జూన్‌లో దేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసిన 10 కార్లు ఇవే.. ఒక్కోటి హాట్ ఫేవరెట్ మోడళ్లు!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో జూన్ నెల అమ్మకాల గణాంకాలు ఆసక్తికరమైన చిత్రాన్ని చూపించాయి. ఎన్నో సంవత్సరాలుగా అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మొదటి రెండు స్థానాలపై మారుతి సుజుకి ఆధిపత్యం కొనసాగుతుండేది. అయితే ఈసారి ఆ ట్రెండ్‌కు బ్రేక్ పడింది. టాటా మోటార్స్‌కు చెందిన రెండు ప్రముఖ ఎస్‌యూవీలు టాటా పంచ్, టాటా నెక్సాన్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన మొదటి రెండు కార్లుగా నిలిచి కొత్త రికార్డు సృష్టించాయి. ఒకే కంపెనీకి చెందిన రెండు మోడళ్లు టాప్-2 స్థానాలను కైవసం చేసుకోవడం టాటా మోటార్స్‌కు పెద్ద విజయంగా చెప్పవచ్చు. జూన్ నెలలో టాటా పంచ్ ఏకంగా 21,006 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది.

గత ఏడాది ఇదే నెలలో ఈ మోడల్ 10,446 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఈసారి అమ్మకాలు 101 శాతం పెరిగాయి. మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పంచ్, ఆకర్షణీయమైన డిజైన్, 5-స్టార్ భద్రతా రేటింగ్, పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వంటి పవర్‌ట్రెయిన్‌లతో అన్ని వర్గాల కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఫేస్‌లిఫ్ట్, పంచ్ EV మోడళ్లు అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణం.

Best Selling Cars In India June 2026 Full Top 10 Sales List Details

అదే సమయంలో టాటా నెక్సాన్ కూడా తన జోరును కొనసాగించింది. గత ఏడాది జూన్‌లో 11,602 యూనిట్లు విక్రయించిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఈసారి 18,335 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. అంటే ఏడాది వ్యవధిలో నెక్సాన్ అమ్మకాలు 58 శాతం పెరిగాయి. అత్యాధునిక ఫీచర్లు, బలమైన భద్రతా ప్రమాణాలు, పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెర్షన్లు అందుబాటులో ఉండటం నెక్సాన్‌కు భారీ డిమాండ్‌ను తీసుకొచ్చాయి.

ఇక ఎన్నో సంవత్సరాలుగా అమ్మకాలలో అగ్రస్థానంలో కొనసాగుతున్న మారుతి సుజుకి ఈసారి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కంపెనీకి చెందిన ప్రముఖ సెడాన్ మారుతి డిజైర్ జూన్ నెలలో 17,899 యూనిట్లు విక్రయించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే డిజైర్ అమ్మకాలు 15.6 శాతం పెరగడం విశేషం. అయితే టాప్-2 స్థానాల్లోకి మాత్రం చేరలేకపోయింది. మారుతి సుజుకి మోడళ్లు తర్వాతి స్థానాల్లో కూడా తమ బలాన్ని కొనసాగించాయి.

Best Selling Cars In India June 2026 Full Top 10 Sales List Details

వ్యాగన్‌ఆర్ 16,952 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలవగా, ఎర్టిగా 16,111 యూనిట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్న స్విఫ్ట్ 15,215 యూనిట్ల అమ్మకాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఈ మూడు మోడళ్లు కూడా తమ తమ సెగ్మెంట్లలో స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి. గతంలో తరచూ టాప్-10లో కనిపించిన క్రెటా ఈసారి జాబితాలో చోటు కోల్పోగా, దాని స్థానంలో మహీంద్రా స్కార్పియో తన సత్తా చాటింది.

జూన్‌లో స్కార్పియో 14,097 యూనిట్ల అమ్మకాలతో ఏడో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే స్కార్పియో అమ్మకాలు 10.65 శాతం పెరిగాయి. ఫ్రాంక్స్ 13,135 యూనిట్ల అమ్మకాలతో ఎనిమిదో స్థానంలో, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో 12,488 యూనిట్లతో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఫ్రాంక్స్ అమ్మకాలు 34 శాతం, బాలెనో అమ్మకాలు 39 శాతం పెరగడం ఈ రెండు మోడళ్లకు ఉన్న డిమాండ్‌ను సూచిస్తోంది.

Best Selling Cars In India June 2026 Full Top 10 Sales List Details

హ్యుందాయ్ విషయానికి వస్తే, ఈసారి కంపెనీకి చెందిన క్రెటా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే దాని స్థానాన్ని మరో హ్యుందాయ్ ఎస్‌యూవీ అయిన వెన్యూ భర్తీ చేసింది. జూన్ నెలలో వెన్యూ 10,776 యూనిట్ల అమ్మకాలతో పదో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో 6,858 యూనిట్లు మాత్రమే విక్రయించిన ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఈసారి 57 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Article Published On: Saturday, July 4, 2026, 14:47 [IST]
English summary
Best selling cars in india june 2026 full top 10 sales list details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+