పేదోడి కల నిజం కానుంది.. అత్యంత చవక EV రాబోతోంది! పైగా సింగిల్ ఛార్జ్‌తో 250 కిమీలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటం, నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచన, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన వంటి కారణాలతో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని కోరుకునే వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో దేశీయ, విదేశీ ఆటోమొబైల్ కంపెనీలతో పాటు కొత్త ఈవీ స్టార్టప్‌లు కూడా భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని కొత్త మోడళ్లను వరుసగా పరిచయం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈవీ స్టార్టప్ కంపెనీ బ్లింక్ మోబిలిటీ (Blinq Mobility) భారత వినియోగదారుల కోసం అత్యంత సరసమైన ధరలో కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొస్తుంది. బ్లింక్ రైడ్ (Blinq Ryde) పేరుతో ఈ కారు దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలవనుంది. అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ మొబిలిటీని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ వాహనాన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

Blinq Ryde Electric Car Expected India Price Features And Range Details

ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.4.50 లక్షలు మాత్రమే అని అంచనా, అలాగే టాప్ వేరియంట్ ధర రూ.5.00 లక్షల వరకు ఉండవచ్చు, తక్కువ బడ్జెట్‌లో ఈవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే ఈ ధర గణనీయంగా తక్కువ కావడం దీని ప్రధాన ప్రత్యేకతగా చెప్పవచ్చు.

బ్లింక్ రైడ్ కాంపాక్ట్, ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. LED హెడ్‌లైట్లు, ఏరోడైనమిక్ బాడీ డిజైన్, 10 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. బయటకు చిన్నగా కనిపించినప్పటికీ, లోపల ఐదుగురు సౌకర్యంగా కూర్చునేలా క్యాబిన్‌ను రూపొందించారు. ఫీచర్ల విషయానికి వస్తే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, పవర్ స్టీరింగ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఏసీ, హీటర్, ఎఫ్‌ఎమ్ రేడియో, బ్యాటరీ సేవర్ మోడ్ వంటివి ఇందులో ఉన్నాయి.

Blinq Ryde Electric Car Expected India Price Features And Range Details

పనితీరు పరంగా బ్లింక్ రైడ్‌లో సమర్థవంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. ఈ మోటార్ గరిష్టంగా 13.41 bhp పవర్, 50 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్ సెటప్‌తో పాటు సింగిల్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. అంతేకాకుండా, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఇందులో అందించారు. బ్రేక్ వేసే సమయంలో ఉత్పత్తి అయ్యే శక్తిని తిరిగి బ్యాటరీలో నిల్వ చేయడం ద్వారా బ్యాటరీ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

రేంజ్ విషయానికి వస్తే, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే బ్లింక్ రైడ్ 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ఈ రేంజ్ నగరాల్లో రోజువారీ ప్రయాణాలు, ఆఫీస్ రాకపోకలు, చిన్న దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ ధరలోనే ఇంత రేంజ్‌ను అందించడం ఈ కారుకు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఈ కారును బ్యాటరీ-స్వాపింగ్ టెక్నాలజీతో కూడా అందించే యోచనలో కంపెనీ ఉంది.

Blinq Ryde Electric Car Expected India Price Features And Range Details

దీంతో ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, 3 నిమిషాల్లో బ్యాటరీని మార్చుకుని తిరిగి ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం లభించనుంది. భద్రత విషయంలో కూడా బ్లింక్ రైడ్ ఎలాంటి రాజీ పడలేదు. ప్రయాణికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఇందులో పలు ఆధునిక సేఫ్టీ ఫీచర్లను అందించారు. దీని గురించిన మరింత సమాచారం త్వరలో తెలుస్తుంది.

Article Published On: Saturday, June 27, 2026, 17:30 [IST]
English summary
Blinq ryde electric car expected india price features and range details
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+