బూట్ స్పేస్ విషయంలో ఇది కుటుంబ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉంది. 458 లీటర్ల లగేజ్ సామర్థ్యం ఉండటంతో, రోజువారీ అవసరాలు మాత్రమే కాకుండా లాంగ్ ట్రిప్స్‌కు కూడా ఇది సరిపోతుంది. సూట్‌కేసులు, బ్యాగులు వంటి సామాన్లను సులభంగా అమర్చుకునేంత స్థలం ఇందులో లభిస్తుంది.

ఇంజిన్ విషయానికి వస్తే, 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల i-VTEC పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తోంది. ఈ ఇంజిన్ స్మూత్ పనితీరుతో పాటు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు లభిస్తాయి .ధర పరంగా చూస్తే, ఈ SUV రూ. 11.59 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








