బైక్ ధరకే కారు.. రూ.3.49 లక్షల నుంచే 35కిమీ మైలేజ్ కార్లు.. పేద మధ్యతరగతి కోసం బెస్ట్ 5 ఆప్షన్స్ ఇవే
కారు కొనాలి అనిపిస్తుంది... కానీ బడ్జెట్ అడ్డంకి. ఇదే పరిస్థితి చాలా మందిది. కానీ ఇప్పుడు సీన్ మారింది. బైక్ ధరలోనే కారు కొనొచ్చు... సొంత కారు అనేది ప్రతి సామాన్యుడి కల. కానీ ఆ కారు కొన్న తర్వాత పెట్రోల్ ధరల సెగ తట్టుకోవాలి అనే భయంతో చాలా మంది ఆ అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అయితే, ఇప్పుడు రోజులు మారాయి.
టెక్నాలజీ పెరగడంతో తక్కువ ధరలోనే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే కార్లు మార్కెట్లోకి వచ్చాయి. కేవలం బైక్ ధరకే కొంచెం అటు ఇటుగా అంటే.. రూ. 3.49 లక్షల నుంచే కార్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ రూ. 5 లక్షల లోపు ఉన్నా సరే, స్టైలిష్‌గా, సేఫ్టీగా ఉండే కార్లు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. 2026లో ఎక్కువగా అమ్ముడవుతున్న మోడళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. మారుతి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso):
మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉండి, కొంచెం ఎత్తుగా ఉండే కారు కావాలనుకుంటే మారుతి ఎస్-ప్రెస్సో బెస్ట్ ఛాయిస్. దీని ధర కేవలం రూ.3.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. చిన్న కారు లాగే కనిపించినా, లోపల స్పేస్ బాగుంటుంది. ముఖ్యంగా సిటీలో డ్రైవ్ చేయడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈ కారులో ఇప్పుడు సేఫ్టీని కూడా పెంచారు.
ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లను కూడా ఆప్షనల్‌గా అందిస్తున్నారు. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వెర్షన్ లీటరుకు సుమారు 24-25 కిలోమీటర్లు ఇస్తుండగా, CNG వెర్షన్ ఏకంగా 32 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది. తక్కువ ఖర్చుతో ఆఫీస్‌కి వెళ్లాలనుకునే వారికి ఇది ఒక వరం లాంటిది.

2. మారుతి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10):
భారతదేశంలో కార్ల చరిత్రలో ఆల్టోకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు కొత్త లుక్‌లో వస్తున్న ఆల్టో కే10 మరింత స్మార్ట్‌గా తయారైంది. దీని ధర రూ. 3.69 లక్షల నుంచి మొదలవుతుంది. దీని మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఒకవేళ చిన్నపాటి రిపేర్లు వచ్చినా ఏ మెకానిక్ అయినా చిటికెలో చేసేస్తారు.
దీని ఇంజిన్ పవర్ ఫుల్‌గా ఉండటంతో పాటు మైలేజ్ కూడా ఆకట్టుకుంటుంది. పెట్రోల్‌లో 24 కిలోమీటర్లు, CNG లో సుమారు 33 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మొదటిసారి కారు కొంటున్న వారు కళ్లు మూసుకుని దీనిని ఎంచుకోవచ్చు.

3. రెనాల్ట్ క్విడ్ (Renault Kwid):
మీకు తక్కువ ధరలో స్టైలిష్ గా కనిపించే కారు కావాలా? అయితే రెనాల్ట్ క్విడ్ వైపు చూడాల్సిందే. ఒక చిన్న ఎస్‌యూవీ లుక్‌ను ఇచ్చే ఈ కారు యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. దీని ధర సుమారు రూ. 4.69 లక్షల నుంచి ఉంటుంది.
లోపల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా సాఫీగా వెళ్తుంది. ఇది లీటర్ పెట్రోల్ కు 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

4. టాటా టియాగో (Tata Tiago):
బడ్జెట్ లో ఉన్నా సరే నాకు ప్రాణ రక్షణ ముఖ్యం, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అనుకునే వారు టాటా టియాగోను ఎంచుకోవచ్చు. దీని ధర సుమారు రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ రేటింగ్‌లో ఇది 4 స్టార్లను సాధించి తన సత్తా చాటింది.
కారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మైలేజ్ పరంగా చూస్తే లీటరుకు 19-20 కిలోమీటర్లు ఇస్తుంది. సేఫ్టీ విషయంలో రాజీ పడకూడదనుకునే ఫ్యామిలీలకు ఇది సరైన ఎంపిక.

5. మారుతి సెలెరియో (Maruti Suzuki Celerio):
ఇక మైలేజ్ లో నంబర్ వన్ ఎవరు అంటే అది మారుతి సెలెరియోనే. దీని ధర రూ. 4.69 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారు పెట్రోల్ వెర్షనే దాదాపు 25-26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, CNG లో ఇది ఏకంగా 35 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది.
ఇండియాలో అత్యంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లలో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఫీచర్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. రోజూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేసే వారికి సెలెరియో ఒక గొప్ప ఆప్షన్.


Click it and Unblock the Notifications