డబ్బున్నోళ్లు ఈ కారునే ఎక్కువగా కొంటున్నారు.. సెలబ్రిటీలు, ధనవంతులు బాగా ఇష్టపడుతున్నారు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ (BMW)కు 2026 సంవత్సరం నిజంగా గ్రాండ్ స్టార్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఇప్పటికే లగ్జరీ కార్ల మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో కూడా, ఈ బ్రాండ్ తన ప్రదర్శనతో ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అయితే, BMW పూర్తిగా ఆధిపత్యం చాటుతూ ఇతర కంపెనీలకు గట్టి సవాల్ విసురుతోంది. 2026 మొదటి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి వరకు)లో కంపెనీ మొత్తం 1,185 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం గమనార్హం. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 83 శాతం పెరుగుదల సాధించడం నిజంగా పెద్ద విజయంగా చెప్పుకోవాలి. ఈ గణాంకాలు చూసినప్పుడు, భారతదేశంలో ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లపై డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతుందో స్పష్టమవుతోంది.
ఇప్పటికే పరిస్థితి ఇలా మారింది, బీఎమ్‌డబ్ల్యూ విక్రయించే ప్రతి నాలుగో కారు ఒక ఎలక్ట్రిక్ వాహనం. అంటే, కంపెనీ మొత్తం సేల్స్‌లో EVల ప్రాధాన్యం ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది. అంతేకాదు, భారతదేశంలోని లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో BMW వాటా 70 శాతానికి పైగా ఉండటం, ఈ సెగ్మెంట్‌లో కంపెనీ ఎంత బలంగా నిలిచిందో చూపిస్తోంది. ఈ అద్భుతమైన విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి బీఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్1 (BMW iX1).

ఈ ఎలక్ట్రిక్ SUV తన ప్రీమియం డిజైన్, ఆధునిక ఫీచర్లు, మంచి రేంజ్‌తో బాగా ఆకర్షిస్తోంది. నగరాల్లో లగ్జరీ EV కొనాలనుకునే కస్టమర్లకు ఇది సరైన ఎంపికగా మారింది. సాధారణంగా లగ్జరీ కార్లు అంటే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని ధనవంతలు, సెలబ్రిటీలు కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లలో BMW iX1 కారును ఎంచుకోవడం విశేషం. ఈ కారులో ఏదో స్పెషాలిటీ దాగి ఉంది.
BMW iX1 సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ధరే అని చెప్పాలి. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో దాదాపు 80% వాటా ఈ ఒక్క మోడల్‌దే కావడం నిజంగా ఆశ్చర్యకరం. అంటే, BMW EV పోర్ట్‌ఫోలియోలో iX1 ఎంత కీలక పాత్ర పోషిస్తుందో దీని ద్వారా స్పష్టమవుతోంది. ధర పరంగా చూస్తే, ఈ ఎలక్ట్రిక్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ.51.40 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

ఇదే కారణంగా, BMW iX, BMW i5, BMW i7 వంటి ఇతర ప్రీమియం మోడళ్లతో పోలిస్తే, iX1 మరింత అందుబాటులో ఉండే ఆప్షన్‌గా మారింది. అందుకే నేటి రోజుల్లో రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్న BMW ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, BMW iX1లో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 204 bhp పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ పవర్‌ట్రెయిన్ SUVకి మంచి పిక్-అప్‌ను ఇస్తూ, కేవలం 8.6 సెకన్లలోనే 0 నుండి 100 km/h వేగాన్ని అందుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. రేంజ్ పరంగా కూడా ఇది ఆకట్టుకునే స్థాయిలో ఉంది. పూర్తి ఛార్జ్‌పై సుమారు 531 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలగడం వల్ల, దూర ప్రయాణాలకు కూడా ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది. అదనంగా, భద్రత విషయంలో కూడా BMW ఎలాంటి రాజీ పడలేదు.

ఇందులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, అనేక ఆధునిక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. BMW iX1లో అధునాతన ఫీచర్లు ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. BMWకి ప్రత్యేకమైన కర్వ్డ్ డిస్‌ప్లే ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇందులో 10.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇంకా డజన్ల కొద్ది ఫీచర్స్ ప్రయాణికులను ఆకట్టుకుంటాయి.


Click it and Unblock the Notifications








